AC: కూలింగ్ ఎక్కువైందని ఏసీ తరచుగా ఆఫ్ చేస్తున్నారా.? తెలుసుకోవాల్సిన విషయాలు..

AC: గది చల్లబడగానే ఏసీ ఆఫ్ చేసి, కాసేపటికే మళ్లీ ఆన్ చేస్తున్నారా? ఇలా చేయడం వల్ల కరెంట్ బిల్లు తగ్గడం పక్కన పెడితే.

Ravi
By Ravi
Published on: 6 Jun 2026 1:31 PM IST
AC
X

AC: కూలింగ్ ఎక్కువైందని ఏసీ తరచుగా ఆఫ్ చేస్తున్నారా.? తెలుసుకోవాల్సిన విషయాలు..

AC: భానుడి భగభగలకు తట్టుకోలేక చాలా ఇళ్లలో ఇప్పుడు ఏసీలు నిరంతరాయంగా తిరుగుతున్నాయి. అయితే, ఏసీ వాడేటప్పుడు కరెంట్ బిల్లు భారీగా వస్తుందేమోనన్న భయంతో చాలామంది ఒక తప్పు చేస్తుంటారు. గది కొంచెం చల్లబడగానే ఏసీని ఆఫ్ చేయడం, మళ్లీ పది ఇరవై నిమిషాల తర్వాత ఉక్కపోతగా అనిపిస్తే ఆన్ చేయడం చేస్తుంటారు. ఇలా పదే పదే ఏసీని ఆన్ అండ్ ఆఫ్ చేయడం వల్ల కరెంట్ బిల్లు ఆదా అవుతుందని భావిస్తారు. కానీ, నిజానికి ఇలా చేయడం వల్ల విద్యుత్ వినియోగం తగ్గకపోగా, ఏసీ పాడైపోయే ప్రమాదం ఎక్కువగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

తరచూ ఆన్ అండ్ ఆఫ్ చేస్తే ఏమవుతుంది?

రూమ్ చల్లబడగానే ఏసీని ఆఫ్ చేసి, మళ్లీ ఒక 10 నిమిషాలకే ఆన్ చేయడం వల్ల విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతుంది. ఎందుకంటే, ఏసీని మళ్లీ ఆన్ చేసినప్పుడు గదిని చల్లబరచడానికి కంప్రెసర్ మరింత ఎక్కువ శక్తిని ఉపయోగించాల్సి వస్తుంది. దీనివల్ల కంప్రెసర్‌పై విపరీతమైన ఒత్తిడి పడి, ఏసీ మోటార్ కాలిపోయే ఆస్కారం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏసీని పదే పదే ఆఫ్ చేయడం ఏమాత్రం మంచిది కాదు.

ఉదయం పూట ఏసీని ఎలా ఆపాలి?

రాత్రంతా ఏసీ ఆన్‌లో ఉంచి, ఉదయం లేవగానే ఒక్కసారిగా దాన్ని పూర్తిగా ఆపేయకూడదు. ఏసీని పూర్తిగా ఆఫ్ చేయడానికి ముందు కాసేపు దానిని 'ఫ్యాన్ మోడ్'లో ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఏసీ కాయిల్స్‌లో పేరుకుపోయిన తేమ పూర్తిగా ఆవిరైపోతుంది. ఇది ఏసీ లైఫ్ పెరగడానికి ఎంతో దోహదం చేస్తుంది.

రిమోట్ వాడకం తప్పనిసరి:

చాలామంది ఏసీ ఆపడానికి నేరుగా గోడకున్న మెయిన్ స్విచ్‌ను ఆఫ్ చేస్తుంటారు. కానీ ఎప్పుడూ కూడా నేరుగా మెయిన్ స్విచ్‌తో ఏసీని ఆపకూడదు. మొదట రిమోట్ సహాయంతో ఏసీని ఆఫ్ చేసిన తర్వాతే, మెయిన్ స్విచ్‌ను కట్టేయాలి.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story