Android 17: Pixel యూజర్లకు బంపర్ గిఫ్ట్.. Android 17 వచ్చేసింది!

Android 17: టెక్ దిగ్గజం గూగుల్ అందరినీ ఆశ్చర్యపరుస్తూ తన సాఫ్ట్‌వేర్ షెడ్యూల్ కంటే ముందే సరికొత్త 'ఆండ్రాయిడ్ 17' (Android 17) స్టేబుల్ వెర్షన్‌ను అధికారికంగా

G Krishna
Published on: 17 Jun 2026 8:31 PM IST
android 17
X

android 17

Android 17: టెక్ దిగ్గజం గూగుల్ అందరినీ ఆశ్చర్యపరుస్తూ తన సాఫ్ట్‌వేర్ షెడ్యూల్ కంటే ముందే సరికొత్త 'ఆండ్రాయిడ్ 17' (Android 17) స్టేబుల్ వెర్షన్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఎప్పటిలాగే ఈ అప్‌డేట్ మొదటగా గూగుల్ పిక్సెల్ (Google Pixel) స్మార్ట్‌ఫోన్ల వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఈ సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌లో మల్టీటాస్కింగ్, కంటెంట్ క్రియేషన్, , ప్రైవసీకి సంబంధించి కీలక మార్పులు చేశారు.

యాప్ 'బబుల్స్'తో సులువైన మల్టీటాస్కింగ్

యూజర్ల మల్టీటాస్కింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరిచేందుకు ఆండ్రాయిడ్ 17 లో 'బబుల్స్' (Bubbles) ఫీచర్‌ను అప్‌గ్రేడ్ చేశారు. హోమ్ స్క్రీన్‌పై ఉన్న ఏదైనా యాప్ ఐకాన్‌ను లాంగ్ ప్రెస్ చేయడం ద్వారా దాన్ని చిన్న ఫ్లోటింగ్ విండోలా (స్క్రీన్ పై తేలియాడేలా) మార్చుకోవచ్చు. దీనివల్ల ఒక యాప్‌లో పని చేస్తూనే, స్క్రీన్ మార్చకుండానే మరో యాప్‌ను కూడా వాడుకోవచ్చు. పిక్సెల్ టాబ్లెట్, ఫోల్డబుల్ ఫోన్ల వంటి పెద్ద స్క్రీన్ డివైజ్‌ల కోసం కింద భాగంలో ఒక ప్రత్యేక 'బబుల్ బార్'ను కూడా అందించారు.

క్రియేటర్ల కోసం 'స్క్రీన్ రియాక్షన్స్'

యూట్యూబర్లు, కంటెంట్ క్రియేటర్ల కోసం ఇందులో 'స్క్రీన్ రియాక్షన్స్' (Screen Reactions) అనే సూపర్ ఫీచర్ వచ్చింది. మీరు ఫోన్ స్క్రీన్‌ను రికార్డ్ చేస్తున్నప్పుడు, అదే సమయంలో ఫ్రంట్ కెమెరాను ఆన్ చేసి మీ రియాక్షన్స్‌ను కూడా కలిపి రికార్డ్ చేయవచ్చు. దీనికోసం ఎలాంటి థర్డ్ పార్టీ యాప్స్ , గ్రీన్ స్క్రీన్ ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌ల అవసరం లేదు. ఆండ్రాయిడ్ సిస్టమే బ్యాక్‌గ్రౌండ్‌ను క్లియర్ చేసి మీ ఫేస్ రికార్డింగ్‌ను స్క్రీన్ పై చూపిస్తుంది.

ఫోల్డబుల్ ఫోన్ల కోసం 'గేమింగ్ మోడ్'

ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్లు వాడేవారి కోసం ప్రత్యేకంగా 'ఫోల్డబుల్ గేమింగ్ మోడ్'ను పరిచయం చేశారు. ఇది స్క్రీన్‌ను 50/50 లేఅవుట్‌గా విడగొడుతుంది. అంటే స్క్రీన్ పైభాగంలో గేమ్ కనిపిస్తుండగా, కింది భాగం ఒక గేమ్‌ప్యాడ్ (కంట్రోలర్) లాగా మారిపోతుంది. దీనివల్ల గేమ్స్ ఆడటం మరింత సులభం అవుతుంది. అలాగే రామ్‌ (RAM) మేనేజ్‌మెంట్‌ను మెరుగుపరచడం ద్వారా గేమింగ్ సమయంలో ఎక్కడా లాగ్స్ లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

మరింత పటిష్టమైన ప్రైవసీ & యాంటీ-థెఫ్ట్ ఫీచర్స్

ఆండ్రాయిడ్ 17 లో సెక్యూరిటీని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లారు. ఏదైనా యాప్‌నకు మీ కాంటాక్ట్ లిస్ట్ మొత్తం ఇవ్వకుండా, కేవలం మీకు నచ్చిన నిర్దిష్ట కాంటాక్ట్‌లను మాత్రమే షేర్ చేసే ప్రైవసీ ఆప్షన్‌ను తెచ్చారు. యాప్‌లకు కేవలం ఒక్కసారి మాత్రమే వాడేలా టెంపరరీ లొకేషన్ పర్మిషన్ ఇవ్వచ్చు. యాప్ క్లోజ్ అవ్వగానే పర్మిషన్ ఆటోమేటిక్‌గా క్యాన్సిల్ అవుతుంది. ఒకవేళ మీ ఫోన్ ఎక్కడైనా పోతే, ఫైండ్ హబ్ (Find Hub) ద్వారా బయోమెట్రిక్స్ ఉపయోగించి ఫోన్‌ను లాక్ చేయవచ్చు. దీనివల్ల దొంగకు మీ లాక్ స్క్రీన్ పిన్ నంబర్ తెలిసినప్పటికీ, వారు ఫోన్ లోపల డేటాను యాక్సెస్ చేయలేరు.

విజువల్ చేంజెస్ , క్లీన్ లుక్

తమ ఫోన్ స్క్రీన్ మినిమలిస్టిక్‌గా ఉండాలనుకునే వారి కోసం హోమ్ స్క్రీన్‌పై యాప్ ఐకాన్ల కింద ఉండే పేర్లను హైడ్ (Hide) చేసుకునే సదుపాయాన్ని కల్పించారు. దీనివల్ల స్క్రీన్ పై కేవలం యాప్ ఐకాన్లు మాత్రమే కనిపిస్తాయి. దీంతో పాటు వాల్యూమ్ ప్యానెల్, పవర్ మెనూ లలో సరికొత్త బ్లర్ , ట్రాన్స్‌లూసెంట్ ఎఫెక్ట్ డిజైన్‌లను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఈ స్టేబుల్ అప్‌డేట్ పిక్సెల్ 6 సిరీస్ , ఆ పైబడిన అన్ని పిక్సెల్ మోడల్స్కు లభిస్తోంది. రాబోయే రోజుల్లో శామ్‌సంగ్, వన్‌ప్లస్, షియోమీ వంటి ఇతర కంపెనీల ఫోన్లకు కూడా ఈ ఆండ్రాయిడ్ 17 అప్‌డేట్ క్రమంగా అందుబాటులోకి రానుంది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story