బీఎస్ఎన్ఎల్ ఫెస్టివ్ ఆఫర్.. ఆ స్పెషల్ రీఛార్జ్‌పై 30 రోజుల అదనపు వాలిడిటీ..!

BSNL Festive Offer: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ పండుగ సీజన్‌లో తన యూజర్ల కోసం ఓ ఆఫర్ ప్రకటించింది. రూ.2,799 వార్షిక ప్లాన్‌పై అదనంగా 30 రోజుల వాలిడిటీ ఇస్తోంది.

Venkat
Published on: 6 Nov 2026 7:35 PM IST
BSNL Festive Offer
X

బీఎస్ఎన్ఎల్ ఫెస్టివ్ ఆఫర్.. ఆ స్పెషల్ రీఛార్జ్‌పై 30 రోజుల అదనపు వాలిడిటీ..!

BSNL festive offer: పండుగ సీజన్‌లో ఎలక్ట్రానిక్ వస్తువులపైనే కాకుండా మొబైల్ రీఛార్జ్ ప్లాన్లపై కూడా ఆఫర్లు వస్తున్నాయి. బీఎస్ఎన్ఎల్ (BSNL) తన వార్షిక ప్లాన్‌తో అదనపు వాలిడిటీని ఇస్తోంది. ఎక్కువ రోజుల వాలిడిటీ కావాలని కోరుకునే వారికి ఇది పెద్ద ఊరటనిచ్చే ఆఫర్. దీపావళి సందర్భంగా 365 రోజుల ప్లాన్‌తో 30 రోజుల అదనపు వాలిడిటీని కంపెనీ అందిస్తోంది.

రూ.2,799 ఆఫర్ వివరాలు

బీఎస్ఎన్ఎల్ తన అధికారిక ఎక్స్ (X) ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలిపింది. సాధారణంగా రూ.2,799కి 365 రోజుల వాలిడిటీ లభిస్తుంది. అయితే ఈ ప్రత్యేక ఆఫర్ కింద ఎలాంటి అదనపు చెల్లింపు లేకుండా మొత్తం 395 రోజుల వాలిడిటీ లభిస్తుంది.

ప్లాన్‌లో లభించే ప్రయోజనాలు..

మొబైల్ డేటాను ఎక్కువగా వాడేవారు, దీర్ఘకాల వాలిడిటీ కోరుకునేవారిని దృష్టిలో ఉంచుకుని ఈ వార్షిక ప్లాన్‌ను రూపొందించారు.

రోజుకు 3GB హై-స్పీడ్ డేటా.

దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కైనా అన్‌లిమిటెడ్ కాలింగ్.

రోజుకు 100 ఉచిత SMSలు.

ఆఫర్ ఎప్పటివరకు?

30 రోజుల అదనపు వాలిడిటీ ఉన్న ఈ ప్రత్యేక ఆఫర్ పరిమిత కాలానికే అందుబాటులో ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది. 2026 నవంబర్ 30 వరకు మాత్రమే ఈ రూ.2,799 ప్లాన్‌ను రీఛార్జ్ చేసుకుని 395 రోజుల వాలిడిటీ పొందవచ్చు.

రీఛార్జ్ ఎలా చేసుకోవాలి?

ఈ ఆఫర్‌ను పొందాలంటే బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్‌కేర్ యాప్ (BSNL Selfcare App) లేదా బీఎస్ఎన్ఎల్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా సులభంగా రీఛార్జ్ చేసుకోవచ్చు. ప్రతి నెలా ఖరీదైన రీఛార్జ్‌లు చేయడం ఇష్టం లేనివారికి ఈ డీల్ ప్రయోజనకరంగా ఉంటుంది.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.