యాపిల్ బిగ్ బాంబ్.. 'iPhone Ultra'తో ఫోల్డబుల్ మార్కెట్ షేక్.!

Apple iPhone Ultra : స్మార్ట్‌ఫోన్ వరల్డ్‌లో ఫోల్డబుల్ ఫోన్ల క్రేజ్ రోజురోజుకూ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తోంది. ఈ మార్కెట్‌లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందా అని టెక్..

G Krishna
Published on: 24 July 2026 1:44 PM IST
iphone ultra foldable
X

 iphone ultra foldable 

Apple iPhone Ultra : స్మార్ట్‌ఫోన్ వరల్డ్‌లో ఫోల్డబుల్ ఫోన్ల క్రేజ్ రోజురోజుకూ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తోంది. ఈ మార్కెట్‌లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందా అని టెక్ లవర్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న యాపిల్, త్వరలోనే తన ఫస్ట్ ఫోల్డబుల్ ఐఫోన్‌ను లాంచ్ చేయడానికి రెడీ అయిపోయింది. అంతర్జాతీయ మార్కెట్ రీసెర్చ్ సంస్థ 'స్మార్ట్ అనలిటిక్స్ గ్లోబల్' రిలీజ్ చేసిన లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం, యాపిల్ ఎంట్రీతో గ్లోబల్ ఫోల్డబుల్ మార్కెట్ సీన్ మొత్తం మారబోతోంది.

సెప్టెంబర్‌లో మార్కెట్‌లోకి యాపిల్ ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్

చాలా కాలంగా రూమర్స్ వస్తున్న యాపిల్ ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ ఈ సెప్టెంబర్‌లో రాబోతున్న ఐఫోన్ 18 ప్రో సిరీస్‌తో పాటు 'ఐఫోన్ ఆల్ట్రా' పేరుతో మార్కెట్‌లోకి అడుగుపెట్టే చాన్స్ ఉంది. ఇప్పటివరకు ఈ కేటగిరీలో ఒక్క మోడల్ కూడా రిలీజ్ చేయకపోయినప్పటికీ, మార్కెట్‌లోకి వచ్చిన కొద్ది నెలల్లోనే యాపిల్ ఏకంగా 25 పర్సెంట్ మార్కెట్ షేర్‌ను సొంతం చేసుకుంటుందని అనలిస్ట్స్ అంచనా వేస్తున్నారు. ఫస్ట్ ఇయర్‌లోనే దాదాపు కోటి యూనిట్లను ప్రొడ్యూస్ చేయాలని యాపిల్ ప్లాన్ చేస్తుండటంతో, మార్కెట్‌లో ఈ ఫోన్‌కు ఉండే డిమాండ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

మార్కెట్ డామినేషన్ కోసం బ్రాండ్స్ వార్

ప్రస్తుతం ఫోల్డబుల్ మార్కెట్‌లో శామ్‌సంగ్ 28 పర్సెంట్ మార్కెట్ షేర్‌తో టాప్ పొజిషన్‌లో కంటిన్యూ అవుతోంది. రీసెంట్‌గా లాంచ్ అయిన గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8, జెడ్ ఫ్లిప్ 8 మోడల్స్ దీనికి బాగా హెల్ప్ అవుతున్నాయి. చైనాకి చెందిన హువావే కంపెనీ 27 పర్సెంట్ షేర్‌తో శామ్‌సంగ్‌కి గట్టి పోటీ ఇస్తుండగా, యాపిల్ తన ఫస్ట్ ఇయర్‌లోనే 25 పర్సెంట్ సాధించి థర్డ్ ప్లేస్‌లోకి వచ్చేస్తుందని చెప్తున్నారు. ఈ మూడు బ్రాండ్స్ కలిపే వరల్డ్ ఫోల్డబుల్ మార్కెట్‌లో దాదాపు 80 పర్సెంట్ డామినేట్ చేయనున్నాయి. ఆనర్, మోటోరోలా, వివో, ఒప్పో, షియోమీ లాంటి మిగతా బ్రాండ్స్ మిగిలిన స్వల్ప షేర్ కోసం ఫైట్ చేయాల్సి వస్తుంది.

ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్లకి 'సూపర్ గ్రోత్' ఫేజ్

న్యూ టెక్నాలజీ, మైండ్ బ్లోయింగ్ డిజైన్లతో పాటు యాపిల్ లాంటి బిగ్ బ్రాండ్ రాకతో రాబోయే రెండేళ్లలో ఫోల్డబుల్ ఫోన్ల సేల్స్ ఇయర్-ఆన్-ఇయర్ 30 పర్సెంట్‌కి పైగా పెరుగుతాయని రిపోర్ట్ పేర్కొంది. అంతేకాకుండా, ప్రస్తుతం ఈ ఫోన్ల లుక్‌లో ఒక న్యూ ట్రెండ్ కనిపిస్తోంది. పాత మోడల్స్ లాగా లాంగ్‌గా ఉండే డిజైన్లకి గుడ్ బై చెప్పేసి, పట్టుకోవడానికి కంఫర్ట్‌గా ఉండే 'వైడ్-ఫోల్డ్' డిజైన్ల వైపు మొబైల్ కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. రాబోయే ఐఫోన్ ఆల్ట్రా కూడా ఇదే నయా స్టైలిష్ లుక్‌తో యూజర్లను అలరించబోతోంది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story