Cyber Security: సైబర్ నేరగాళ్ల కొత్త ప్లాన్.. తెలియకుండా ఈ పొరపాటు చేస్తే మీ డేటా మొత్తం హ్యాక్ అయినట్టే

Cyber Security: ప్రస్తుత డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్ కేవలం కాల్స్ మాట్లాడటానికే పరిమితం కాలేదు.

CR Reddy
Published on: 19 Sept 2026 8:46 AM IST
Cyber Security
X

Cyber Security

Cyber Security: ప్రస్తుత డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్ కేవలం కాల్స్ మాట్లాడటానికే పరిమితం కాలేదు. మన వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు, బ్యాంకింగ్ వివరాలు, వివిధ డాక్యుమెంట్స్ అన్నీ మన ఫోన్‌లోనే భద్రపరుచుకుంటున్నాము. అయితే డిజిటల్ వాడుక ఎంత పెరిగిందో, సైబర్ నేరగాళ్ల ఆగడాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. కొద్దిపాటి నిర్లక్ష్యం ప్రదర్శించినా మన ఫోన్‌లోని ముఖ్యమైన ఫైల్స్ నేరుగా హ్యాకర్ల చేతికి చిక్కే ప్రమాదం ఉందని సైబర్ నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.

ముఖ్యంగా ఫోన్‌లోని పీడీఎఫ్ ఫైళ్లు, ఏపీకే ఫైళ్లు, జిప్ ఫైళ్లు, ఆఫీస్ డాక్యుమెంట్లు, బ్యాంక్ స్టేట్‌మెంట్లు, పాస్‌వర్డ్‌లు, వ్యక్తిగత చిత్రాలు సైబర్ క్రిమినల్స్‌కు ప్రధాన ఆకర్షణగా మారుతున్నాయి. ఇంటర్నెట్ నుంచి ఎలాంటి సెక్యూరిటీ చెక్ చేయకుండా అనధికారిక వెబ్‌సైట్ల నుంచి యాప్‌లు లేదా ఫైళ్లను డౌన్‌లోడ్ చేయడం వల్ల ప్రమాదం కొనితెచ్చుకున్నట్టే అవుతుంది. అలాగే వాట్సాప్ లేదా ఈమెయిల్ ద్వారా వచ్చే అపరిచిత లింకులు, అనుమానాస్పద మెసేజ్‌లను క్లిక్ చేయడం వల్ల ఫోన్ పూర్తి కంట్రోల్ హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉంది.

ఈ ప్రమాపాల నుంచి తప్పించుకోవడానికి కొన్ని సులభమైన భద్రతా చర్యలు పాటించడం చాలా ముఖ్యం. ఎల్లప్పుడూ స్ట్రాంగ్ పిన్ లేదా పాస్‌కోడ్ లాక్‌లను ఉపయోగించాలి. ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను, యాప్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియని థర్డ్-పార్టీ సోర్సెస్ నుంచి ఏపీకే ఫైళ్లను ఇన్‌స్టాల్ చేయకూడదు. ఫోన్‌లోని డౌన్‌లోడ్స్, 'డాక్యుమెంట్స్' ఫోల్డర్లను తరచూ తనిఖీ చేసి, అవసరం లేని పాత ఫైళ్లను వెంటనే తొలగించడం మంచిది.

అలాగే, ఫోన్‌లోని ప్రతి యాప్‌కు అవసరమైన పర్మీషన్స్ మాత్రమే ఇవ్వాలి. కెమెరా, కాంటాక్ట్స్, మైక్రోఫోన్ వంటి సెన్సిటివ్ పర్మిషన్లను అన్ని యాప్‌లకు అన్‌లాక్ చేయకుండా చూసుకోవాలి. ముఖ్యమైన డాక్యుమెంట్ల బ్యాకప్‌ను సురక్షితమైన క్లౌడ్ స్టోరేజ్‌లో మాత్రమే ఉంచుకోవాలి. ఏ చిన్న అనుమానాస్పద ఫైల్ కనిపించినా వెంటనే డిలీట్ చేయడం ద్వారా మీ వ్యక్తిగత గోప్యతను, విలువైన డేటాను సురక్షితంగా కాపాడుకోవచ్చు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.