NVIDIA AI Bills : కంపెనీలకు చుక్కలు చూపిస్తున్న ఏఐ.. NVIDIA వైస్ ప్రెసిడెంట్ షాకింగ్ కామెంట్స్..!

NVIDIA AI Bills : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్ల ఫ్యూచర్‌లో కంపెనీల ఖర్చులు తగ్గిపోతాయని, మనుషుల అవసరం తక్కువవుతుందని అందరూ అనుకుంటున్నారు.

G Krishna
Published on: 11 May 2026 3:05 PM IST
NVIDIA AI Bills
X

NVIDIA AI Bills

NVIDIA AI Bills : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్ల ఫ్యూచర్‌లో కంపెనీల ఖర్చులు తగ్గిపోతాయని, మనుషుల అవసరం తక్కువవుతుందని అందరూ అనుకుంటున్నారు. కానీ, సీన్ రివర్స్ అవుతోంది! ఏఐ రంగంలో దిగ్గజ సంస్థ అయిన ఎన్విడియా (NVIDIA) వైస్ ప్రెసిడెంట్ బ్రయాన్ కాటన్జారో రీసెంట్‌గా చేసిన కామెంట్స్ ఇప్పుడు టెక్ వరల్డ్‌లో హాట్ టాపిక్ అయ్యాయి. ఆయన తన టీమ్ గురించి చెబుతూ, "ప్రస్తుతం మా ఇంజనీర్ల జీతాల కంటే, వారు ఏఐ మోడల్స్ ట్రైన్ చేయడానికి వాడుతున్న కంప్యూట్ (Compute) ఖర్చే చాలా ఎక్కువగా ఉంది" అని బాంబు పేల్చారు.

ఏఐ అంటే 'చౌక' కాదు.. చాలా కాస్ట్లీ!

సాధారణంగా ఏదైనా కంపెనీలో ఉద్యోగుల శాలరీలే మేజర్ ఖర్చుగా ఉంటాయి. కానీ ఏఐ డెవలప్‌మెంట్ లో మాత్రం కథ వేరేలా ఉంది. ఒక పవర్‌ఫుల్ ఏఐ మోడల్‌ను ట్రైన్ చేయాలన్నా , రన్ చేయాలన్నా వేల సంఖ్యలో గ్రాఫిక్స్ కార్డ్స్ (GPUs), భారీ సర్వర్లు , హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ కావాలి. ఎన్విడియా లాంటి చిప్స్ తయారు చేసే కంపెనీలోనే ఈ పరిస్థితి ఉందంటే, ఇక మిగతా కంపెనీల పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఏఐ మోడల్స్ వాడకం పెరిగే కొద్దీ ఈ 'కంప్యూట్ బిల్లు' ఆకాశాన్ని తాకుతోంది.

మనుషులు వర్సెస్ మెషీన్స్.. ఏది బెటర్?

ఒకప్పుడు ఏఐ వల్ల మనుషుల ఉద్యోగాలు పోతాయని అందరూ భయపడ్డారు. కానీ ఇప్పుడు ఆర్థికంగా చూస్తే, చాలా పనులకు ఏఐ కంటే మనుషులే 'తక్కువ ఖర్చుతో' దొరుకుతున్నారని ఎంఐటీ (MIT) అధ్యయనంలో తేలింది. దాదాపు 77% టాస్క్స్‌లో ఏఐని వాడటం కంటే మనుషులకే పని అప్పగించడం వల్ల కంపెనీలకు డబ్బు ఆదా అవుతోందని ఈ సర్వే చెబుతోంది. అంటే, ఏఐ ఇంకా అందరికీ అందుబాటులోకి వచ్చేంత 'ఎకనామికల్' గా మారలేదు.

ఉబర్ (Uber) కు కూడా తప్పని తిప్పలు

కేవలం ఎన్విడియా మాత్రమే కాదు, ట్రాన్స్‌పోర్ట్ జెయింట్ ఉబర్ (Uber) కూడా ఏఐ ఖర్చుల వల్ల తలపట్టుకుంటోంది. తమ కంపెనీలో ఏఐ వాడకం కోసం కేటాయించిన బడ్జెట్ అంతా కేవలం కొన్ని నెలల్లోనే ఖర్చయిపోయిందని ఉబర్ సీటీఓ ప్రవీణ్ నాగా స్వయంగా వెల్లడించారు. ప్రతి చిన్న కోడింగ్ హెల్ప్ కోసం , డేటా అనాలిసిస్ కోసం ఏఐని వాడితే వచ్చే 'టోకెన్ బిల్లులు' కంపెనీలకు చుక్కలు చూపిస్తున్నాయి.

ఏఐ ఒక ఖరీదైన పెట్టుబడి

ఏఐ అనేది కేవలం ఒక సాఫ్ట్‌వేర్ మాత్రమే కాదు, అది ఒక భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దాన్ని మెయింటెన్ చేయడం ప్రతి ఒక్కరి వల్ల కాదు. ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ చెప్పినట్లు.. ఏఐ వల్ల ఇంజనీర్ల పని వేగం పెరగవచ్చు కానీ, ఆ వేగాన్ని అందుకోవడానికి కంపెనీలు పెట్టే ఖర్చు ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది. భవిష్యత్తులో ఈ ఖర్చులు తగ్గుతాయా లేక ఏఐ అనేది కేవలం ధనిక కంపెనీలకే పరిమితం అవుతుందా అనేది వేచి చూడాలి.


G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story