iPhone: 'ఫోల్డబుల్ ఐఫోన్' ధర వింటే ఫ్యూజులు అవుట్..!
iPhone: యాపిల్ 'సర్ ప్రైజ్ అండ్ షైన్' ఈవెంట్‌లో తొలి ఫోల్డబుల్ ఫోన్ 'ఐఫోన్ డ్యూయో', ఐఫోన్ 18 ప్రో సిరీస్, యాపిల్ వాచ్ 12, వాచ్ ఆల్ట్రా 4, ఎయిర్‌పాడ్స్ 5 గ్రాండ్ లాంచ్
iPhone: 'ఫోల్డబుల్ ఐఫోన్' ధర వింటే ఫ్యూజులు అవుట్..!
iPhone Duo foldable phone: గ్లోబల్ టెక్ దిగ్గజం యాపిల్ తన ఫ్లాగ్‌షిప్ సర్ ప్రైజ్ అండ్ షైన్ ఈవెంట్‌లో అధునాతన ఉత్పత్తులను ఆవిష్కరించి సాంకేతిక ప్రపంచంలో కొత్త సంచలనానికి తెరతీసింది. ఈ కార్యక్రమంలో సరికొత్త ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ మోడళ్లతో పాటు, యాపిల్ చరిత్రలోనే మొట్టమొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ 'ఐఫోన్ డ్యూయో' ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
గెలాక్సీ జీ ఫోల్డ్ 8 తరహాలోనే మూసి ఉన్నప్పుడు సాధారణ ఫోన్‌లా, తెరిచినప్పుడు ఐప్యాడ్ వంటి విశాలమైన డిస్‌ప్లేతో అలరించే ఈ డివైజ్, వినియోగదారులకు సరికొత్త అనుభూతిని అందిస్తుంది. ఐఫోన్ చరిత్రలో తొలిసారిగా ఒకేసారి రెండు యాప్‌లను పక్కపక్కనే ఉపయోగించే మల్టీటాస్కింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు.
ప్రత్యేకమైన నానో-టెక్చర్డ్ ఫినిషింగ్ వల్ల స్క్రీన్‌పై ఎలాంటి క్రీజ్ కనిపించకపోవడం దీని మరో ప్రత్యేకత. 2ఎన్ఎం ఏ20 ప్రో చిప్‌సెట్, 256జీబీ బేస్ స్టోరేజ్, టచ్‌ఐడీ, రోజంతా నిలిచే బ్యాటరీ లైఫ్, కేవలం 20 నిమిషాల్లోనే 50 శాతం ఛార్జింగ్ అయ్యే సపోర్ట్‌తో ఇది రూపొందింది.
ఏరోస్పేస్-గ్రేడ్ అల్యూమినియం బాడీతో స్టార్ వైట్, నైట్ స్కై రంగుల్లో లభించే ఐఫోన్ డ్యూయో ప్రారంభ ధర రూ. 2,99,900గా నిర్ణయించారు. దీనికి సంబంధించి అక్టోబర్ 16 నుండి ప్రీ-ఆర్డర్లు ప్రారంభమవుతుండగా, అక్టోబర్ 23 నుండి అమ్మకాలు మొదలుకానున్నాయి.
మరోవైపు గతేడాది వచ్చిన ఐఫోన్ 17 ప్రోతో పోలిస్తే, నయా 18 సిరీస్ అద్భుతమైన హార్డ్‌వేర్ అప్‌గ్రేడ్‌లతో అలరిస్తోంది. అత్యంత శక్తివంతమైన 2ఎన్ఎం-జనరేషన్ 'ఏ20 ప్రో' ప్రాసెసర్‌తో పాటు, యాపిల్ స్వయంగా తయారు చేసిన 'సీ2' మోడమ్‌ను వీటిలో పొందుపరిచారు.
లేటెస్ట్ ఐఓఎస్27 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ డివైజెస్ శక్తివంతమైన పర్ఫార్మెన్స్‌ను అందిస్తాయి. డిస్‌ప్లే విషయానికొస్తే ఐఫోన్ 18 ప్రో మోడల్ 6.3-అంగుళాల డిస్‌ప్లేతో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ మోడల్ 6.9-అంగుళాల భారీ డిస్‌ప్లేతో వస్తున్నాయి. భారత మార్కెట్లో ఐఫోన్ 18 ప్రో ప్రారంభ ధర రూ. 1,64,900గా ఉండగా, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ప్రారంభ ధర రూ. 1,79,900గా ఉంది.
స్మార్ట్‌ఫోన్లతో పాటు యాపిల్ తన వేరబుల్స్ లైనప్‌ను కూడా భారీగా విస్తరించింది. ఇదే ఈవెంట్‌లో అత్యాధునిక ఫీచర్లతో కూడిన యాపిల్ వాచ్ సిరీస్ 12ను రూ. 56,900 ధరకు ఆవిష్కరించారు. అలాగే సాహసప్రియుల కోసం రూపొందించిన యాపిల్ వాచ్ ఆల్ట్రా 4ను రూ. 1,09,900 ప్రారంభ ధరకు అందుబాటులోకి తెచ్చారు.
వీటికి తోడుగా మెరుగైన ఆడియో అనుభూతిని అందించే నయా ఎయిర్‌పాడ్స్ 5ను రూ. 14,900 ప్రారంభ ధరతో మార్కెట్లోకి విడుదల చేశారు. ఒకే వేదికపై యాపిల్ ప్రవేశపెట్టిన ఈ వినూత్న డివైజెస్ టెక్ లవర్స్‌ను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.




