Recharge Plans: జియో vs వీఐ రూ.299 ప్లాన్.. మీకు ఏది బెస్ట్?
Recharge Plans: రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా (Vi) రూ.299 ధరతో అందిస్తున్న రీఛార్జ్ ప్లాన్లలో ప్రయోజనాలు గణనీయంగా భిన్నంగా ఉన్నాయి.
Recharge Plans: జియో vs వీఐ రూ.299 ప్లాన్.. మీకు ఏది బెస్ట్?
Recharge Plans: రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా రూ.299 రీఛార్జ్ ప్లాన్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. డేటా, కాల్స్, వినోదం, ఏఐ ప్రయోజనాల్లో రెండింటి మధ్య ఉన్న తేడాలు ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. మీ అవసరానికి ఏ ప్లాన్ సరిపోతుందో సులభంగా నిర్ణయించుకోవచ్చు. రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా (Vi) రూ.299 ధరతో అందిస్తున్న రీఛార్జ్ ప్లాన్లలో ప్రయోజనాలు గణనీయంగా భిన్నంగా ఉన్నాయి. రెండు ప్లాన్ల వ్యాలిడిటీ 28 రోజులే అయినప్పటికీ, రోజువారీ డేటా, అదనపు సేవల విషయంలో తేడా కనిపిస్తుంది.
జియో రూ.299 ప్లాన్‌లో రోజుకు 1.5 జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. 28 రోజులకు కలిపి 42 జీబీ డేటా వినియోగించుకోవచ్చు. డేటా పరిమితి పూర్తయిన తర్వాత స్పీడ్ 64 కేబీపీఎస్‌కు తగ్గుతుంది. అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు కూడా ఇందులో ఉన్నాయి.
ఈ ప్లాన్‌లో అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. రూ.35,100 విలువగా పేర్కొన్న గూగుల్ జెమిని ప్రో ప్లాన్, 5,000 జీబీ క్లౌడ్ స్టోరేజ్ అందుతుంది. జియోటీవీ, జియో ఏఐ క్లౌడ్, జియో హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్లు కూడా లభిస్తాయి. హాట్‌స్టార్ ప్రయోజనం కొనసాగాలంటే రీఛార్జ్ ముగిసిన 48 గంటల్లో అర్హత ఉన్న ప్లాన్‌తో మళ్లీ రీఛార్జ్ చేయాలి.
వీఐ రూ.299 ప్లాన్‌లో రోజుకు 2 జీబీ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. రాత్రి 12 నుంచి ఉదయం 6 గంటల వరకు అపరిమిత నైట్ డేటా ప్రత్యేక ఆకర్షణ. సోమవారం నుంచి శుక్రవారం వరకు మిగిలిన డేటాను వారాంతంలో ఉపయోగించుకునే వీకెండ్ డేటా రోల్‌ఓవర్ సౌకర్యం కూడా ఉంది.
అదనంగా, వీఐ యాప్ ద్వారా నెలకు 2 జీబీ బ్యాకప్ డేటా, వీఐ మూవీస్ & టీవీ యాప్ ద్వారా సినిమాలు, టీవీ షోలు లభిస్తాయి. ఎంపికైన వినియోగదారులకు ‘టుడేస్ ఆఫర్’ ద్వారా అపరిమిత డేటా అప్‌గ్రేడ్ కూడా అందుతుంది.
ఏఐ, క్లౌడ్, ఓటీటీ ప్రయోజనాలు కావాలంటే జియో అనుకూలంగా ఉంటుంది. ఎక్కువ డేటా, నైట్ డేటా, వీకెండ్ రోల్‌ఓవర్ కోరుకునేవారికి వీఐ ప్లాన్ ఉపయోగకరంగా ఉంటుంది.




