Airtel: ఎయిర్‌టెల్ సబ్‌స్క్రైబర్లకు బిగ్ షాక్.. రూ.299 ప్రీపెయిడ్ ప్లాన్ రద్దు!

Airtel: ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ రూ.299 ఎంట్రీ లెవల్ ప్రీపెయిడ్ ప్లాన్‌ను తొలగించింది.

Arun Chilukuri
Published on: 5 Aug 2026 4:30 PM IST
Airtel
X

Airtel: ఎయిర్‌టెల్ సబ్‌స్క్రైబర్లకు బిగ్ షాక్.. రూ.299 ప్రీపెయిడ్ ప్లాన్ రద్దు!

Airtel: ప్రముఖ టెలికామ్ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ (Airtel) తన వినియోగదారులకు షాకిచ్చింది. అత్యంత ప్రజాదరణ పొందిన రూ. 299 ఎంట్రీ లెవల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను సైలెంట్‌గా తొలగించింది. ఎయిర్‌టెల్ అధికారిక వెబ్‌సైట్ మరియు 'ఎయిర్‌టెల్ థాంక్స్' యాప్ నుంచి ఈ ప్లాన్‌ను పూర్తిగా ఎత్తివేసింది. గతంలో రీఛార్జ్ ధరల సవరణ చేపట్టిన ఏడాది వ్యవధిలోనే మళ్లీ ఈ మార్పు చేయడం గమనార్హం.

ఇప్పటివరకు రూ. 299 ప్లాన్‌తో 28 రోజుల వ్యాలిడిటీ, ప్రతిరోజు 1GB డేటా, అపరిమిత ఉచిత కాల్స్, రోజుకు 100 SMSలు, పెర్‌ప్లెక్సిటీ ప్రో AI సబ్‌స్క్రిప్షన్ లభించేవి. రూ. 299 ప్లాన్ స్థానంలో ఇప్పుడు 28 రోజుల వ్యాలిడిటీ కేటగిరీలో రూ. 349 ప్లాన్ మాత్రమే అందుబాటులో ఉంది. ఇందులో అపరిమిత కాల్స్‌తో పాటు రోజుకు 2GB డేటా, 100 SMSలు, 6 నెలల ఆపిల్ మ్యూజిక్ (Apple Music) సబ్‌స్క్రిప్షన్ లభిస్తాయి.

రూ. 299తో పాటు రూ. 579 (56 రోజుల వ్యాలిడిటీ, 1.5GB/రోజు) మరియు రూ. 619 (60 రోజుల వ్యాలిడిటీ, 1.5GB/రోజు) ప్లాన్లను కూడా ఎయిర్‌టెల్ తొలగించింది. ప్రారంభంలో కొన్ని ఎంపిక చేసిన టెలికాం సర్కిళ్లలో మాత్రమే ఈ మార్పులు చేయగా, ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని సర్కిళ్లలో ఈ ప్లాన్లను తీసివేసినట్లు సమాచారం.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story