IPhone 18 Pro: అప్పుడే మార్కెట్‌ను షేక్ చేస్తున్న ఐఫోన్18 ప్రో.. ఫీచర్లు ఇలా ఉంటే మాత్రం అలజడే
IPhone 18 Pro: యాపిల్ తన తదుపరి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ iPhone 18 Pro సిరీస్‌ను మరో రెండు నెలల్లో ఆవిష్కరించే అవకాశం ఉంది.
IPhone 18 Pro: అప్పుడే మార్కెట్‌ను షేక్ చేస్తున్న ఐఫోన్18 ప్రో.. ఫీచర్లు ఇలా ఉంటే మాత్రం అలజడే
IPhone 18 Pro: యాపిల్ తన తదుపరి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ iPhone 18 Pro సిరీస్‌ను మరో రెండు నెలల్లో ఆవిష్కరించే అవకాశం ఉంది. ఇప్పటివరకు వచ్చిన లీకుల ప్రకారం ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ మోడళ్లలో అధునాతన ఫీచర్లను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.
లాంచ్ ఎప్పుడు..? ఈసారి యాపిల్ వ్యూహం మారనున్నదా?
బ్లూమ్‌బర్గ్‌కు చెందిన ప్రముఖ టెక్ విశ్లేషకుడు మార్క్ గుర్మన్ వెల్లడించిన సమాచారం ప్రకారం, యాపిల్ వార్షిక ఈవెంట్ సెప్టెంబర్ 8 లేదా 9, 2026 తేదీల్లో జరిగే అవకాశం ఉంది.సెప్టెంబర్ 9వ తేదీన ఐఫోన్18ను లాంచ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త ఐఫోన్ 18 Pro సిరీస్ సెప్టెంబర్ 18 నుంచి అమ్మకాలకు వచ్చే అవకాశం ఉంది. ఈసారి యాపిల్ తన లాంచ్ వ్యూహాన్ని కూడా మార్చే అవకాశమున్నట్లు వార్తలు వస్తున్నాయి. సెప్టెంబర్ ఈవెంట్‌లో ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మాక్స్, కంపెనీ తొలి ఫోల్డబుల్ ఐఫోన్ను మాత్రమే విడుదల చేసి, సాధారణ ఐఫోన్ 18, ఐఫోన్ 18e, తదుపరి ఐఫోన్ ఎయిర్ మోడళ్లను 2027 ప్రారంభంలో విడుదల చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
కొత్త కలర్.. భారీ బ్యాటరీ కోసం డిజైన్‌లో మార్పులు
ఈసారి ఐఫోన్ 18 ప్రోలో పూర్తిగా కొత్త డిజైన్ వచ్చే అవకాశం లేదని లీకులు సూచిస్తున్నాయి. ఇప్పటి వరకు ఉన్నట్లుగానే ఫ్లాట్ ఎడ్జ్‌లు, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కొనసాగనున్నాయి. అయితే వెనుక భాగం మరింత శుభ్రంగా కనిపించేలా డిజైన్‌లో స్వల్ప మార్పులు ఉండొచ్చని సమాచారం. కెమెరా మాడ్యూల్ కొంచెం పెద్దదిగా మారే అవకాశం ఉంది. అలాగే పెద్ద బ్యాటరీ, మెరుగైన వెపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ కోసం ఫోన్ కొద్దిగా మందంగా ఉండొచ్చని తెలుస్తోంది. కలర్ ఆప్షన్లలో ఈసారి డార్క్ చెర్రీ ప్రధాన ఆకర్షణగా నిలవొచ్చు. అలాగే లైట్ బ్లూ, సిల్వర్, డార్క్ గ్రే రంగుల్లో కూడా ఫోన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
A20 Pro చిప్, మెరుగైన బ్యాటరీ
ఐఫోన్ 18 ప్రోలో 6.3 అంగుళాల, ప్రో Maxలో 6.9 అంగుళాల డిస్‌ప్లే కొనసాగనున్నట్లు సమాచారం. ఈసారి డైనమిక్ లైల్యాండ్ పరిమాణం కొంత చిన్నదిగా మారే అవకాశం ఉంది. ఫేస్ ఐడీలో ఉపయోగించే కొన్ని భాగాలను స్క్రీన్ కింద అమర్చే టెక్నాలజీని యాపిల్ ఉపయోగించే అవకాశముందని లీకులు చెబుతున్నాయి. పనితీరు కోసం కొత్త A20 Pro చిప్‌ను అందించే అవకాశం ఉంది. ఇది TSMC 2nm టెక్నాలజీపై తయారవుతుందని సమాచారం. దీంతో వేగవంతమైన పనితీరు, మెరుగైన గేమింగ్, ఎక్కువ బ్యాటరీ బ్యాకప్, అధునాతన AI ఫీచర్లు లభించే అవకాశం ఉంది. అలాగే ఐఫోన్ 18 ప్రో Maxలో మార్కెట్‌ను బట్టి 5,500mAh వరకు బ్యాటరీ ఇవ్వవచ్చని లీకులు సూచిస్తున్నాయి. పెద్ద బ్యాటరీ కారణంగా ఫోన్ కొద్దిగా మందంగా, బరువుగా ఉండే అవకాశం ఉంది.
భారత్‌లో ధర ఎంత ఉండొచ్చు?
ఐఫోన్ 18 ప్రోలో 48 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కొనసాగినా, కెమెరా హార్డ్‌వేర్‌లో కీలక మార్పులు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా వేరియబుల్ అపర్చర్ లెన్స్, మెరుగైన టెలిఫోటో కెమెరా, కొత్త స్టాక్డ్ ఇమేజ్ సెన్సార్, 24 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా వచ్చే అవకాశముంది. అలాగే కెమెరా కంట్రోల్ బటన్‌ను కూడా కొత్తగా డిజైన్ చేయవచ్చని సమాచారం.
కనెక్టివిటీ కోసం కొత్త C2 మోడెమ్ అందించే అవకాశం ఉంది. దీంతో వేగవంతమైన నెట్‌వర్క్ స్పీడ్‌తో పాటు మెరుగైన బ్యాటరీ సామర్థ్యం లభించే అవకాశం ఉంది. అంతేకాదు, అత్యవసర మెసేజ్‌లకు మాత్రమే పరిమితమైన శాటిలైట్ కనెక్టివిటీని మరింత విస్తరించే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. ఈ ఫోన్ iOS 27తో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇక ధర విషయానికి వస్తే, కొత్త 2nm చిప్, మెరుగైన కెమెరాలు, పెద్ద బ్యాటరీ, ఖరీదైన మెమరీ కారణంగా ఈసారి ధర పెరగొచ్చని నివేదికలు చెబుతున్నాయి. లీకుల ప్రకారం ఐఫోన్ 18 ప్రో ధర భారత్‌లో రూ.1,39,900 నుంచి, ఐఫోన్ 18 ప్రో మాక్స్ ధర రూ.1,54,900 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే ఈ వివరాలపై యాపిల్ అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సి ఉంది.




