BSNL: బీఎస్ఎన్ఎల్ ధమాకా ఆఫర్.. 200Mbps స్పీడ్, 25కి పైగా ఫ్రీ OTTలు

BSNL: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తన బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు అద్భుతమైన వార్త అందించింది.

CR Reddy
Published on: 11 Sept 2026 6:35 AM IST
BSNL: బీఎస్ఎన్ఎల్ ధమాకా ఆఫర్.. 200Mbps స్పీడ్, 25కి పైగా ఫ్రీ OTTలు
X

BSNL: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తన బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు అద్భుతమైన వార్త అందించింది. ఫైబర్ సూపర్ ప్లస్ OTT ప్లాన్‌పై వరుసగా ఆరు నెలల పాటు ధర తగ్గింపు ప్రకటించింది. 200Mbps స్పీడ్, 5000GB డేటా, ఉచిత ల్యాండ్‌లైన్ కాలింగ్, 25కు పైగా ఓటీటీల ఉచిత సబ్‌స్క్రిప్షన్లతో ఈ ప్లాన్ లభిస్తోంది. హైస్పీడ్ ఇంటర్నెట్ కోరుకునే వినియోగదారుల కోసం బీఎస్ఎన్ఎల్ ప్రత్యేక ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఫైబర్ సూపర్ ప్లస్ OTT ప్లాన్ సాధారణ నెలసరి రుసుము రూ.1,199 కాగా, కొత్త ఆఫర్ కింద ప్రతి నెలా రూ.88 తగ్గింపును అందిస్తోంది. దీనివల్ల వినియోగదారులు మొదటి ఆరు నెలల పాటు కేవలం రూ.1,111 కే ఈ సేవలను పొందవచ్చు. ఏటా బడ్జెట్ ఆదా చేసుకోవాలనుకునే కస్టమర్లకు ఈ రాయితీ ఎంతో ఊరటనిస్తుంది. ఆరు నెలల కాలపరిమితి ముగిసిన తర్వాత పాత ధర వర్తిస్తుంది.

అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ డేటా, హై స్పీడు

ఈ ప్లాన్ ఎంచుకున్న కస్టమర్లకు ప్రతి నెలా 200Mbps హై స్పీడుతో ఏకంగా 5,000GB వరకు డేటా లభిస్తుంది. ఒకవేళ నిర్ణీత డేటా పరిమితి పూర్తయినా ఇంటర్నెట్ ఆగిపోకుండా 10Mbps వేగంతో నిరంతరంగా పనిచేస్తుంది. ఇంట్లో ఉండి పనిచేసే ఉద్యోగులు, ఆన్‌లైన్ విద్యార్థులు, హెచ్‌డీ కంటెంట్ వీక్షకులకు ఈ ప్లాన్ ఎంతో అనుకూలంగా ఉంటుంది. దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమితంగా మాట్లాడేందుకు వీలుగా ఉచిత ల్యాండ్‌లైన్ కనెక్షన్‌ను కూడా సంస్థ ఈ ప్లాన్‌తో కలిపి అందిస్తోంది.

25కు పైగా ఉచిత OTTలు, ఐఎఫ్ టీవీ ఛానెళ్లు

ఎంటర్‌టైన్‌మెంట్ ప్రియుల కోసం ఈ ప్లాన్‌ను ఆల్ రౌండర్‌గా తీర్చిదిద్దారు. జియో హాట్‌స్టార్, సోనీలివ్, జీ5, లయన్స్‌గేట్, షెమరూమీ, హంగామా యాప్, ఎపిక్ ఆన్, మనోరమా మ్యాక్స్, చౌపాల్ వంటి 25కు పైగా ప్రసిద్ధ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ఉచిత సబ్‌స్క్రిప్షన్లు ఇందులో లభిస్తాయి. ఐఎఫ్‌టీవీ టెక్నాలజీ ద్వారా 500కు పైగా లైవ్ టీవీ ఛానెళ్లను ఉచితంగా వీక్షించే వెసులుబాటు కల్పించారు. దీనివల్ల ప్రత్యేకంగా కేబుల్ కనెక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా పోతుంది.

తక్కువ ధరలో మరో 200Mbps ప్రత్యామ్నాయం

మరింత తక్కువ బడ్జెట్‌లో 200Mbps వేగాన్ని కోరుకునే వారి కోసం బీఎస్ఎన్ఎల్ ఫైబర్ సూపర్ స్టార్ ప్రీమియం ప్లస్ OTT పేరుతో రూ.999 ప్లాన్‌ను సైతం అందిస్తోంది. ఇందులో కూడా 5000GB డేటాతో పాటు జియో హాట్‌స్టార్, జీ5, లయన్స్‌గేట్, సోనీలివ్ వంటి ముఖ్యమైన OTT సేవలు, 500 ఉచిత టీవీ ఛానెళ్లు లభిస్తాయి. ఈ ప్లాన్లను బీఎస్‌ఎన్‌ఎల్ సెల్ఫ్ కేర్ యాప్, సమీప కార్యాలయం లేదా అధికారిక వెబ్‌సైట్ నుంచి సులభంగా పొందవచ్చు. 18004444 నంబర్‌కు వాట్సాప్ మెసేజ్ పంపడం ద్వారా ఇంటి వద్ద నుంచే కొత్త కనెక్షన్ బుక్ చేసుకోవచ్చు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story