ఎయిర్ ప్యూరిఫైయర్ ఫిల్టర్‌ను నీళ్లతో కడగొచ్చా.. మీ డబ్బు ఆదా చేసే ట్రిక్ ఇదిగో..!
Air Purifier Filter: చాలా ప్రాంతాల్లో వాయు కాలుష్యం 400 దాటింది. ఇది ప్రమాదకర స్థాయి. దీంతో చాలామంది ఇళ్లలో ఎయిర్ ప్యూరిఫైయర్ వాడుతున్నారు.
ఎయిర్ ప్యూరిఫైయర్ ఫిల్టర్‌ను నీళ్లతో కడగొచ్చా.. మీ డబ్బు ఆదా చేసే ట్రిక్ ఇదిగో..!
Air Purifier Filter: ఢిల్లీతో పాటు దేశంలోని పలు నగరాల్లో ప్రజలు గాలిని శుభ్రం చేసుకోవడానికి ఇళ్లలో ఎయిర్ ప్యూరిఫైయర్లు వాడుతున్నారు. మార్కెట్‌లో ఎన్నో ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. కానీ భారత్‌లో చాలామంది ప్యూరిఫైయర్ కొనుగోలు చేస్తారే తప్ప, దాని ఫిల్టర్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేయరు, మార్చరు. దీనివల్ల వారికి మళ్లీ కలుషిత గాలే అందుతుంది. ఫిల్టర్‌ను నీటితో కడగొచ్చా అనే ప్రశ్న చాలామందిలో ఉంది.
ఫిల్టర్‌ను శుభ్రం చేయడం ఎందుకు ముఖ్యం?
ఎయిర్ ప్యూరిఫైయర్ ఫిల్టర్‌ను తరచూ శుభ్రం చేస్తూ ఉండాలి. లేకపోతే శుభ్రమైన గాలి అందదు.
ఏ ఫిల్టర్‌ను నీళ్లతో కడగొచ్చు?
ప్రీ-ఫిల్టర్: ప్యూరిఫైయర్‌లో ఉండే ప్రీ-ఫిల్టర్‌ను నీళ్లతో కడగవచ్చు.
HEPA ఫిల్టర్: దీన్ని నీళ్లతో కడగకూడదు.
యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్: దీన్ని కూడా నీళ్లతో కడగకూడదు.
ఎలక్ట్రోస్టాటిక్ ఫిల్టర్: ఈ ఫిల్టర్ ఉన్న కొన్ని ప్యూరిఫైయర్లలో ఫిల్టర్‌ను నీటితో కడగవచ్చు.
అంటే ప్రీ-ఫిల్టర్‌ను కడిగి మళ్లీ వాడుకోవచ్చు. HEPA, యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్లు మాత్రం కడిగితే ఉపయోగం ఉండదు, వాటిని సమయానికి మార్చాల్సిందే.




