ఇకపై వాటికి గుడ్ బై చెప్పేయండి.. రంగంలోకి ఏఐ ల్యాప్‌టాప్‌లు.. ఫీచర్లతోనే షాకిస్తున్నాయ్ గా?
Normal vs AI Laptop: టెక్నాలజీ ప్రపంచంలో AI విప్లవం వేగంగా పెరుగుతోంది. ఇప్పుడు ల్యాప్‌టాప్‌లలో కూడా ఏఐ కీలక పాత్ర పోషిస్తోంది. కంపెనీలు ప్రస్తుతం ఏఐ ల్యాప్‌టాప్‌లనే ప్రిపర్ చేస్తున్నాయి. అసలు ఈ ఏఐ ల్యాప్ టాప్ లు ఏంటి, ఇప్పటి వరకు వాడుతోన్న సాధారణ ల్యాప్‌టాప్‌ల పరిస్థితి ఏమవుతుంది? అనే విషయాలు ఓసారి చూద్దాం..

AI laptops: గత ఏడాది నుంచి టెక్ మార్కెట్‌లో ఏఐ (AI) ఓ ట్రెండ్‌గా మారింది. స్మార్ట్‌ఫోన్‌ల నుంచి ఫ్రిజ్‌లు, టీవీల వరకు AI ఫీచర్లు చేరాయి. ఇప్పుడు ల్యాప్‌టాప్‌లలో కూడా AI ఇంటిగ్రేషన్ పెరుగుతోంది. ఈ గ్లోబల్ AI బూమ్ కారణంగా మెమరీ, స్టోరేజ్, సీపీయూ వంటి భాగాల ధరలు పెరుగుతున్నాయి. 2026లో ల్యాప్‌టాప్ ధరలు 35–40% వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
సాధారణ vs ఏఐ ల్యాప్‌టాప్: అసలు తేడా ఏమిటి?
సాధారణ ల్యాప్‌టాప్‌లలో CPU, GPU అనే రెండు చిప్స్ మాత్రమే ఉంటాయి. కానీ AI ల్యాప్‌టాప్‌లలో మూడో ప్రత్యేక ప్రాసెసర్ ఎన్పీయూ (Neural Processing Unit) ఉంటుంది.
ఈ NPU వల్ల ఫొటోల గుర్తింపు, భాషను అర్థం చేసుకోవడం, టెక్స్ట్ ప్రాసెసింగ్ వంటి AI పనులు ఇంటర్నెట్ లేకుండానే ల్యాప్‌టాప్‌లోనే జరుగుతాయి. దీంతో వేగం పెరుగుతుంది, ప్రైవసీ కూడా మెరుగవుతుంది.
AI ల్యాప్‌టాప్‌ల ప్రత్యేక ఫీచర్లు...
AI ల్యాప్‌టాప్‌లలో కొన్ని అడ్వాన్స్ ఫీచర్లు వినియోగదారుల అనుభవాన్ని మార్చేస్తున్నాయి:
లైవ్ ట్రాన్స్‌లేషన్, సబ్‌టైటిల్స్: వీడియో కాల్ సమయంలో మాట్లాడిన భాషను వెంటనే టెక్స్ట్‌గా మార్చుతుంది.
లోకల్ AI అసిస్టెంట్: ఫైల్ సెర్చ్, రైటింగ్, ఎడిటింగ్ పనులు ఆఫ్‌లైన్‌లోనే వేగంగా జరుగుతాయి.
స్మార్ట్ వీడియో కాలింగ్: ఆటో బ్యాక్‌గ్రౌండ్ బ్లర్, నాయిస్ క్యాన్సిలేషన్.
బ్యాటరీ & పనితీరు మెరుగుదల: NPU వల్ల CPU-GPU మీద లోడ్ తగ్గుతుంది.
ధరలు..
AI ల్యాప్‌టాప్‌లు సాధారణ మోడళ్లతో పోలిస్తే 15–25% వరకు ఎక్కువ ఖరీదు ఉంటాయి. ఉదాహరణకు, లెనోవా AI సిరీస్ ల్యాప్‌టాప్‌లు సుమారు రూ. 94,000 నుంచి ప్రారంభమవుతాయి. అదే సమయంలో సాధారణ i7 ల్యాప్‌టాప్‌లు రూ. 71,000 నుంచి లభిస్తాయి.
ఏఐ ల్యాప్‌టాప్‌లు భవిష్యత్తులో కీలక పాత్ర పోషించనున్నాయి. అయితే ప్రతి ఒక్కరికీ అవి అవసరం లేదు. మీ వినియోగం ఆధారంగా సరైన ఎంపిక చేసుకోవడం ఉత్తమం.