ఇన్‌స్టా యూజర్లకు అదిరిపోయే న్యూస్.. 15 నిమిషాల విండోతో కొత్త ఫీచర్..!
Edit Instagram Stories After Posting: పోస్ట్ చేసిన తర్వాత డిలీట్ చేయకుండానే ఇన్‌స్టాగ్రామ్ స్టోరీని ఎడిట్ చేసుకునే కొత్త ఫీచర్ వచ్చింది. 15 నిమిషాల విండోలో టెక్స్ట్, మ్యూజిక్, స్టిక్కర్లను మార్చుకోవచ్చు, వ్యూస్, లైక్స్ కు ఏమాత్రం ఎఫెక్ట్ లేకుండానే చేసుకోవచ్చంట.
ఇన్‌స్టా యూజర్లకు అదిరిపోయే న్యూస్.. 15 నిమిషాల విండోతో కొత్త ఫీచర్..!
Edit Instagram Stories After Posting: ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పెట్టిన తర్వాత తప్పు కనిపిస్తే ఇక డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. పోస్ట్ చేసిన తర్వాత స్టోరీలను ఎడిట్ చేసుకునే కొత్త ఫీచర్‌ను ఇన్‌స్టాగ్రామ్ తీసుకొచ్చింది. షేర్ చేసిన 15 నిమిషాల వరకు యూజర్లు తమ స్టోరీలలో మార్పులు చేసుకోవచ్చు. 2016లో ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ఫీచర్‌ను ప్రారంభించింది. ఫోటోలు, వీడియోలు పెట్టిన 24 గంటల తర్వాత అవి ఆటోమేటిక్‌గా అదృశ్యమవుతాయి. ప్రారంభమై దశాబ్దం అవుతున్న తరుణంలో మెటా యాజమాన్యంలోని ఈ ప్లాట్‌ఫామ్ ఎంగేజ్‌మెంట్ కోల్పోకుండానే స్టోరీలను ఎడిట్ చేసే సదుపాయాన్ని కల్పించింది. దీంతో పాటు స్టోరీస్ కంపోజర్‌ను కూడా అప్‌డేట్ చేసింది. కొత్త బ్యాక్‌గ్రౌండ్ ఆప్షన్లు, ఈజీ మల్టీ-ఇమేజ్ సెలెక్షన్, అప్‌డేటెడ్ స్టిక్కర్లు అందుబాటులోకి వచ్చాయి.
15 నిమిషాల్లో ఏమేమి ఎడిట్ చేయవచ్చు?
ఇన్‌స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మోస్సెరి బుధవారం సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ఈ ఫీచర్‌ను ప్రకటించారు. పోస్ట్ చేసిన 15 నిమిషాల వరకు యూజర్లు స్టోరీలోని టెక్స్ట్, మ్యూజిక్, స్టిక్కర్లు, డ్రాయింగ్‌లను ఎడిట్ చేయవచ్చు. ముఖ్యంగా ఇప్పటికే వచ్చిన వ్యూస్, లైక్స్, రిప్లైలు అలాగే ఉంటాయి.
చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ లేదా చివరి నిమిషంలో కరెక్షన్ కోసం స్టోరీని డిలీట్ చేసి మళ్లీ అప్‌లోడ్ చేయాల్సిన ఇబ్బంది ఇక ఉండదు. కంటెంట్ క్రియేటర్లు, వ్యాపారాలు, సోషల్ మీడియా మేనేజర్లకు ఈ అప్‌డేట్ ఎంతో ఉపయోగపడనుంది. ఎందుకంటే డిలీట్ చేసి మళ్లీ పెట్టడం వల్ల ఎంగేజ్‌మెంట్ మెట్రిక్స్ దెబ్బతింటాయి.
ఎడిట్ చేసిన స్టోరీలపై ‘Edited’ లేబుల్ కనిపిస్తుందని ఇన్‌స్టాగ్రామ్ తెలిపింది. దీంతో వీక్షకులు ఆ పోస్ట్ తర్వాత మార్చబడిందని గుర్తించవచ్చు. స్టోరీని ఓపెన్ చేసి కుడి వైపు కింద మూలలో ఉన్న మూడు చుక్కల (three-dot) మెనూపై నొక్కి, Edit Story ఆప్షన్ ఎంచుకుని అవసరమైన మార్పులు చేసుకోవచ్చు.
స్టోరీస్ క్రియేషన్‌లో కొత్త టూల్స్..
ఎడిటింగ్ ఫీచర్‌తో పాటు స్టోరీస్ క్రియేషన్ ఇంటర్‌ఫేస్‌ను కూడా ఇన్‌స్టాగ్రామ్ అప్‌డేట్ చేసింది.
కొత్త స్టిక్కర్లు: కొత్త ఫాంట్లు, కలర్లతో స్టిక్కర్ ఆప్షన్లు వచ్చాయి.
బ్యాక్‌గ్రౌండ్ ఆప్షన్లు: కొత్త బ్లర్ మరియు గ్రేడియంట్ బ్యాక్‌గ్రౌండ్ ఆప్షన్లు జోడించారు.
మల్టీ-ఇమేజ్ సెలెక్షన్: ఒకేసారి బహుళ ఫోటోలను సెలెక్ట్ చేసి షేర్ చేయడం ఇప్పుడు మరింత సులభమైంది.
క్రియేటర్ల కోసం మరిన్ని అప్‌డేట్స్..
ఈ నెల ప్రారంభంలో ఇన్‌స్టాగ్రామ్ పలు కీలక ప్రకటనలు చేసింది. క్రియేటర్ల కోసం కంటెంట్ ప్రొటెక్షన్ టూల్‌ను ప్రారంభించింది. క్రియేటర్ ఒరిజినల్ వీడియోలను పోలిన రీ-అప్‌లోడ్‌ల కోసం ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ రెండింటినీ ఇది ఆటోమేటిక్‌గా స్కాన్ చేస్తుంది. ఇలాంటి వీడియో కనిపినప్పుడు యూజర్‌కు నోటిఫై చేస్తుంది. అలాగే టీనేజ్ అకౌంట్లను గుర్తించేందుకు AI ఆధారిత ఏజ్-ఎస్టిమేషన్ సిస్టమ్‌ను ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది.




