యాపిల్ రెడ్ సర్‌ప్రైజ్.. డిసెంబర్ 1న నాలుగు కొత్త ప్రొడక్ట్స్.?

Apple Product RED: యాపిల్ సంస్థ నాలుగు ప్రత్యేక ప్రొడక్ట్ రెడ్ పరికరాలు, యాక్సెసరీలను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

G Krishna
Published on: 25 Nov 2026 1:06 PM IST
Apple Product RED
X

యాపిల్ రెడ్ సర్‌ప్రైజ్.. డిసెంబర్ 1న నాలుగు కొత్త ప్రొడక్ట్స్.?

Apple Product RED: ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా డిసెంబర్ 1, 2026 నాటికి యాపిల్ సంస్థ నాలుగు ప్రత్యేక ప్రొడక్ట్ రెడ్ పరికరాలు, యాక్సెసరీలను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. సప్లై చైన్, రిటైల్ వర్గాల సమాచారం ప్రకారం, ఇటీవల విడుదలైన ఆడియో ఉత్పత్తులతో పాటు రోజువారీ వినియోగ యాక్సెసరీలను కొత్త ఎరుపు రంగు హంగులతో తీసుకురానుంది.

గత కొంతకాలంగా ప్రత్యేక ఎరుపు రంగు హార్డ్‌వేర్‌కు దూరంగా ఉన్న యాపిల్, పండుగ సీజన్ వేళ ఈ భాగస్వామ్యాన్ని మళ్లీ ముందుకు తీసుకొస్తుండగా, రిటైల్ స్టోర్లకు ఇప్పటికే తొలి స్టాక్ చేరుకుంటున్నట్లు తెలుస్తోంది.

వచ్చే వారం రాబోయే నాలుగు ప్రత్యేక ఉత్పత్తులు

ఈ జాబితాలో సిల్వర్ ఎయిర్‌పాడ్స్ మాక్స్ 2 స్పెషల్ ఎడిషన్ ఒకటి. మొత్తం హెడ్‌ఫోన్ బాడీని ఎరుపు రంగులోకి మార్చకుండా, సిల్వర్ అల్యూమినియం ఫినిష్, వైట్ ఇయర్ కుషన్లు, వైట్ హెడ్‌బ్యాండ్‌తో ఉంచి, డిజిటల్ క్రౌన్‌కు మాత్రమే ప్రకాశవంతమైన క్రిమ్సన్ రంగును ఇచ్చారు.

అలాగే ఈ నెలలోనే 149 డాలర్ల ధరతో వచ్చిన హోమ్‌పాడ్ మినీ 2ను పూర్తి ఎరుపు రంగు అకౌస్టిక్ మెష్, దానికి తగ్గ టాప్ టచ్ సర్ఫేస్‌తో విడుదల చేయనున్నారు. వీటితో పాటు యాపిల్ వాచ్ స్పోర్ట్ బ్యాండ్ ప్రత్యేక ఎరుపు రంగులో రానుండగా, ఎయిర్‌పాడ్స్ ప్రో ఛార్జింగ్ కేసులకు సులభంగా తగిలించుకునేలా ఎరుపు రంగు రిస్ట్ స్ట్రాప్‌ను కూడా తీసుకురానున్నారు.

లోపల ఫీచర్లు మాత్రం అవే.. సేవా కార్యక్రమాలకు తోడ్పాటు

ఈ ప్రత్యేక ఎడిషన్లలో లోపలి హార్డ్‌వేర్ పరంగా ఎలాంటి మార్పులు లేవని సమాచారం. ఎయిర్‌పాడ్స్ మాక్స్ 2, హోమ్‌పాడ్ మినీ 2లలో అదే అంతర్గత హార్డ్‌వేర్, ఆడియో డ్రైవర్లు, వైర్‌లెస్ చిప్‌లు కొనసాగుతాయని, ధరలు కూడా సాధారణ మోడళ్ల తరహాలోనే 549 డాలర్లు, 149 డాలర్లుగా ఉంటాయని అంచనా.

అయితే డిజైన్ ప్రత్యేకతతో పాటు, ప్రతి ప్రొడక్ట్ రెడ్ కొనుగోలు ద్వారా వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని ఆరోగ్య కార్యక్రమాల కోసం గ్లోబల్ ఫండ్‌కు అందించే సంప్రదాయం వీటికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

2027 హార్డ్‌వేర్ రోడ్‌మ్యాప్‌పై కసరత్తు

ఈ ఏడాది చివర్లో వచ్చే నాలుగు ఉత్పత్తులతో హార్డ్‌వేర్ క్యాలెండర్‌కు ముగింపు పలకనున్న యాపిల్, వచ్చే ఏడాది ప్రథమార్ధంలో మరిన్ని కీలక విడుదలలపై దృష్టి పెట్టింది. 2027 వసంతకాలంలో ఐఫోన్ 18, ఐఫోన్ 18ఈ, డ్యూయల్ కెమెరాతో ఐఫోన్ ఎయిర్ 2 వంటి మోడళ్లు వచ్చే అవకాశం ఉందని ప్రాథమిక సమాచారం చెబుతోంది. ఆ తర్వాత 20వ వార్షికోత్సవం సందర్భంగా ఫ్లాగ్‌షిప్ సిరీస్‌లోనూ పెద్ద మార్పులు ఉంటాయనే అంచనాలు టెక్ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.