BSNL : నెట్‌వర్క్ లేదనే చింత లేదు.. బిఎస్ఎన్ఎల్ సరికొత్త శాటిలైట్ ఫోన్ లాంచ్..

BSNL : సాధారణ మొబైల్ నెట్‌వర్క్‌లు, టవర్ సిగ్నల్స్ అస్సలు పనిచేయని మారుమూల ప్రాంతాల్లో కూడా కనెక్టివిటీని అందించేందుకు ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం

G Krishna
Published on: 10 July 2026 12:20 PM IST
bsnl satellite phone
X

bsnl satellite phone

BSNL : సాధారణ మొబైల్ నెట్‌వర్క్‌లు, టవర్ సిగ్నల్స్ అస్సలు పనిచేయని మారుమూల ప్రాంతాల్లో కూడా కనెక్టివిటీని అందించేందుకు ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ఒక విప్లవాత్మక అడుగు వేసింది. దేశంలో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలను మరింత విస్తరిస్తూ ‘బిఎస్ఎన్ఎల్ శాటిలైట్ ఫోన్’ను అధికారికంగా మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. నేరుగా ఉపగ్రహాల సాంకేతికతతో పనిచేసే ఈ సరికొత్త హ్యాండ్‌సెట్ ద్వారా మొబైల్ సిగ్నల్స్ లేని చోట కూడా వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ సేవలను నిరంతరాయంగా వాడుకోవచ్చు.

ఎవరికి ఉపయోగపడుతుంది? దీని ప్రత్యేకతలు ఏంటి?

అంతర్జాతీయ ఉపగ్రహ సమాచార సంస్థ 'ఇన్మార్శాట్' (Inmarsat) హ్యాండ్‌సెట్ ఆధారంగా ఈ సరికొత్త శాటిలైట్ ఫోన్ పనిచేస్తుంది. సాధారణ టవర్ల పరిధికి ఆవల ఉండే దేశ రక్షణ రంగం (Defence), సముద్రయాన కార్యకలాపాలు (Maritime Operations), విపత్తు నిర్వహణ బృందాలు (Disaster Response), మైనింగ్ రంగాలు, రిమోట్ ఆపరేషన్స్ , దట్టమైన అడవులు, కొండ ప్రాంతాల్లో సాహస యాత్రలు చేసే పర్యాటకులను దృష్టిలో ఉంచుకుని దీనిని డిజైన్ చేశారు. ఎలాంటి కఠినమైన వాతావరణ పరిస్థితులనైనా తట్టుకునేలా దీని బాడీని అత్యంత పటిష్టంగా (Rugged Design) రూపొందించారు. అత్యవసర సమయాల్లో రక్షణ కోసం ఇందులో ప్రత్యేకంగా ఒక 'SOS' ఎమర్జెన్సీ సపోర్ట్ ఫీచర్‌ను , ఎక్కువ కాలం మన్నికనిచ్చే లాంగ్-లాస్టింగ్ బ్యాటరీని అమర్చారు.

ధర , కొనుగోలు విధానం

బిఎస్ఎన్ఎల్ ఈ సరికొత్త శాటిలైట్ ఫోన్ ధరను అన్ని రకాల పన్నులతో కలిపి రూ.1,34,166 గా నిర్ణయించింది. ఈ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునే వారు తమకు సమీపంలో ఉన్న బిఎస్ఎన్ఎల్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించవచ్చు లేదా వారి ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను సంప్రదించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. అయితే ఈ శాటిలైట్ ఫోన్ ఉపయోగించాలనుకునే వారు సాధారణ మొబైల్ కనెక్షన్ల మాదిరిగానే కస్టమర్ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తిగా పూర్తి చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ ఫోన్‌ను ఏ ప్రాంతంలో ఉపయోగిస్తున్నారు, ఎంత కాలం వాడుతున్నారు, ఏ అవసరం కోసం కొనుగోలు చేస్తున్నారు అనే పూర్తి వివరాలను అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో జరిగే సంభాషణలు అన్నీ పూర్తిగా ఎన్‌క్రిప్ట్ (Encrypted) చేయబడి ఉంటాయి కాబట్టి భద్రత పరంగా ఎలాంటి ఆందోళన అవసరం లేదు.

ప్రిపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల వివరాలు

ఈ సేవల కోసం బిఎస్ఎన్ఎల్ ప్రభుత్వ, వాణిజ్య (కమర్షియల్) వినియోగదారుల కోసం విడివిడిగా ప్రిపెయిడ్ , పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను కూడా అందిస్తోంది. ప్రభుత్వ వినియోగదారుల కోసం ప్రిపెయిడ్ ప్లాన్లు నెలకు రూ.3,500 నుండి ప్రారంభమవుతుండగా, కమర్షియల్ కస్టమర్ల కోసం నెలకు రూ.5,835 నుండి అందుబాటులో ఉన్నాయి. అలాగే పోస్ట్‌పెయిడ్ విభాగంలో నెలకు రూ.3,500, రూ.5,835 , రూ.11,670 ధరల్లో వేర్వేరు ప్లాన్లు ఉన్నాయి. ఇవి కాకుండా అదనపు అవసరాల కోసం రూ.200 నుండి ఎకనామిక్ రేంజ్ లో ప్రారంభమై రూ.10,000 వరకు విలువ గల టాప్-అప్ వోచర్లు కూడా లభిస్తున్నాయి. దేశంలోని మారుమూల సరిహద్దుల్లో సైతం కనెక్టివిటీని నిర్ధారించడంలో బిఎస్ఎన్ఎల్ తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా మైలురాయిగా నిలవనుంది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story