భారత్‌లో నెల రోజుల పాటు చాట్‌జీపీటీ ప్లస్ ఉచితం.. ఎలా పొందాలంటే?

Chatgpt Plus Free: కృత్రిమ మేధ రంగంలో ప్రముఖ సంస్థ అయిన ఓపెన్‌ఏఐ ఎలాంటి రుసుము లేకుండా ఒక నెల పాటు చాట్‌జీపీటీ ప్లస్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందించే సరికొత్త ఆఫర్‌ను పరిచయం చేసింది.

Venkat
Published on: 5 Oct 2026 7:38 PM IST
Chatgpt Plus Free
X

భారత్‌లో నెల రోజుల పాటు చాట్‌జీపీటీ ప్లస్ ఉచితం.. ఎలా పొందాలంటే?

Chatgpt Plus Free: ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు తెస్తున్న చాట్‌జీపీటీ ఇప్పుడు భారతీయ యూజర్లను ఆకట్టుకునేందుకు ముందుకు వచ్చింది. ఓపెన్‌ఏఐ సంస్థ తన పెయిడ్ సేవ అయిన చాట్‌జీపీటీ ప్లస్ ప్లాన్‌ను నిర్దిష్ట వినియోగదారులకు పరిమిత కాలం పాటు ఉచితంగా ఇస్తోంది. సాధారణంగా ఈ సర్వీస్ నెలవారీ చందా కింద రూ. 1,999 చొప్పున వసూలు చేస్తారు. అయితే తాజా ప్రమోషనల్ ఆఫర్‌లో భాగంగా ఉచితంగా ఇస్తోంది.

ఈ ప్రయోజనాన్ని పొందాలనుకునే యూజర్లు నేరుగా చాట్‌జీపీటీ అధికారిక సబ్‌స్క్రిప్షన్ పేజీని పరిశీలించవచ్చు. అక్కడ ప్లస్ ప్లాన్ కింద ప్రత్యేకంగా కనిపించే ఉచిత ఆఫర్ బటన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ సదుపాయం అందరికీ అందుబాటులో లేదు. గతంలో ఎప్పుడూ ఎలాంటి పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ తీసుకుని అకౌంట్‌లకే ఇది ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పటికే చాట్‌జీపీటీ గో ప్లాన్ వాడిన ఖాతాల్లో మాత్రం సాధారణ ధర రూ. 1,999 నే చూపుతున్నట్లు తెలుస్తోంది.

ఈ ఆఫర్‌ను క్లెయిమ్ చేసుకోవడానికి చెక్‌అవుట్ ప్రక్రియ సమయంలో యూజర్లు కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ వంటి చెల్లింపు వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. యూపీఐ ద్వారా ప్రయత్నించినప్పుడు కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు సమాచారం. నెల రోజుల ఉచిత గడువు ముగిసిన తర్వాత ఆటోమేటిక్‌గా సాధారణ చందా ఛార్జీలు వర్తిస్తాయని గమనించాలి. కాబట్టి డబ్బులు కట్ కాకుండా ఉండాలంటే ఉచిత కాలం ముగిసేలోగా సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేసుకోవడం ఉత్తమం. ఈ ప్లస్ ప్లాన్ ద్వారా యూజర్లు అధిక వినియోగ పరిమితులు, మెరుగైన జ్ఞాపకశక్తి సామర్థ్యాలు, కొత్త మోడళ్లకు ప్రాధాన్యత యాక్సెస్ పొందవచ్చు.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.