3 Blade vs 5 Blade: 3-బ్లేడ్ లేదా 5-బ్లేడ్.. ఈ రెండింటిలో ఏ కూలర్ ఎక్కువ గాలిని అందిస్తుందో తెలుసా?

3 Blade vs 5 Blade Cooler: వేసవి భానుడు ప్రతాపం చూపిస్తున్న వేళ, చాలామంది ఏసీలతో పాటు ఎయిర్ కూలర్ల కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నారు. అయితే కూలర్ కొనేటప్పుడు కేవలం ధర, కంపెనీ మాత్రమే కాకుండా.. అందులోని ఫ్యాన్ బ్లేడ్ల సంఖ్యను కూడా గమనించాలని మీకు తెలుసా? 3 బ్లేడ్లు, 5 బ్లేడ్ల కూలర్ల మధ్య ఉన్న తేడాలు, మీ అవసరానికి ఏది సరిపోతుందో ఓసారి చూద్దాం.

Venkata Chari
Published on: 18 March 2026 12:19 PM IST
3 Blade vs 5 Blade
X

3 Blade vs 5 Blade: 3-బ్లేడ్ లేదా 5-బ్లేడ్.. ఈ రెండింటిలో ఏ కూలర్ ఎక్కువ గాలిని అందిస్తుందో తెలుసా?

3 Blade vs 5 Blade Cooler: వేసవి వేడి పెరుగుతున్న వేళ చాలా మంది కూలర్లు కొనుగోలు చేస్తున్నారు. అయితే 3 బ్లేడ్ లేదా 5 బ్లేడ్ కూలర్ ఏది మంచిదో చాలామందికి సందేహం ఉంటుంది. సరైనది ఎంపిక చేసుకోకపోతే చల్లని గాలి అనుభవం తగ్గిపోతుంది. కాబట్టి, కొనుగోలు చేసే ముందు ఈ వివరాలు తెలుసుకోవడం తప్పనిసరి.

3 బ్లేడ్ vs 5 బ్లేడ్: అసలు తేడా ఏమిటి?

సాధారణంగా కూలర్లలో రెండు రకాల ఫ్యాన్ బ్లేడ్లు ఉంటాయి. ఎయిర్ కూలర్‌లో ఫ్యాన్ బ్లేడ్‌ల సంఖ్య గాలి వేగం, శబ్దం, కూలింగ్ పనితీరుపై ప్రభావం చూపుతుంది. మీరు కూలర్ నుంచి చాలా దూరం వరకు గాలి రావాలని కోరుకుంటే, 3 బ్లేడ్ల కూలర్ ఉత్తమ ఎంపికగా నిలుస్తుంది. 3 బ్లేడ్ కూలర్ గాలిని వేగంగా, దూరంగా పంపిస్తుంది. అయితే, 5 బ్లేడ్ కూలర్ మాత్రం సాఫ్ట్‌గా, సమంగా గాలి ఇస్తుంది.

3 బ్లేడ్ కూలర్ ఎవరికి సరైనది?

పెద్ద గది లేదా హాల్‌లో కూలర్ ఉపయోగిస్తుంటే 3 బ్లేడ్ కూలర్ బెస్ట్ ఎంపిక. ఇది వేగంగా తిరిగే మోటర్ వల్ల గాలిని ఎక్కువ దూరం పంపిస్తుంది. కూలర్‌ను కిటికీ దగ్గర లేదా కొంచెం దూరంలో ఉంచినప్పుడు ఇది చల్లని గాలిని అందిస్తుంది.

5 బ్లేడ్ కూలర్ ఎవరికి మంచిది?

బెడ్రూమ్ లేదా చదువుకునే గదుల్లో 5 బ్లేడ్ కూలర్ ఉపయోగించడం మంచిది. ఇది తక్కువ శబ్దంతో మెల్లగా చల్లని గాలిని ఇస్తుంది. గాలి ఒకే విధంగా, సాఫ్ట్‌గా రావడం వల్ల కంఫర్ట్ ఎక్కువగా ఉంటుంది. నిద్ర పోయే సమయంలో ఇబ్బంది లేకుండా కూలింగ్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్.

విద్యుత్ వినియోగంలో ఏది బెస్ట్?

కరెంట్ బిల్లు విషయానికి వస్తే, 3 బ్లేడ్ల కూలర్ స్వల్పంగా తక్కువ విద్యుత్తును వినియోగిస్తుంది. బ్లేడ్లు తక్కువగా ఉండటం వల్ల మోటార్‌పై ఒత్తిడి (Friction) తక్కువగా ఉంటుంది. ఫలితంగా ఇది మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది. అయితే, ఆధునిక మోటార్ల వల్ల 5 బ్లేడ్ల కూలర్లలో కూడా విద్యుత్ వినియోగంలో పెద్దగా తేడా కనిపించడం లేదు.

ఎక్కువ దూరం గాలి కావాలంటే 3 బ్లేడ్లు, సౌండ్ తక్కువతో చల్లని గాలి కావాలంటే 5 బ్లేడ్ల కూలర్ ఎంచుకోండి. మీ ఇంటి అవసరాలకు అనుగుణంగా సరైన నిర్ణయం తీసుకోండి.

Venkata Chari

Venkata Chari

Next Story