80 గంటల బ్యాటరీతో బోట్ కొత్త హెడ్‌ఫోన్స్.. ANCతో మైండ్ బ్లోయింగ్ ఫీచర్లు.!
ప్రముఖ ఆడియో పరికరాల సంస్థ 'బోట్' (boAt) భారత మార్కెట్‌లో తన కొత్త ఓవర్-ఈయర్ హెడ్‌ఫోన్స్ 'బోట్ నిర్వాణ యుటోపియా 2 ANC' (boAt Nirvana Eutopia 2 ANC) ని
ANC Headphones
ప్రముఖ ఆడియో పరికరాల సంస్థ 'బోట్' (boAt) భారత మార్కెట్‌లో తన కొత్త ఓవర్-ఈయర్ హెడ్‌ఫోన్స్ 'బోట్ నిర్వాణ యుటోపియా 2 ANC' (boAt Nirvana Eutopia 2 ANC) ని అధికారికంగా లాంచ్ చేసింది. డ్యూయల్ డ్రైవర్లు, 45dB అడాప్టివ్ హైబ్రిడ్ యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ (ANC), ఏకంగా 80 గంటల వరకు బ్యాటరీ లైఫ్ వంటి మైండ్ బ్లాకింగ్ ఫీచర్లతో ఈ హెడ్‌ఫోన్స్ ముందుకు వచ్చాయి. ప్రయాణాల్లో , సంగీత ప్రియులకు ఇది ఒక అత్యుత్తమ ఆడియో అనుభూతిని అందిస్తుందని కంపెనీ చెబుతోంది.
ధర , లభ్యత వివరాలు
భారత మార్కెట్‌లో బోట్ నిర్వాణ యుటోపియా 2 ANC అసలు ధర రూ. 5,999 గా నిర్ణయించారు. అయితే పరిమిత కాల ఆఫర్ (ఆరంభ ఆఫర్) కింద వీటిని రూ. 4,999 ప్రత్యేక ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ హెడ్‌ఫోన్స్ 'కాస్మిక్ బ్లాక్', 'యుటోపియన్ వైట్' అనే రెండు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తున్నాయి. బోట్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఇవి అమ్మకానికి అందుబాటులోకి వచ్చాయి.
అద్భుతమైన ఆడియో , నాయిస్ క్యాన్సిలేషన్
ఆడియో క్వాలిటీ విషయానికి వస్తే, ఇందులో 40mm , 10mm పరిమాణంలో డ్యూయల్ డ్రైవర్ సెటప్‌ను అందించారు. ఇవి బేస్ రెస్పాన్స్, వాయిస్ క్లారిటీ, ఇన్స్ట్రుమెంట్ సపరేషన్లను స్పష్టంగా అందిస్తాయి. వీటితో పాటు హై-రెస్ ఆడియో (Hi-Res Audio), 3D స్పాషియల్ ఆడియో , 45dB వరకు అడాప్టివ్ హైబ్రిడ్ నోయిస్ క్యాన్సిలేషన్‌కు ఇవి సపోర్ట్ చేస్తాయి. దీనివల్ల చుట్టూ ఉన్న అనవసర శబ్దాలు తగ్గడమే కాకుండా నాణ్యమైన సంగీతాన్ని ఆస్వాదించవచ్చు.
అధునాతన ఫీచర్లు , కనెక్టివిటీ
ఈ హెడ్‌ఫోన్స్ బ్లూటూత్ 5.4 వర్షన్‌పై పనిచేస్తాయి. గూగుల్ ఫాస్ట్ పేర్, LDAC కోడెక్ సపోర్ట్, మల్టీ-డివైజ్ కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 'బోట్ హియరబుల్స్' యాప్ ద్వారా ఈక్యూ (EQ) సెట్టింగ్‌లు, కంట్రోల్స్ మార్చుకోవచ్చు. ఫోన్ కాల్స్ సమయంలో బ్యాక్‌గ్రౌండ్ శబ్దాలను తగ్గించేందుకు 'AI ENx' టెక్నాలజీని ఇందులో పొందుపరిచారు.
రోజంతా సరిపోయే బ్యాటరీ లైఫ్, ఫాస్ట్ ఛార్జింగ్
బోట్ నిర్వాణ యుటోపియా 2 ANC లో 800mAh సామర్థ్యం గల శక్తివంతమైన బ్యాటరీని అమర్చారు. ఎన్సి (ANC) ఆఫ్‌లో ఉంటే ఇది ఏకంగా 80 గంటల వరకు పలేబ్యాక్ టైమ్ ఇస్తుంది, ఒకవేళ ఎన్సి ఆన్‌లో ఉంటే 50 గంటల పాటు నిరంతరాయంగా పనిచేస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ద్వారా కేవలం 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే 12 గంటల ప్లేబ్యాక్ పొందవచ్చని కంపెనీ వెల్లడించింది. ఇది పూర్తిగా ఛార్జ్ కావడానికి దాదాపు 2.5 గంటల సమయం పడుతుంది.
ప్రీమియం డిజైన్ , బాక్స్ కంటెంట్
ఈ హెడ్‌ఫోన్స్ ఫోల్డబుల్ , స్వైవెల్ ఇయర్ కప్పుల డిజైన్‌తో వస్తాయి, దీనివల్ల వీటిని వెంట తీసుకెళ్లడం చాలా సులభం. ఇయర్ ప్యాడ్స్‌లో కంఫర్ట్ కోసం మెమరీ ఫోమ్ ఉపయోగించారు. వాటర్ స్ప్లాష్ నిరోధకత కోసం IPX4 రేటింగ్ కలిగి ఉంది. పాటలు మార్చడానికి, వాల్యూమ్ పెంచడానికి, వాయిస్ అసిస్టెంట్ , ఎన్సి మోడ్ మార్చుకోవడానికి ఫిజికల్ బటన్స్ ఇచ్చారు. బాక్స్‌లో హెడ్‌ఫోన్స్‌తో పాటు ప్రీమియం హార్డ్ క్యారీయింగ్ కేస్, టైప్-సి ఛార్జింగ్ కేబుల్, ఆక్స్ (AUX) కేబుల్ , క్యారీ పౌచ్ లభిస్తాయి.




