Apple Store Hyderabad: హైదరాబాద్‌లో తొలి యాపిల్ స్టోర్.. డిసెంబర్ 10న కూకట్‌పల్లిలో ప్రారంభం!
Apple Store Hyderabad: హైదరాబాద్‌లోని కూకట్పల్లి లేక్‌షోర్-వై జంక్షన్ మాల్లో తొలి యాపిల్ రిటైల్ స్టోర్ డిసెంబర్ 10 సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కానుంది. దేశంలో ఇది 7వ స్టోర్ కాగా, ‘సిటీ ఆఫ్ పెరల్స్’ థీమ్‌తో డిజైన్ చేశారు.
Apple Store Hyderabad: హైదరాబాద్‌లో తొలి యాపిల్ స్టోర్.. డిసెంబర్ 10న కూకట్‌పల్లిలో ప్రారంభం!
Apple Store Hyderabad: టెక్ దిగ్గజం యాపిల్ హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ చెప్పింది. నగరంలో తన మొట్టమొదటి రిటైల్ స్టోర్‌ను డిసెంబర్ 10న ప్రారంభించనున్నట్లు సంస్థ గురువారం అధికారికంగా ప్రకటించింది. కూకట్‌పల్లిలోని లేక్‌షోర్ - వై జంక్షన్ మాల్ లో ‘యాపిల్ కూకట్పల్లి’ పేరుతో ఈ స్టోర్ ఏర్పాటవుతోంది. దేశంలో యాపిల్‌కు ఇది ఏడో రిటైల్ స్టోర్ కాగా, తెలంగాణలో తొలి స్టోర్ కావడం విశేషం.
డిసెంబర్ 10 (గురువారం) సాయంత్రం 5 గంటలకు కస్టమర్ల కోసం ఈ స్టోర్ ప్రారంభం కానుంది. హైదరాబాద్‌కు ఉన్న 'ముత్యాల నగరం' (City of Pearls) గుర్తింపునకు నివాళిగా, ముత్యం ఆకృతిని తలపించే యాపిల్ లోగో, రంగురంగుల మెరుపు నేపథ్యంతో స్టోర్ బారికేడ్/ఎక్స్టీరియర్ డిజైన్‌ను యాపిల్ ఆవిష్కరించింది.
ఐఫోన్లు, మ్యాక్బుక్లు, యాపిల్ వాచ్‌లు, ఎయిర్‌పాడ్‌లతో పాటు యాపిల్‌కు చెందిన పూర్తి ఉత్పత్తులను ఇక్కడ ప్రత్యక్షంగా పరిశీలించి కొనుగోలు చేయవచ్చు. టెక్నికల్ సపోర్ట్, బిజినెస్ టీమ్‌ల సేవలు కూడా అందుబాటులో ఉంటాయి.
ఫోటోగ్రఫీ, వీడియో క్రియేషన్, డ్రాయింగ్, డివైజ్ వినియోగంపై ఉచిత వర్క్‌షాప్‌లు నిర్వహించే ‘టుడే ఎట్ యాపిల్’ కార్యక్రమంలో కస్టమర్లు పాల్గొనవచ్చు.
స్టోర్ ప్రారంభోత్సవానికి ముందుగానే హైదరాబాద్ సంస్కృతి, శబ్దాల స్ఫూర్తితో రూపొందించిన ప్రత్యేక వాల్పేపర్లు, స్టిక్కర్లు, యాపిల్ మ్యూజిక్ ప్లేలిస్ట్‌ను యాపిల్ విడుదల చేసింది.
దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ హబ్‌లలో ఒకటైన హైదరాబాద్‌లో ఇప్పటికే యాపిల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (R&D), రిటైల్ కస్టమర్ కేర్ బృందాలు పనిచేస్తున్నాయి. ముంబై, ఢిల్లీ-ఎన్సీఆర్, బెంగళూరు, పుణె తర్వాత ఇప్పుడు హైదరాబాద్‌లోనూ రిటైల్ స్టోర్‌ను ప్రారంభిస్తూ భారత్‌లో తన భౌతిక రిటైల్ నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేస్తోంది.




