Airtel: ఎయిర్‌టెల్ యూజర్లకు పండగే.. ఆ పాపులర్ రీఛార్జ్ ప్లాన్ మళ్లీ వచ్చేసింది

ఎయిర్‌టెల్ తన రూ.299 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను మళ్లీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో 28 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 1GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలు లభిస్తాయి.

CR Reddy
Published on: 9 Nov 2026 9:27 AM IST
Airtel
X

Airtel

Airtel: ఎయిర్‌టెల్ వినియోగదారులకు గుడ్ న్యూస్. కొంతకాలం క్రితం నిలిపివేసిన రూ.299 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను కంపెనీ మళ్లీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లో రోజుకు 1GB డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్, SMS సదుపాయాలు కూడా లభిస్తాయి. ముఖ్యంగా ఎక్కువ ఇంటర్నెట్ డేటా అవసరం లేని వారికి ఇది ఉపయోగపడే రీఛార్జ్ ఆప్షన్. రూ.299 ప్లాన్‌తో పాటు ఎయిర్‌టెల్ అందిస్తున్న మరో మూడు తక్కువ ధర రీఛార్జ్ ప్లాన్ల వివరాలు కూడా తెలుసుకుందాం.

రూ.299 ప్లాన్ మళ్లీ అందుబాటులోకి..

ఎయిర్‌టెల్ గతంలో రూ.299 ప్రీపెయిడ్ ప్లాన్‌ను తన వెబ్‌సైట్, Airtel Thanks యాప్ నుంచి తొలగించింది. దీంతో ఈ రీఛార్జ్ అందుబాటులో లేకుండా పోయింది. తాజాగా కంపెనీ మరోసారి ఈ ప్లాన్‌ను జాబితాలో చేర్చింది. ప్రస్తుతం రూ.299తో రీఛార్జ్ చేసుకునే వినియోగదారులకు 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. రోజుకు 1GB డేటా చొప్పున మొత్తం 28GB డేటా ఉపయోగించుకోవచ్చు. దేశవ్యాప్తంగా అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, ఉచిత నేషనల్ రోమింగ్ సదుపాయం కూడా ఉన్నాయి. రోజుకు 100 SMSలు పంపుకునే అవకాశం కల్పిస్తోంది.

తక్కువ డేటా వాడేవారికి రూ.185 ప్లాన్

ఎక్కువ డేటా అవసరం లేని వినియోగదారుల కోసం ఎయిర్‌టెల్ రూ.185 రీఛార్జ్ ప్లాన్‌ను కూడా అందిస్తోంది. ఈ ప్లాన్‌లో 28 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. దేశవ్యాప్తంగా అన్‌లిమిటెడ్ కాలింగ్, ఉచిత నేషనల్ రోమింగ్ సదుపాయాలు లభిస్తాయి. దీంతో పాటు మొత్తం 300 ఉచిత SMSలు అందిస్తారు. అయితే ఈ ప్లాన్‌లో రోజువారీ డేటా ప్రయోజనం ఇవ్వడం లేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రధానంగా కాల్స్, మెసేజ్‌ల కోసం సిమ్ వాడేవారికి ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది.

30 రోజుల వ్యాలిడిటీతో రూ.203 రీఛార్జ్

నెల రోజుల పాటు రీఛార్జ్ గురించి ఆలోచించకుండా ఉండాలనుకునే వారికి రూ.203 ప్లాన్ మరో ఆప్షన్. ఇందులో 30 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. దేశవ్యాప్తంగా అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, ఉచిత నేషనల్ రోమింగ్ సదుపాయాలు ఉంటాయి. వినియోగదారులకు మొత్తం 300 ఉచిత SMSలు కూడా అందిస్తారు. అయితే ఇందులోనూ డేటా ప్రయోజనం లేదు. ఇంటర్నెట్ అవసరం తక్కువగా ఉండి, కాలింగ్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు ఈ ప్లాన్‌ను పరిశీలించవచ్చు.

క్యాలెండర్ నెల వ్యాలిడిటీతో రూ.206 ప్లాన్

ఎయిర్‌టెల్ అందిస్తున్న మరో తక్కువ ధర రీఛార్జ్ రూ.206. ఈ ప్లాన్ ప్రత్యేకత క్యాలెండర్ నెల ప్రాతిపదికన వ్యాలిడిటీ లభించడం. అంటే సాధారణంగా రీఛార్జ్ చేసిన రోజు నుంచి 30 రోజులు లెక్కించే విధానానికి బదులుగా, నెలవారీ క్యాలెండర్ ప్రకారం వ్యాలిడిటీ ఉంటుంది. ఇందులోనూ అన్‌లిమిటెడ్ కాలింగ్, ఉచిత నేషనల్ రోమింగ్, మొత్తం 300 SMSలు లభిస్తాయి. కాబట్టి తమ అవసరాలకు తగ్గట్టుగా 28 రోజులు, 30 రోజులు లేదా క్యాలెండర్ నెల వ్యాలిడిటీ కోరుకునేవారు ఈ ప్లాన్లలో ఒకదాన్ని ఎంచుకోవచ్చు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.