Asus Vivobook 14 : AI ఫీచర్లతో ఆసస్ కొత్త Vivobook ల్యాప్‌టాప్స్.!

Asus Vivobook 14 : ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం ఆసస్ (Asus) భారత మార్కెట్లోకి వివోబుక్ సిరీస్‌లో సరికొత్త అప్‌గ్రేడెడ్ మోడల్స్ 'ఆసస్ వివోబుక్ 14

G Krishna
Published on: 11 July 2026 4:43 PM IST
Asus Vivobook 14
X

Asus Vivobook 14

Asus Vivobook 14 : ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం ఆసస్ (Asus) భారత మార్కెట్లోకి వివోబుక్ సిరీస్‌లో సరికొత్త అప్‌గ్రేడెడ్ మోడల్స్ 'ఆసస్ వివోబుక్ 14 (Asus Vivobook 14)', 'ఆసస్ వివోబుక్ 15 (Asus Vivobook 15)' ల్యాప్‌టాప్‌లను శుక్రవారం అధికారికంగా విడుదల చేసింది. అత్యాధునిక కృత్రిమ మేధస్సు (AI) సాంకేతికతకు మద్దతు ఇచ్చేలా ఇన్-బిల్ట్ ఎన్‌పీయూ (NPU) , పవర్‌ఫుల్ ఇంటెల్ ప్రాసెసర్‌తో ఈ ల్యాప్‌టాప్‌లను సంస్థ తీసుకొచ్చింది. విండోస్ 11 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడిచే ఈ డివైజ్‌లు నిరుద్యోగులు, విద్యార్థులు , ప్రొఫెషనల్స్‌కు అద్భుతమైన డిజిటల్ అనుభవాన్ని అందిస్తాయి.

ధర , లభ్యత వివరాలు

భారత మార్కెట్లో ఆసస్ వివోబుక్ 15 (X1504MA) బేస్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 75,990 గా ఉంది. దీనిని ఆసస్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్, రిలయన్స్ డిజిటల్, క్రోమా, విజయ్ సేల్స్, ఆసస్ ఈ-షాప్‌తో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వేదికగా కొనుగోలు చేయవచ్చు. మరోవైపు, ఆసస్ వివోబుక్ 14 (X1404MA) మోడల్ ధర రూ. 1,07,990 నుండి ప్రారంభమవుతుంది. ఇది జూలై 26 నుండి ఆసస్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్, అధికారిక ఈ-షాప్ , పార్ట్నర్ రీటైల్ అవుట్‌లెట్లలో అందుబాటులోకి రానుంది.

ఈ రెండు ల్యాప్‌టాప్‌లు కూల్ సిల్వర్, టెర్రా కోట్టా , క్వైట్ బ్లూ రంగులలో లభిస్తాయి. వీటిని కొనుగోలు చేసే వారికి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ హోమ్ 2024 లైఫ్‌టైమ్ యాక్సెస్‌తో పాటు ఒక సంవత్సరం పాటు 100GB వన్‌డ్రైవ్ (OneDrive) క్లౌడ్ స్టోరేజ్ ఉచితంగా లభిస్తుంది. ఆఫ్‌లైన్ ఛానెల్స్ ద్వారా వివోబుక్ 15పై నెలకు రూ. 5,066, వివోబుక్ 14పై నెలకు రూ. 7,199 చొప్పున నో-కాస్ట్ ఈఎంఐ (No-cost EMI) సదుపాయం కూడా ఉంది. అదనంగా ఆసస్ ఈజీ పే (Asus Easy Pay) ప్రోగ్రామ్ కింద 24 నెలల వరకు ఫ్లెక్సిబుల్ ఫైనాన్సింగ్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

పవర్‌ఫుల్ ప్రాసెసర్ , ఏఐ (AI) సామర్థ్యం

ఈ సరికొత్త ల్యాప్‌టాప్‌లలో గరిష్టంగా ఇంటెల్ కోర్ 7 350 సిరీస్ 3 (Intel Core 7 350 Series 3) ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇందులో ప్రత్యేకంగా అమర్చిన డెడికేటెడ్ న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ (NPU) ఆన్-డివైజ్ ఏఐ పనుల కోసం గరిష్టంగా 17 TOPS (ట్రిలియన్ ఆపరేషన్స్ పర్ సెకండ్) వరకు ఏఐ పర్ఫార్మెన్స్‌ను అందిస్తుంది. గ్రాఫిక్స్ కోసం ఇందులో ఇంటెల్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ కార్డును జత చేశారు. యూజర్లు తమ అవసరాలకు తగ్గట్టుగా ఇందులో గరిష్టంగా 16GB DDR5 రామ్ (RAM) , 512GB వరకు PCIe 4.0 NVMe M.2 ఎస్‌ఎస్‌డీ (SSD) స్టోరేజ్‌ను కాన్ఫిగర్ చేసుకోవచ్చు.

డిస్‌ప్లే, డిజైన్ , కనెక్టివిటీ ఫీచర్లు

ఆసస్ వివోబుక్ 14 , 15 ల్యాప్‌టాప్‌లు 16:9 యాస్పెక్ట్ రేషియో, 250 నిట్స్ బ్రైట్‌నెస్, 84 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో , కళ్లకు రక్షణనిచ్చే ట్యూవీ రీన్‌ల్యాండ్ (TÜV Rheinland) సర్టిఫికేషన్‌తో కూడిన ఫుల్-హెచ్‌డీ ఐపీఎస్ యాంటీ-గ్లేర్ డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. వినోదం కోసం ఇందులో 'సోనిక్‌మాస్టర్' సర్టిఫైడ్ స్పీకర్లను అమర్చారు.

వీడియో కాల్స్ మాట్లాడుకోవడానికి ప్రైవసీ షట్టర్‌తో కూడిన 720p హెచ్‌డీ వెబ్‌క్యామ్ ఉంది. బయోమెట్రిక్ అథెంటికేషన్ (లాకింగ్) కోసం ఎర్గోసెన్స్ టచ్‌ప్యాడ్‌లోనే ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను కూడా జోడించారు. కనెక్టివిటీ పరంగా వై-ఫై 6, బ్లూటూత్ 5.3, ఒక యూఎస్‌బీ 2.0 టైప్-A పోర్ట్, రెండు యూఎస్‌బీ 3.2 జెన్ 1 టైప్-A పోర్టులు, ఒక యూఎస్‌బీ 3.2 జెన్ 1 టైప్-C పోర్ట్, హెచ్‌డీఎమ్‌ఐ 1.4, 3.5mm ఆడియో జాక్ , డీసీ-ఇన్ కనెక్టర్ వంటి ఎన్నో సదుపాయాలు ఉన్నాయి.

బ్యాటరీ, సైజ్ వివరాలు

ఈ రెండు మోడల్స్‌లోనూ లాంగ్ లాస్టింగ్ 42Wh త్రీ-సెల్ లిథియం-అయాన్ బ్యాటరీని అమర్చారు, ఇది 45W ఏసీ అడాప్టర్ ఛార్జర్‌తో వస్తుంది. ఇక బరువు విషయానికి వస్తే, వివోబుక్ 14 మోడల్ కేవలం 1.4 కేజీల బరువుతో , వివోబుక్ 15 మోడల్ 1.7 కేజీల బరువుతో చాలా స్లిమ్‌గా, సులభంగా క్యారీ చేసేలా రూపుదిద్దుకున్నాయి.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story