కేబుల్ చివర ఈ వింత డిజైన్ ఎందుకు ఉంటుంది? అసలు కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Cable Design: మీరు మొబైల్ ఛార్జర్, యూఎస్బీ కేబుల్ లేదా ఇతర వైర్లను ఉపయోగిస్తున్నప్పుడు వాటి చివరల్లో ఉండే వింత ఆకారపు గీతలు, కట్లను గమనించే ఉంటారు.
కేబుల్ చివర ఈ వింత డిజైన్ ఎందుకు ఉంటుంది? అసలు కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Cable Design: మొబైల్ ఛార్జర్, యూఎస్బీ కేబుల్ వంటి వాటి చివరల్లో కనిపించే ప్రత్యేకమైన గీతలు, కట్లు నిజానికి డిజైన్ కోసం ఇచ్చినవి కావు. ఇవి కేబుల్‌కు అదనపు బలం ఇచ్చే సపోర్ట్ సిస్టమ్‌గా పనిచేస్తాయి. ముఖ్యంగా కేబుల్ కనెక్టర్‌తో కలిసే ప్రాంతాన్ని రక్షించడంలో వీటి పాత్ర చాలా కీలకం.
సాధారణంగా కేబుల్‌ను పదేపదే ఉపయోగిస్తున్నప్పుడు ఎక్కువగా వంగే ప్రాంతం కనెక్టర్‌కు సరిగ్గా వెనుక భాగమే. రోజూ ఛార్జర్‌ను ఫోన్‌కు పెట్టడం, తీయడం, కేబుల్‌ను వంచడం వల్ల ఆ ప్రాంతంపై నిరంతరం ఒత్తిడి పడుతుంది. ఒకే చోట ఇలా ఒత్తిడి పడుతూ ఉంటే లోపల ఉన్న వైర్లు దెబ్బతినే అవకాశం ఉంటుంది.
ఇదే సమస్యను తగ్గించేందుకు కనెక్టర్ వెనుక ప్రత్యేకమైన రబ్బర్ లేదా ప్లాస్టిక్ నిర్మాణాన్ని ఇస్తారు. ఇందులో ఉండే గీతలు, గ్రూవ్‌లు కేబుల్‌ను ఒకేసారి గట్టిగా వంచకుండా కొంత ఫ్లెక్సిబిలిటీని ఇస్తాయి. ఫలితంగా ఒత్తిడి ఒకే బిందువుపై పడకుండా కొంత మేర విస్తరిస్తుంది.
ఈ డిజైన్ లేకపోతే?
కనెక్టర్ వెనుక ఇలాంటి సపోర్ట్ లేకపోతే కేబుల్ అదే ప్రాంతంలో పదేపదే ముడుచుకుంటుంది. కొంతకాలానికి బయట ఉన్న పొర దెబ్బతినడం, ఆ తర్వాత లోపలి వైర్లు తెగిపోవడం జరుగుతుంది. అందుకే కొన్ని చవక కేబుల్స్ త్వరగా పాడవడానికి ఇదొక కారణంగా ఉంటుంది.
కేబుల్ తయారీ సంస్థలు ఈ అదనపు భాగాన్ని ఇవ్వకపోవడం ద్వారా తయారీ ఖర్చును కొంత తగ్గించవచ్చు. అయితే దీని ప్రభావం వినియోగదారులపైనే పడుతుంది. కేబుల్ త్వరగా పాడైతే మళ్లీ కొత్తది కొనాల్సి వస్తుంది.
మీ కేబుల్‌లో ఈ సపోర్ట్ లేకపోతే?
మీ దగ్గర ఉన్న కేబుల్ కనెక్టర్ వెనుక సరైన సపోర్ట్ లేకపోతే ప్రత్యేకమైన కేబుల్ ప్రొటెక్టర్ ఉపయోగించవచ్చు. మార్కెట్లో వీటిని కేబుల్ ప్రొటెక్టర్ లేదా స్పైరల్ కార్డ్ సేవర్ పేర్లతో విక్రయిస్తారు.
సిలికాన్ లేదా ప్లాస్టిక్‌తో తయారు చేసిన ఈ చిన్న ప్రొటెక్టర్లను కేబుల్ చివర్లకు అమర్చుకోవచ్చు. ఇవి కేబుల్ ఎక్కువగా వంగకుండా అడ్డుకోవడంతో దాని జీవితకాలం పెరగవచ్చు.
మరో తక్కువ ఖర్చుతో కూడిన మార్గం హీట్-ష్రింక్ ట్యూబ్. కేబుల్ చివర దానిని అమర్చి తగిన వేడితో కుదించేలా చేస్తే అదనపు రక్షణ పొర ఏర్పడుతుంది. అయితే వేడి ఉపయోగించేటప్పుడు కేబుల్‌కు నష్టం కలగకుండా జాగ్రత్తగా చేయాలి.
అందుకే ఇకపై కేబుల్ కొనేటప్పుడు కేవలం ఛార్జింగ్ స్పీడ్, పొడవు లేదా ధర మాత్రమే చూడకుండా.. కనెక్టర్ వెనుక ఉన్న ఫ్లెక్స్ ప్రొటెక్షన్‌ను కూడా గమనించడం మంచిది. చిన్నగా కనిపించే ఈ నిర్మాణమే మీ కేబుల్ ఎక్కువకాలం పనిచేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.




