Ai+ Nova 2 Power : మార్కెట్‌లోకి రాకముందే చేతికి ఫోన్.. Ai+ కొత్త ‘నోవా 2 పవర్’ స్పెషల్.!

Ai+ Nova 2 Power : స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Ai+ కంపెనీ మరో ఇంట్రెస్టింగ్ మోడల్‌ను పరిచయం చేసింది. తమ పాపులర్ నోవా 2 సిరీస్‌లో భాగంగా ‘నోవా 2 పవర్’..

G Krishna
Published on: 27 Aug 2026 12:47 PM IST
Ai+-Nova-2-Power
X

Ai+-Nova-2-Power

Ai+ Nova 2 Power : స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Ai+ కంపెనీ మరో ఇంట్రెస్టింగ్ మోడల్‌ను పరిచయం చేసింది. తమ పాపులర్ నోవా 2 సిరీస్‌లో భాగంగా ‘నోవా 2 పవర్’ (Nova 2 Power) అనే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. అయితే మిగతా బ్రాండ్స్ లాగా కేవలం కలర్‌ఫుల్ యాడ్స్, భారీ ప్రమోషన్లతో కాకుండా.. చాలా కొత్త రూట్‌లో ఈ ఫోన్‌ను ప్రమోట్ చేస్తోంది. "ప్రాజెక్ట్ ఓపెన్ రివ్యూ 2.0" అనే స్పెషల్ ప్రోగ్రామ్ ద్వారా ఈ ఫోన్ మార్కెట్‌లోకి రాకముందే టెక్ రివ్యూవర్స్, కంటెంట్ క్రియేటర్స్, జర్నలిస్ట్స్, ఎథికల్ హ్యాకర్స్‌కి అందిస్తోంది. ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా ఫోన్‌లోని ప్లసెస్, మైనసెస్ డైరెక్ట్‌గా జనాలు చెప్పాలనేది ఈ ప్రాజెక్ట్ మెయిన్ ఐడియా.

ఏంటి ఈ ‘ప్రాజెక్ట్ ఓపెన్ రివ్యూ 2.0’ స్పెషాలిటీ?

గతంలో Ai+ కండక్ట్ చేసిన ప్రాజెక్ట్ ఓపెన్ రివ్యూ ఫస్ట్ ఎడిషన్‌కి చాలా క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. ఏకంగా 700 మందికి పైగా ఆ టెస్టింగ్ ప్రోగ్రామ్‌లో పార్టిసిపేట్ చేశారు. దాంతో ఇప్పుడు సెకండ్ ఫేజ్‌ను ఇంకా పెద్ద స్థాయిలో ప్లాన్ చేశారు. ఈసారి టెక్ క్రియేటర్స్, జర్నలిస్టులతో పాటు ఎథికల్ హ్యాకర్స్‌ను కూడా ఇందులో యాడ్ చేయడం విశేషం. ఎంపికైన డెవలపర్స్, రివ్యూవర్స్ ఈ నోవా 2 పవర్ ఫోన్‌ను ముందుగానే వాడి, నచ్చినట్లు టెస్ట్ చేయవచ్చు. ఫోన్‌లో ఏవైనా సాఫ్ట్‌వేర్ లేదా సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటే కూడా ఓపెన్‌గా చెప్పే ఫ్రీడమ్ ఇచ్చారు. తమకు అనుకూలంగానే రివ్యూలు ఇవ్వాలని కంపెనీ ఎలాంటి కండిషన్స్ పెట్టకపోవడం ఇక్కడ ప్లస్ పాయింట్.

కలర్ డిజైన్‌లో కొత్త ఎక్స్‌పెరిమెంట్

డిజైన్ వైజ్ చూస్తే, నోవా 2 పవర్ ఫోన్‌లో ‘కలర్ ఫుజన్’ అనే డిఫరెంట్ ఫినిషింగ్‌ను ఆఫర్ చేస్తున్నారు. ఈ మొబైల్ ప్రెజెంట్ రెండు లూకింగ్ కలర్ ఆప్షన్లలో రానుంది. ఫస్ట్ వేరియంట్ ‘గోల్డెన్ బ్లూ ఫుజన్’ కాగా, ఇందులో గోల్డ్ , డీప్ నేవీ బ్లూ రంగులు మిక్స్ అయిన అట్రాక్టివ్ ఫినిష్ ఉంటుంది. ఇక సెకండ్ వేరియంట్ ‘బ్లూ ఫుజన్’ లో ఓషన్ బ్లూ నుంచి సన్‌సెట్ ఆరంజ్ కలర్‌కి చేంజ్ అయ్యే గ్రేడియంట్ షేడ్ లభిస్తుంది. రంగును కేవలం ఒక అదనపు ఆప్షన్‌గా కాకుండా, ఫోన్ లుక్‌కి ఒక బ్రాండ్ ఐడెంటిటీ ఇచ్చేలా ఈ డిజైన్‌ను సెట్ చేసినట్లు కంపెనీ చెప్తోంది.

ప్రాసెసర్ , సాఫ్ట్‌వేర్ పెర్ఫార్మెన్స్

హార్డ్‌వేర్ పరంగా చూస్తే, Ai+ నోవా 2 పవర్ మొబైల్‌లో ‘మీడియాటెక్ డైమెన్సిటీ 7100’ (MediaTek Dimensity 7100) ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 6nm ప్రాసెస్ టెక్నాలజీతో తయారైన ఈ చిప్‌సెట్ పవర్ఫుల్ స్పీడ్‌తో పాటు మంచి బ్యాటరీ ఎఫిషియెన్సీని అందిస్తుంది. సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే, కంపెనీ సొంతంగా డెవలప్ చేసిన ‘NxtQuantum OS’ ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఈ ఫోన్ రన్ కానుంది.

మిగతా ఫీచర్లు, కెమెరా, ప్రైస్ డిటైల్స్

ప్రస్తుతానికి ఈ ఫోన్‌కు సంబంధించిన ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ వివరాలను కంపెనీ అధికారికంగా రివీల్ చేయలేదు. దాంతో పాటు డిస్‌ప్లే సైజ్, రిఫ్రెష్ రేట్, కెమెరా సెటప్, బ్యాటరీ కెపాసిటీ, ఫాస్ట్ ఛార్జింగ్ స్పెసిఫికేషన్లను సస్పెన్స్‌లో ఉంచింది. అలాగే ఇండియన్ మార్కెట్‌లో దీని ప్రైస్ ఎంత ఉండబోతోంది, సేల్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అనే అనౌన్స్‌మెంట్ రాబోయే రోజుల్లో వెల్లడించే ఛాన్స్ ఉంది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story