ఎయిర్‌టెల్ యూజర్లకు భారీ జాక్‌పాట్.. రూ.30,000 పైగా బెనిఫిట్స్..!
Airtel Insider Rewards: ఎయిర్‌టెల్ యూజర్లకు పండగ వచ్చింది! ఇన్‌సైడర్ రివార్డ్స్‌తో రూ.30,000 పైగా ప్రయోజనాలు ప్రకటించింది.
ఎయిర్‌టెల్ యూజర్లకు భారీ జాక్‌పాట్.. రూ.30,000 పైగా బెనిఫిట్స్..!
Airtel Insider Rewards: ఎయిర్‌టెల్ తన కస్టమర్ల కోసం భారీ ఇన్‌సైడర్ రివార్డ్స్ ఆఫర్ ప్రకటించింది. ఈ ప్రోగ్రామ్ కింద రూ.30,000కు పైగా ప్రయోజనాలు లభిస్తున్నాయి. సబ్‌స్క్రిప్షన్లు, రివార్డులు, ఐఫోన్ కొనుగోలుపై తగ్గింపు ఇందులో ఉన్నాయి. ఇందుకోసం ఎయిర్‌టెల్ క్రోమాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
ఐఫోన్ కొనుగోలుపై రూ.23,000 వరకు తగ్గింపు..
ఎయిర్‌టెల్, క్రోమా, యాపిల్ కలిసి ఎంపిక చేసిన ఐఫోన్ మోడళ్లపై రూ.23,000 వరకు ఆదా ఆఫర్ ఇస్తున్నాయి. ఇందులో ఐఫోన్ 15, ఐఫోన్ 16, ఐఫోన్ 17 సిరీస్‌లోని కొన్ని మోడళ్లు ఉన్నాయి. తగ్గింపు మోడల్, వేరియంట్‌ను బట్టి మారుతుంది.
ప్రయోజనం పొందడానికి ఎయిర్‌టెల్ యాప్‌లో క్రోమా ఆఫర్‌పైకి వెళ్లి Claim Now నొక్కాలి. వచ్చిన కూపన్ కోడ్‌ను క్రోమా స్టోర్, వెబ్‌సైట్ లేదా Tata Neuలో కొనుగోలు సమయంలో వాడుకోవచ్చు.
ఏడాది ఉచిత సూపర్ డ్యూలింగో, 3 నెలల పాకెట్ ఎఫ్ఎం..
భాషలు నేర్చుకునే వారికి 12 నెలల సూపర్ డ్యూలింగో సబ్‌స్క్రిప్షన్ ఉచితం. దీని విలువ రూ.3,120గా చెబుతున్నారు. ఇందులో యాడ్స్ ఉండవు, అదనపు ఫీచర్లు లభిస్తాయి. ఈ ఆఫర్‌ను డిసెంబర్ 2, 2026 వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు.
ఆడియో కథలు వినేవారికి 3 నెలల పాకెట్ ఎఫ్ఎం ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. ఎయిర్‌టెల్ యాప్‌లో పాకెట్ ఎఫ్ఎం ఆఫర్ క్లెయిమ్ చేసి, అదే ఎయిర్‌టెల్ నంబర్‌తో లాగిన్ కావాలి. దీన్ని ఫిబ్రవరి 3, 2027 వరకు క్లెయిమ్ చేయవచ్చు.
సినీపోలిస్‌లో సినిమా టికెట్, ఫుడ్‌పై తగ్గింపు..
సినీపోలిస్‌లో రెండు టికెట్లు కొంటే మూడో టికెట్ ఉచితం. అయితే మూడో టికెట్‌పై తగ్గింపు గరిష్ఠంగా రూ.150 వరకే.
ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు సినీపోలిస్‌లో రూ.1,500 అంతకంటే ఎక్కువ ఫుడ్, బేవరేజ్ ఆర్డర్‌పై రూ.300 తగ్గింపు లభిస్తుంది. కుటుంబం, స్నేహితులతో సినిమాకు వెళ్లేవారికి ఇది ఉపయోగం.
అపోలో 24/7 ఆరు నెలల మెంబర్‌షిప్..
ఇన్‌సైడర్‌లో అపోలో సర్కిల్ మెంబర్‌షిప్ కూడా ఉంది. ఆరు నెలల మెంబర్‌షిప్‌తో ప్లాట్‌ఫామ్ ఆఫర్లు, తగ్గింపులు పొందవచ్చు. క్లెయిమ్ సమయంలో రూ.2 చెల్లించి AutoPay సెట్ చేయాలి. ఆరు నెలల తర్వాత ఆటోమేటిక్‌గా రెన్యూ అవుతుంది. అప్పుడు ప్రతి ఆరు నెలలకు రూ.149 లేదా అప్పటి ఫీజు వసూలవుతుంది. వద్దనుకుంటే ఉచిత గడువు ముగిసేలోపు ఆటో పే ఆపాలి.
ఎలా క్లెయిమ్ చేయాలి?
ముందుగా ఎయిర్ టెల్ యాప్ తెరిచి మీ నంబర్‌తో లాగిన్ కండి. రివార్డ్స్, ఓటీటీ లేదా ఎయిర్ టెల్ ఇన్ సైడర్ విభాగంలో ఆఫర్లు చూడండి. కావాల్సిన ఆఫర్ ఎంచుకుని క్లెయిమ్ నొక్కండి. కొన్నిటికి కూపన్ కోడ్ వస్తుంది, మరికొన్నిటికి సంబంధిత యాప్‌లో లాగిన్ కావాలి.
ఈ ఆఫర్లు అర్హులైన ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్, వై-ఫై, డీటీహెచ్ కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి. అయితే అందరికీ అన్ని ఆఫర్లు రావడం ఖాయం కాదు. అర్హత ఎయిర్‌టెల్ యాప్‌లో కనిపిస్తుంది.
రూ.30,000 ఆఫర్ లాభదాయకమా?
కొత్త ఐఫోన్ కొనాలనుకునేవారు, డ్యూయిలింగో, పాకెట్ ఎఫ్ఎం, సినీపోలీస్ వాడేవారికి ఖర్చు ఆదా అవుతుంది. కానీ రూ.30,000ను ఉచిత నగదుగా భావించడం తప్పు. ఇందులో ఐఫోన్‌పై సంభావ్య తగ్గింపు కూడా కలిసి ఉంది, కొన్ని ఆఫర్లకు చెల్లింపు, ఆటో పే షరతులు ఉన్నాయి.




