Redmi Phone Offers : అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్.. రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్లపై స్పెషల్ ఆఫర్స్..

Redmi Phone Offers : అమెజాన్ ఇండియాలో 'Great Summer Sale' గ్రాండ్‌గా స్టార్ట్ అయింది. స్మార్ట్‌ఫోన్స్, స్మార్ట్ టీవీలు, ఏసీలు ఇంకా ఇతర ఎలక్ట్రానిక్స్..

G Krishna
Published on: 9 May 2026 12:59 PM IST
Redmi-Phone-Offers
X

Redmi-Phone-Offers

Redmi Phone Offers : అమెజాన్ ఇండియాలో 'Great Summer Sale' గ్రాండ్‌గా స్టార్ట్ అయింది. స్మార్ట్‌ఫోన్స్, స్మార్ట్ టీవీలు, ఏసీలు ఇంకా ఇతర ఎలక్ట్రానిక్స్ కేటగిరీలపై ఈ సేల్‌లో భారీ డిస్కౌంట్లు ఇస్తున్నారు. లిమిటెడ్ పీరియడ్ ప్రైస్ కట్స్ మాత్రమే కాకుండా ఎక్స్ఛేంజ్ ఆఫర్స్, క్యాష్‌బ్యాక్ డీల్స్ తో పాటు బ్యాంక్ డిస్కౌంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్, ఈజీ-ఈఎమ్‌ఐ ఆప్షన్ వాడుకునే వారికి 10 శాతం వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందే ఛాన్స్ ఉంది. వేసవి ఎండల నుంచి ఉపశమనం కోసం ఏసీలు కొనాలనుకునే వారికి, కొత్త గాడ్జెట్స్ ప్లాన్ చేసే వారికి ఇదొక మంచి ఆపర్చునిటీ అని చెప్పవచ్చు.

రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్లపై స్పెషల్ ఆఫర్స్

బడ్జెట్ రేంజ్ నుండి ప్రీమియం మిడ్-రేంజ్ వరకు రెడ్‌మీ ఫోన్లపై ఈ సేల్‌లో మంచి ప్రైస్ డ్రాప్స్ కనిపిస్తున్నాయి. హై-ఎండ్ మోడల్ అయిన 'Redmi Note 15 Pro+ 5G' ఒరిజినల్ ప్రైస్ 39,999 రూపాయలు ఉండగా, ఇప్పుడు సేల్‌లో ఎఫెక్టివ్ ప్రైస్ కింద 37,249 రూపాయలకే లభిస్తోంది. అలాగే 'Redmi Note 15 Pro 5G' పై కూడా అదిరిపోయే డిస్కౌంట్ ఉంది. 33,999 రూపాయల ధర గల ఈ ఫోన్ ఇప్పుడు కేవలం 27,499 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు. వీటితో పాటు 'Redmi Note 14 Pro+ Prime Edition' కూడా 34,099 రూపాయల డిస్కౌంట్ ప్రైస్‌తో సేల్‌లో ఉంది.

తక్కువ బడ్జెట్ ఫోన్ల పరిస్థితి ఏంటి?

కొంచెం తక్కువ ప్రైస్ లో ఫోన్ కావాలనుకునే వారికి కూడా అమెజాన్ మంచి ఆప్షన్స్ ఇస్తోంది. 'Redmi Note 15 5G' స్మార్ట్‌ఫోన్ 26,999 రూపాయల నుండి 22,999 రూపాయలకు తగ్గింది. అదేవిధంగా 'Redmi Note 14 Pro 5G Prime Edition' ఫోన్ 25,499 రూపాయల వద్ద అందుబాటులో ఉంది. మరీ తక్కువ బడ్జెట్‌లో ఎంట్రీ లెవల్ 5G ఫోన్ కావాలనుకునే వారికి 'Redmi A7 Pro 5G' ఒక బెస్ట్ డీల్ అని చెప్పాలి. దీని యాక్చువల్ ప్రైస్ 15,999 రూపాయలు కాగా, సేల్ ఆఫర్ లో భాగంగా కేవలం 11,999 రూపాయలకే కొనుగోలు చేయవచ్చు.

ఇతర గ్యాడ్జెట్స్ , స్మార్ట్ టీవీలు

కేవలం మొబైల్స్ మాత్రమే కాకుండా ఆపిల్, ఆసస్ లాంటి బ్రాండ్ల లాప్‌టాప్స్‌పై కూడా అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‌లో సూపర్ డీల్స్ రన్ అవుతున్నాయి. శామ్సంగ్, సోనీ, టీసీఎల్ లాంటి టాప్ బ్రాండ్ల స్మార్ట్ టీవీలపై కూడా భారీ తగ్గింపులు ఉన్నాయి. మూవీస్ , గేమింగ్ కోసం కొత్త టీవీ, ల్యాప్‌టాప్ ప్లాన్ చేసే వారికి బ్యాంక్ ఆఫర్స్ తో కలిపి ఈ సేల్ చాలా ప్లస్ అవుతుంది. పార్ట్‌నర్ పేమెంట్ ఆఫర్స్ ని సరిగ్గా వాడుకుంటే అడిషనల్ సేవింగ్స్ కూడా చేసుకోవచ్చు. ఈ సమ్మర్ లో టెక్ అప్‌గ్రేడ్ కోసం ఎదురుచూసే వారికి అమెజాన్ ప్లాట్‌ఫామ్ ఇప్పుడు ఒక హాట్ స్పాట్ లా మారింది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story