మైక్రోఫోన్ లేకుండానే మాటలు వినే AI గాడ్జెట్.. టెంపుల్ డివైజ్ సీక్రెట్ ఇదే..!
TEMPLE Device: జొమాటో ఫౌండర్ దీపిందర్ గోయల్ తన "టెంపుల్" (TEMPLE) డివైజ్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. నుదుటికి అతికించుకునే ఈ గాడ్జెట్‌లో మైక్రోఫోన్, కెమెరా, స్క్రీన్ ఏవీ ఉండవు.
మైక్రోఫోన్ లేకుండానే మాటలు వినే AI గాడ్జెట్.. టెంపుల్ డివైజ్ సీక్రెట్ ఇదే..!
TEMPLE Device: దీపిందర్ గోయల్ (Deepinder Goyal) తన టెంపుల్ డివైజ్‌ను "రూమ్ డెఫ్ వాయిస్ AI కంపానియన్ డివైజ్"గా వర్ణించారు. అంటే ఇది గదిలో ఇతరుల మాటలను వినలేదు, కేవలం ధరించిన వ్యక్తి మాటలను మాత్రమే అర్థం చేసుకుంటుంది. అసలు ఇందులో మైక్రోఫోనే లేదు. మరి మాటలు ఎలా వింటుందనేది ప్రశ్న.
మైక్రోఫోన్ లేకుండా ఎలా వింటుంది?
టెంపుల్‌లో మోషన్ సెన్సార్లు ఉంటాయి. యూజర్ మాట్లాడినప్పుడు ఉత్పన్నమయ్యే అతి సూక్ష్మమైన వైబ్రేషన్లను ఆ సెన్సార్లు గుర్తించి, వాటిని టెక్స్ట్‌గా మారుస్తాయి. అందుకే గదిలో ఇతర వ్యక్తుల సంభాషణను ఈ డివైజ్ వినలేదు, కానీ దాన్ని ధరించిన వ్యక్తి మాటలను అర్థం చేసుకోగలదు.
రెండు సార్లు ట్యాప్ చేస్తే యాక్టివేట్..
ఈ డివైజ్‌లో మైక్రోఫోన్, కెమెరా, స్క్రీన్ వంటి ఫీచర్లు లేవని గోయల్ తెలిపారు. యూజర్లు రెండు సార్లు ట్యాప్ చేసి దాన్ని యాక్టివేట్ చేయవచ్చు. డివైజ్ వినడం మొదలుపెట్టిందా, ఆపిందా అనేది చిన్న వైబ్రేషన్ల ద్వారా నిర్ధారణ అవుతుంది.
AI ఫీచర్లు..
టెంపుల్ AIతో కలిసి వస్తుందని గోయల్ చెప్పారు. దీంతో యూజర్లు తమ ఐడియాలను రికార్డ్ చేసుకోవచ్చు. రిమైండర్లు సెట్ చేసుకోవచ్చు. ముఖ్యమైన విషయాలను రికార్డ్ చేసుకోవచ్చు.
ఇందుకోసం జేబులో నుంచి మొబైల్ బయటకు తీయాల్సిన అవసరం ఉండదు.
రోజువారీ కార్యకలాపాల ట్రాకింగ్..
టెంపుల్‌ను రోజువారీ కార్యకలాపాలను రికార్డ్ చేయడానికి కూడా వాడవచ్చు. ఉదాహరణకు భోజనం చేసినప్పుడు, వర్కౌట్ చేసినప్పుడు వాటిని నమోదు చేయవచ్చు. ఆరోగ్య సంబంధిత సమస్యలను కూడా ఇందులో లాగ్ చేయవచ్చు.
ఆరోగ్యాన్ని చెక్ చేసేందుకే..
అసలు టెంపుల్ ఒక ఆరోగ్య కేంద్రీకృత ఉత్పత్తి. దీన్ని కణతకు (temple) అతికిస్తారు. ఇది మెదడులో రక్త ప్రవాహాన్ని (brain blood flow) పర్యవేక్షించి ఆరోగ్య సమాచారం ఇస్తుంది. అయితే ఈ సాంకేతికత ఎంతవరకు ప్రభావవంతంగా ఉంటుందనే దానిపై ఇటీవల ప్రశ్నలు కూడా తలెత్తాయి.
దీన్ని ధరించగలిగే హెల్త్ ట్రాకర్‌గా అభివృద్ధి చేశారు. ఇందులో హార్ట్ రేట్, హార్ట్ రేట్ వేరియబిలిటీ, నిద్ర, నమలడం (chewing) కార్యకలాపాలు, శరీర ఉష్ణోగ్రత వంటి వాటిని ట్రాక్ చే చేసే సదుపాయాలు ఉన్నాయి.




