Apple: భారీ డిస్కౌంట్- తక్కువ ధరకే ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్
iPhone Discount Offer: ప్రపంచ టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ 50వ వార్షికోత్సవాన్ని పురష్కరించుకొని ఓ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది.
Apple: భారీ డిస్కౌంట్- తక్కువ ధరకే ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్
iPhone Discount Offer: ప్రపంచ టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ 50వ వార్షికోత్సవాన్ని పురష్కరించుకొని ఓ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. భారత్‌లోని యాపిల్ రీసెల్లర్ ఇమేజిన్ స్టోర్ నుంచి తక్కువ ధరకు ఐఫోన్, ఐప్యాడ్, యాపిల్ వాచ్ మోడళ్లను పొందవచ్చు. ఈ సేల్‌లో భాగంగానే అత్యంత ఖరీదైన ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌ను సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేలా భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది.
సాధారణ మొబైల్ ఫోన్లు సైతం రూ. 80 నుంచి రూ. 90 వేల వరకు మార్కెట్లో దొరుకుతున్నాయి. కానీ, యాపిల్ మొబైల్ కొనుగోలు చేయాలంటే కనీసం లక్ష రూపాయలపైగా పెట్టాలి. ఇక 17 ప్రో మ్యాక్స్ కొనుగోలు చేయాలంటే లక్షన్నర పెట్టాల్సిందే. అయితే, ఇప్పుడు యాపిల్ సంస్థ 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని రూ. 1,49,900 విలువ చేసే 17 ప్రో మ్యాక్స్‌ను కేవలం 1,02,900కే అందిస్తోంది. అయితే, ఇక్కడ కొన్ని షరతులను పెట్టింది. ఇన్స్టెంట్ డిస్కౌంట్‌తో పాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డులపై లభించే క్యాష్‌బ్యాక్, పాత ఫోన్ ఎక్చేంజ్పై వచ్చే బోనస్ వంటివన్నీ కలిపి ఈ తగ్గింపును అందిస్తున్నట్టుగా స్టోర్ ప్రకటించింది.
ఐఫోన్‌తో పాటు ఐప్యాడ్, యాపిల్ వాచ్ సీరిస్ 11 మోడళ్లపై కూడా డిస్కౌంట్, క్యాష్‌బ్యాక్ ఆఫర్లను అందిస్తోంది. అయితే, పాత ఐఫోన్ ఉన్నవారికి ఎక్చేంజ్ రూపంలో అదనపు బోనస్ లభిస్తుండటం విశేషం. ఇక ఐఫోన్ 17 సీరిస్ గతేడాది సెప్టెంబర్‌లో విడుదలైంది. ఇందులో ఏ 19 ప్రో చిప్సెట్తో పాటు లేటెస్ట్ పవర్ఫుల్ కెమెరా కూడా విశేషంగా వినియోగదారులను ఆకట్టుకుంది. ప్రస్తుతం స్టోర్‌లో ఉన్న స్టాక్ వరకే ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని స్టోర్ అధికారులు చెబుతున్నారు.




