Airtel: ముందస్తు సమాచారం లేకుండానే వడ్డన.. ఎయిర్‌టెల్ పాపులర్ ప్రీపెయిడ్ ప్లాన్ ధర పెంపు!

Airtel: ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ ధరల పెంపు. 84 రోజుల వ్యాలిడిటీ కలిగిన రూ.859 ప్లాన్ ఇకపై రూ.899. జియో ప్లాన్లతో పోలిక మరియు పూర్తి వివరాలు.

Arun Chilukuri
Published on: 20 April 2026 3:19 PM IST
Airtel
X

Airtel: ముందస్తు సమాచారం లేకుండానే వడ్డన.. ఎయిర్‌టెల్ పాపులర్ ప్రీపెయిడ్ ప్లాన్ ధర పెంపు!

Airtel: ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ తన వినియోగదారులకు గట్టి షాకిచ్చింది. ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండానే తన పాపులర్ ప్రీపెయిడ్ ప్లాన్ ధరను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఎక్కువ మంది వినియోగదారులు ఇష్టపడే 84 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ ధర ఇప్పుడు మరింత ప్రియం కానుంది.

ఇప్పటివరకు రూ.859గా ఉన్న 84 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను ఎయిర్‌టెల్ ఇప్పుడు రూ.899కి సవరించింది. అంటే వినియోగదారులపై అదనంగా రూ.40 భారం పడనుంది. ధర పెరిగినప్పటికీ, పాత ప్లాన్‌లో ఉన్న ప్రయోజనాలే కొనసాగుతున్నాయి తప్ప, కొత్తగా ఎటువంటి అదనపు బెనిఫిట్స్ జోడించకపోవడం గమనార్హం.

రూ.899 ప్లాన్ ప్రయోజనాలు ఇవే:

వ్యాలిడిటీ: 84 రోజులు.

డేటా: రోజుకు 1.5 జీబీ హైస్పీడ్ డేటా.

కాలింగ్: అపరిమిత వాయిస్ కాల్స్.

ఎస్సెమ్మెస్: రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు.

ఇతరాలు: ఉచిత హలోట్యూన్ ప్రయోజనాలు.

జియోతో పోలిస్తే వెనుకబాటే:

ఒకవైపు ప్రత్యర్థి సంస్థ రిలయన్స్ జియో రూ.899 ప్లాన్‌తోనే 84 రోజుల వ్యాలిడిటీ ఇస్తూ, రోజుకు 2జీబీ డేటాతో పాటు మరో 20జీబీ అదనపు డేటాను అందిస్తోంది. కానీ ఎయిర్‌టెల్ అదే ధరలో కేవలం 1.5జీబీ డేటా మాత్రమే ఇవ్వడం గమనార్హం. మరోవైపు, రోజుకు 1.5 జీబీ డేటాతో ఉన్న రూ.799 ప్లాన్‌ను కూడా ఎయిర్‌టెల్ తొలగించింది.

కారణం ఇదేనా?

ప్రతి యూజర్ నుంచి వచ్చే సగటు ఆదాయాన్ని (ARPU) పెంచుకోవడమే లక్ష్యంగా టెలికాం కంపెనీలు ఈ తరహా ధరల పెంపునకు మొగ్గు చూపుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సవరణతో ఎయిర్‌టెల్ రెగ్యులర్ కస్టమర్ల జేబుకు చిల్లు పడటం ఖాయంగా కనిపిస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story