Upcoming Smartphones April 2026: రూ. 20 వేల బడ్జెట్లో అదిరిపోయే 5 మొబైల్స్.. ఏప్రిల్ లో రానున్న స్మార్ట్ ఫోన్స్ ఇవే?
Best Upcoming Smartphones April 2026: మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనే ఆలోచనలో ఉన్నారా? అయితే ఏప్రిల్ 2026 నెల మీకు పండగే..! ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఐదు పవర్ ఫుల్ ఫోన్లు విడుదలకు సిద్ధమయ్యాయి.
Upcoming Smartphones April 2026: రూ. 20 వేల బడ్జెట్లో అదిరిపోయే 5 మొబైల్స్.. ఏప్రిల్ లో రానున్న స్మార్ట్ ఫోన్స్ ఇవే?
Best Upcoming Smartphones April 2026: 2026 సంవత్సరంలో స్మార్ట్‌ఫోన్ తయారీ రంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ప్రాసెసర్లు, ర్యామ్ (RAM) కొరత కారణంగా ధరలు పెరుగుతున్నప్పటికీ, వినియోగదారులను ఆకట్టుకోవడానికి ప్రముఖ సంస్థలు బడ్జెట్, మిడ్-రేంజ్ విభాగంలో పవర్ఫుల్ ఫోన్లను సిద్ధం చేశాయి. ఏప్రిల్ నెలలో లాంచ్ కాబోతున్న టాప్ 5 మొబైల్స్ ఓసారి చూద్దాం..
1. Realme Narzo 90 Pro 5G: రియల్మీ నుంచి రాబోతున్న ఈ ఫోన్ 6.78 ఇంచుల OLED డిస్ప్లేతో వస్తోంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 8400 చిప్సెట్ ఉంది. దీని ప్రత్యేకత ఏమిటంటే 6500mAh భారీ బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్. దీని అంచనా ధర రూ. 21,990లుగా ఉంటుందని చెబుతున్నారు.
2. Vivo Y500 5G: స్టైలిష్ లుక్ కోసం చూసేవారికి వీవో Y500 మంచి ఆప్షన్. 6.77 ఇంచుల అమోలెడ్ స్క్రీన్, 8200mAh భారీ బ్యాటరీ దీని సొంతం. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌తో వచ్చే ఈ ఫోన్ ధర సుమారు రూ. 17,990 ఉండవచ్చు.
3. Oppo K14: బడ్జెట్ ధరలో ఒప్పో K14 మార్కెట్లోకి వస్తోంది. 6.75 ఇంచుల IPS స్క్రీన్, 7000mAh బ్యాటరీ, 45W ఛార్జింగ్‌తో ఇది లభిస్తుంది. దీని ధర సుమారు రూ. 19,999 గా నిర్ణయించే అవకాశం ఉంది.
4. Honor Power 2: హానర్ నుంచి వస్తున్న ఈ పవర్ఫుల్ మొబైల్ ఆండ్రాయిడ్ V16 వెర్షన్‌పై పనిచేస్తుంది. 12GB ర్యామ్, 256GB స్టోరేజ్‌తో ఇది హై-ఎండ్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఏప్రిల్ 19న విడుదల కాబోతున్న ఈ ఫోన్ ధర రూ. 26,999 కి అటు ఇటుగా ఉండవచ్చు.
5. Moto G77: మోటోరోలా తన G సిరీస్‌లో G77ను ఏప్రిల్ 24న లాంచ్ చేస్తోంది. ఇందులో 108MP మెయిన్ కెమెరా ఉండటం విశేషం. 1.5K అమోలెడ్ డిస్ప్లేతో వచ్చే ఈ ఫోన్ ధర రూ. 18,999 వరకు ఉండవచ్చు.
మీ బడ్జెట్, అవసరాలకు తగ్గట్టుగా ఈ ఐదు ఫోన్లలో ఏది ఉత్తమమో నిర్ణయించుకుని, ఏప్రిల్ నెలలో మీ ఫేవరెట్ ఫోన్‌ను సొంతం చేసుకోండి.




