Gaming Laptop : గేమింగ్‌కు కొత్త కింగ్ వచ్చేశాడు.. Acer Helios 18 AI.!

Gaming Laptop : ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం ఏసర్ (Acer) గేమింగ్ ప్రియుల కోసం సరికొత్త పవర్‌ఫుల్ ల్యాప్‌టాప్‌ను గ్లోబల్ మార్కెట్లో ఆవిష్కరించింది. ‘ఏసర్ ప్రిడేటర్..

G Krishna
Published on: 1 Jun 2026 4:45 PM IST
Acer Helios 18 AI
X

Acer Helios 18 AI

Gaming Laptop : ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం ఏసర్ (Acer) గేమింగ్ ప్రియుల కోసం సరికొత్త పవర్‌ఫుల్ ల్యాప్‌టాప్‌ను గ్లోబల్ మార్కెట్లో ఆవిష్కరించింది. ‘ఏసర్ ప్రిడేటర్ హెలియోస్ 18 ఏఐ (2026)’ [Acer Predator Helios 18 AI (2026)] పేరుతో వచ్చిన ఈ లేటెస్ట్ ల్యాప్‌టాప్.. అత్యంత అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లు, కళ్లు చెదిరే స్పెసిఫికేషన్లతో లాంచ్ అయింది. ఈ ఏడాది చివర్లో ఇది అంతర్జాతీయంగా విక్రయానికి రానుంది. ఇంటెల్ కోర్ అల్ట్రా 9 ప్రాసెసర్, ఎన్విడియా ఆర్‌టీఎక్స్ 5090 గ్రాఫిక్స్ కార్డ్ వంటి అత్యంత శక్తివంతమైన హార్డ్‌వేర్‌తో ఈ గేమింగ్ ల్యాప్‌టాప్‌ను రూపొందించారు.


అందుబాటులో ఉందా..?

ఏసర్ కంపెనీ ఈ సరికొత్త గేమింగ్ ల్యాప్‌టాప్ ధరను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే, ఇది ఈ ఏడాది ఆగస్టు నెలలో నార్త్ అమెరికా , ఇఎమ్ఇఎ (EMEA) మార్కెట్లలో మొదటిసారిగా అమ్మకానికి రానున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. ఆ తర్వాత 2026 చివరి త్రైమాసికంలో (Q4) ఆస్ట్రేలియా మార్కెట్లోకి ప్రవేశించనుంది. కాగా, ఈ పవర్‌ఫుల్ ల్యాప్‌టాప్ భారతదేశంలో ఎప్పుడు విడుదల అవుతుందనే దానిపై కంపెనీ ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

డిస్‌ప్లే , ఆడియో ప్రత్యేకతలు

ఈ ల్యాప్‌టాప్ విండోస్ 11 ప్రో , విండోస్ 11 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులో గరిష్టంగా 18-అంగుళాల 4K (3,840×2,400 పిక్సెల్స్) మినీ ఎల్‌ఈడీ (mini LED) డిస్‌ప్లేను అందించారు. ఇది 1,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 240Hz రిఫ్రెష్ రేట్, ఎన్విడియా అడ్వాన్స్‌డ్ ఆప్టిమస్, ఎన్విడియా జీ-సింక్ (G-Sync), 100 శాతం డిసిఐ-పి3 (DCI-P3) కలర్ గ్యామట్, హెచ్‌డిఆర్ (HDR) మోడ్ , కాల్మాన్ వెరిఫికేషన్ వంటి అత్యుత్తమ స్క్రీన్ ఫీచర్లతో వస్తుంది. గేమింగ్ ఆడేటప్పుడు థ్రిల్లింగ్ సౌండ్ ఎఫెక్ట్స్ కోసం ప్రిడేటర్ వోక్స్ (Predator Vox) టెక్నాలజీ , డిటిఎస్:ఎక్స్ అల్ట్రా (DTS:X Ultra) తో కూడిన సిక్స్-స్పీకర్ సెటప్‌ను ఇందులో అమర్చారు. అంతేకాకుండా, ఇది ఆర్‌జిబి (RGB) బ్యాక్‌లిట్ కీబోర్డ్‌ను కలిగి ఉంది.

నెక్స్ట్-లెవెల్ ప్రాసెసర్ , స్టోరేజ్

ఈ ల్యాప్‌టాప్ ఇంటెల్ కోర్ అల్ట్రా 9 290HX ప్లస్ (Intel Core Ultra 9 290HX Plus) ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. దీనికి తోడుగా 24GB GDDR7 విరామ్ (VRAM) కలిగిన ఎన్విడియా జెఫోర్స్ ఆర్‌టీఎక్స్ 5090 (Nvidia GeForce RTX 5090) జీపీయూని జత చేశారు. మల్టీటాస్కింగ్ కోసం ఇందులో ఏకంగా 256GB వరకు DDR5 ర్యామ్ (RAM) , గరిష్టంగా 6TB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌ను సపోర్ట్ చేసే మూడు పిసిఐఇ జెన్ 5 ఎన్విఎమ్ఇ ఎస్ఎస్‌డి (PCIe Gen 5 NVMe SSD) స్లాట్లను అందించారు. ల్యాప్‌టాప్ హీట్ అవ్వకుండా ఉండటం కోసం.. సిక్స్త్ జెనరేషన్ ప్రిడేటర్ ఏరోబ్లేడ్ 3D ఫ్యాన్స్ (Predator AeroBlade 3D Fans), వెక్టర్ హీట్ పైప్ , లిక్విడ్ మెటల్ థర్మల్ గ్రీజ్ వంటి అడ్వాన్స్‌డ్ కూలింగ్ సిస్టమ్‌ను ఉపయోగించారు.

బ్యాటరీ , కనెక్టివిటీ ఫీచర్లు

ఈ భారీ గేమింగ్ ల్యాప్‌టాప్‌లో 99Wh సామర్థ్యం గల పవర్‌ఫుల్ బ్యాటరీని అమర్చారు. వీడియో కాల్స్ కోసం ఇందులో 1080p ఐఆర్ (IR) వెబ్‌క్యామ్ ఉంది. కనెక్టివిటీ పరంగా ఇది ఇంటెల్ కిల్లర్ వై-ఫై 7 (Wi-Fi 7) , బ్లూటూత్ 5.4 ని సపోర్ట్ చేస్తుంది.

ఇందులో కస్టమర్ల కోసం ఎన్నో రకాల ఐ/ఓ (I/O) పోర్టులను ఇచ్చారు. రెండు థండర్‌బోల్ట్ 5 (Thunderbolt 5) పోర్టులు.. రెండు యూఎస్‌బీ 3.2 జెన్ 1 టైప్-ఏ పోర్టులు, ఒక యూఎస్‌బీ 3.2 జెన్ 2 టైప్-ఏ పోర్ట్.. ఒక హెచ్‌డిఎమ్‌ఐ 2.1 (HDMI 2.1) పోర్ట్, ఒక ఎస్డీ కార్డ్ రీడర్.. 3.5mm ఆడియో జాక్, ఒక ఆర్‌జె-45 (RJ-45) పోర్ట్, డెడికేటెడ్ డిసి-ఇన్ స్లాట్ , కెన్సింగ్టన్ లాక్. ఈ ల్యాప్‌టాప్ 400.96×307.9x17.3 మిమీ కొలతలతో, సుమారు 3.5 కేజీల బరువును కలిగి ఉంటుంది. హై-ఎండ్ గేమింగ్ , భారీ గ్రాఫిక్స్ పనులు చేసే వారికి ఈ ల్యాప్‌టాప్ ఒక అల్టిమేట్ ఛాయిస్ అని చెప్పవచ్చు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story