కాలేజ్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఏడాది పాటు ఉచితంగా అడోబ్ ఫోటోషాప్..!
Adobe Photoshop Student Offer: ప్రముఖ టెక్ దిగ్గజం అడోబ్ భారతీయ విద్యార్థుల కోసం అద్భుతమైన ఆఫర్‌ను ప్రకటించింది.
కాలేజ్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఏడాది పాటు ఉచితంగా అడోబ్ ఫోటోషాప్..!
Adobe Photoshop Student Offer: భారతదేశంలోని కాలేజీ విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని అడోబ్ సంస్థ ఈ సరికొత్త ఆఫర్‌ను తీసుకువచ్చింది. ఫోటో ఎడిటింగ్ నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నవారికి, డిజైనింగ్ రంగంలో రాణించాలనుకునే స్టూడెంట్స్‌కు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సాధారణంగా ఈ సాఫ్ట్‌వేర్ సేవలను పొందడానికి ఏడాదికి రూ.1,999 వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ ఈ పండుగ ఆఫర్ కింద రూపాయి కూడా చెల్లించకుండా వంద శాతం డిస్కౌంట్‌తో దీనిని సొంతం చేసుకోవచ్చు.
అయితే ఈ అద్భుతమైన అవకాశం కాలేజీ విద్యార్థులకు మాత్రమే ప్రత్యేకంగా వర్తిస్తుంది. దీనిని క్లెయిమ్ చేసుకునే సమయంలో స్టూడెంట్లు తమ కాలేజీకి సంబంధించిన వివరాలను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. ఆ వివరాలను పరిశీలించిన తర్వాతే అడోబ్ సంస్థ అర్హతను నిర్ధారించి ఆఫర్‌ను యాక్టివేట్ చేస్తుంది. ఈ ప్రాసెస్ చాలా సులభంగా పూర్తి చేసుకోవచ్చు. ముందుగా అధికారిక అడోబ్ ఫోటోషాప్ స్టూడెంట్ ఆఫర్ పేజీకి వెళ్లి మీ అకౌంట్‌తో లాగిన్ అవ్వాలి. చెకౌట్ పేజీలో చెల్లించాల్సిన మొత్తం సున్నా రూపాయలుగా మారుతుంది. ఆ తర్వాత కాలేజ్ వివరాలు అందించి, పేమెంట్ పద్ధతిలో యూపీఐని ఎంచుకోవాలి. యూపీఐ ఆటోపే కోసం రూ.2 వరకు కట్ అయ్యే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఏడాది పాటు ఫోటోషాప్ సేవలు ఉచితంగా అందుతాయి.
ఇందులో గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఉచిత గడువు ముగిసిన తర్వాత సబ్‌స్క్రిప్షన్ ఆటోమేటిక్‌గా రెన్యూవల్ అవుతుంది. అంటే ఏడాది గడువు తీరిన తర్వాత మీ ఖాతా నుంచి రూ.1,999 కట్ అవుతాయి. కాబట్టి మీకు తదుపరి సంవత్సరం ఈ సర్వీసులు వద్దు అనుకుంటే, ఉచిత కాలపరిమితి ముగిసే ముందే సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేసుకోవడం ఉత్తమం. దీనివల్ల అవాంఛిత రుసుముల నుంచి తప్పించుకోవచ్చు. మరోవైపు అడోబ్ సంస్థ ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఈ ఆఫర్‌ను ఎప్పుడైనా నిలిపివేసే హక్కును కలిగి ఉంది. కాబట్టి ఆసక్తి ఉన్న విద్యార్థులు వెంటనే దీనిని ఉపయోగించుకోవడం మంచిది.




