AMD Ryzen 5 7500 : AMD నుంచి బిగ్ సర్‌ప్రైజ్.. బడ్జెట్‌లో దుమ్మురేపే చిప్స్
AMD Ryzen 5 7500 : కంప్యూటర్ ప్రియులకు, గేమర్లకు ప్రముఖ గ్లోబల్ చిప్‌మేకర్ AMD అదిరిపోయే శుభవార్త అందించింది. తన ప్రాసెస్ కేటగిరీలో సరికొత్తగా..
AMD Ryzen 5 7500
AMD Ryzen 5 7500 : కంప్యూటర్ ప్రియులకు, గేమర్లకు ప్రముఖ గ్లోబల్ చిప్‌మేకర్ AMD అదిరిపోయే శుభవార్త అందించింది. తన ప్రాసెస్ కేటగిరీలో సరికొత్తగా AMD Ryzen 5 7500 , AMD Ryzen 5 5500F అనే రెండు పవర్‌ఫుల్ డెస్క్‌టాప్ ప్రాసెసర్లను అధికారికంగా ఆవిష్కరించింది. సరికొత్త టెక్నాలజీతో డెస్క్‌టాప్ సామర్థ్యాన్ని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లేలా, అదే సమయంలో జేబుకు చిల్లు పడకుండా రీజనబుల్ బడ్జెట్‌లో AM5, AM4 ప్లాట్‌ఫారమ్‌లను లక్ష్యంగా చేసుకుని కంపెనీ ఈ చిప్‌లను రూపొందించింది. ఇన్‌బిల్ట్ గ్రాఫిక్స్ కోరుకునే వారికోసం 7500 మోడల్ సిద్ధమవ్వగా, బడ్జెట్ ధరకు ప్రాధాన్యమిచ్చే AM4 యూజర్ల కోసం 5500F మోడల్ అందుబాటులోకి వచ్చింది.
స్పీడ్ అండ్ పవర్ ప్యాక్డ్.. AMD Ryzen 5 7500 సంచలనం
సరికొత్త Zen 4 ఆర్కిటెక్చర్‌పై రూపొందించిన AMD Ryzen 5 7500 ప్రాసెసర్ AM5 సాకెట్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇందులో 6 కోర్లు , 12 త్రెడ్లు సపోర్ట్ చేస్తుండటంతో మల్టీ టాస్కింగ్ అత్యంత సులభంగా మారుతుంది. ఇది 3.7GHz బేస్ క్లాక్ స్పీడ్‌తో ప్రారంభమై ఏకంగా 5GHz బూస్ట్ స్పీడ్‌ను అందుకుంటుంది. 6MB L2 , 32MB L3 క్యాష్‌తో వస్తున్న ఈ ప్రాసెసర్ కోర్లను TSMC 5nm ప్రాసెస్‌పై, ఐ/ఓ (I/O) డైని 6nm ప్రాసెస్‌పై తయారు చేశారు. ఇందులో రేడియోన్ ఇన్‌బిల్ట్ గ్రాఫిక్స్ ఉండటం విశేషం. ఇది A620 నుండి బ్రాండ్ న్యూ X870E, B850 వరకు విస్తృతమైన మదర్‌బోర్డ్ చిప్‌సెట్‌లకు అనుకూలంగా పనిచేస్తుంది.
బడ్జెట్ కింగ్.. AMD Ryzen 5 5500F జోరు
తక్కువ బడ్జెట్‌లో నమ్మకమైన పెర్ఫార్మెన్స్ కోరుకునే వారి కోసం Zen 3 ఆర్కిటెక్చర్‌తో AMD Ryzen 5 5500F మార్కెట్లోకి వచ్చింది. ఇది AM4 సాకెట్ ప్లాట్‌ఫారమ్‌ను మరింత విస్తరించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో కూడా 6 కోర్లు, 12 త్రెడ్లు ఉండగా.. ఇది 3GHz బేస్ క్లాక్ స్పీడ్‌తో మొదలై 4.4GHz వరకు బూస్ట్ అవుతుంది. దీని తయారీకి TSMC 7nm FinFET ప్రాసెస్‌ను ఉపయోగించారు. 3MB L2, 16MB L3 క్యాష్ కలిగిన ఈ ప్రాసెసర్ పాపులర్ X570, B550, A520 వంటి AM4 ఆధారిత మదర్‌బోర్డ్‌లన్నింటికీ సపోర్ట్ ఇస్తుంది.
కూలింగ్ సిస్టమ్ & సపోర్టింగ్ ఫీచర్లు
ఈ రెండు ప్రాసెసర్లు కేవలం 65W డిఫాల్ట్ TDP కలిగి ఉండి, అత్యుత్తమ పవర్ ఎఫిషియెన్సీని అందిస్తాయి. అలాగే వీటితో పాటు హీట్ మేనేజ్‌మెంట్ కోసం AMD Wraith Stealth థర్మల్ కూలింగ్ సొల్యూషన్‌ను కంపెనీ ఉచితంగా అందిస్తోంది. ఇవి గరిష్టంగా 95 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వరకు సురక్షితంగా పనిచేస్తాయి. ఆపరేటింగ్ సిస్టమ్‌ల పరంగా చూస్తే.. విండోస్ 10, విండోస్ 11 (64-బిట్)లతో పాటు లైనక్స్ వేరియంట్లయిన RHEL, ఉబుంటు (Ubuntu) సీఎస్‌లను ఇవి ఫుల్‌గా సపోర్ట్ చేస్తాయి. బడ్జెట్ ధరలో కొత్త కంప్యూటర్ బిల్డ్ చేయాలనుకునే వారికి ఈ రెండు ప్రాసెసర్లు తిరుగులేని ఆప్షన్లుగా నిలవనున్నాయి.




