మీ ఇంట్లో ఈ 6 వస్తువులు ఉన్నాయా? స్విచ్ ఆఫ్ చేసినా కరెంట్ ఖర్చు చేస్తూనే ఉంటాయ్..!
Electricity Saving Tips: మనం రోజువారీ జీవితంలో టీవీ, ఏసీ వంటి పరికరాలను పూర్తిగా మెయిన్ స్విచ్ బోర్డు వద్ద ఆపకుండా కేవలం రిమోట్ ద్వారా మాత్రమే ఆఫ్ చేస్తుంటాం.
మీ ఇంట్లో ఈ 6 వస్తువులు ఉన్నాయా? స్విచ్ ఆఫ్ చేసినా కరెంట్ ఖర్చు చేస్తూనే ఉంటాయ్..!
Electricity Saving Tips: ఇంట్లో వస్తువులను వాడనప్పుడు చాలామంది రిమోట్‌తోనో లేదా బటన్‌తోనో ఆపేసి, కరెంట్ ఆదా అయిందని అనుకుంటారు. కానీ, అది మీ భ్రమ మాత్రమే! అవి లోపల విద్యుత్‌ను నిరంతరం ఖర్చు చేస్తూనే ఉంటాయి. ఈ అలవాటు వల్ల మీ జేబుకు ఎంత చిల్లు పడుతుందో వివరిస్తూ ప్రభుత్వ విద్యుత్ సంస్థ ఒక కీలక హెచ్చరిక జారీ చేసింది.
స్టాండ్‌బై మోడ్ అంటే ఏమిటి? ఎందుకు ప్రమాదకరం?
మనం రోజువారీ జీవితంలో టీవీ, ఏసీ వంటి పరికరాలను పూర్తిగా మెయిన్ స్విచ్ బోర్డు వద్ద ఆపకుండా కేవలం రిమోట్ ద్వారా మాత్రమే ఆఫ్ చేస్తుంటాం. ఈ స్థితిని సాంకేతిక భాషలో 'స్టాండ్‌బై మోడ్' అంటారు. ఈ మోడ్‌లో ఉన్నప్పుడు సదరు వస్తువు పైకి ఆగిపోయినట్లు కనిపించినప్పటికీ, అది మళ్లీ త్వరగా ఆన్ కావడానికి వీలుగా లోపల కరెంట్‌ను వాడుకుంటూనే ఉంటుంది. ఉత్తరప్రదేశ్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (UPPCL) ఇటీవల విడుదల చేసిన సోషల్ మీడియా ప్రకటన ప్రకారం, ఈ చిన్న నిర్లక్ష్యం వల్ల నెలాఖరులో వచ్చే విద్యుత్ బిల్లు భారీగా పెరిగిపోతోంది.
కరెంట్ ఖర్చు చేసే ఆ 6 సాధారణ గృహోపకరణాలు ఇవే..
1. టెలివిజన్ (టీవీ): చాలా ఇళ్లలో టీవీని కేవలం రిమోట్‌తో మాత్రమే ఆఫ్ చేస్తారు. ఇలా చేయడం వల్ల టీవీ నిరంతరం విద్యుత్‌ను ఖర్చు చేస్తూనే ఉంటుంది. కాబట్టి ఎల్లప్పుడూ మెయిన్ స్విచ్ ఆఫ్ చేయడం అలవాటు చేసుకోవాలి.
2. సెట్-టాప్ బాక్స్: టీవీతో పాటు ఉండే సెట్-టాప్ బాక్స్ కూడా స్టాండ్‌బై మోడ్‌లో ఉండి అత్యధికంగా విద్యుత్‌ను వృథా చేస్తుంది. టీవీతో పాటే దీని స్విచ్ కూడా కట్టేయాలి.
3. మొబైల్, లాప్‌టాప్ చార్జర్లు: ఫోన్ చార్జింగ్ పూర్తయిన తర్వాత కూడా చార్జర్‌ను ప్లగ్ బోర్డులోనే ఉంచేస్తుంటారు. చార్జర్‌కు ఎలాంటి ఫోన్ అనుసంధానించకపోయినా, స్విచ్ ఆన్ ఉంటే అది కొంత మొత్తంలో కరెంట్‌ను ఖర్చు చేస్తూనే ఉంటుంది.
4. ఎయిర్ కండిషనర్ (ఏసీ): వేసవిలో ఏసీ వాడకం ఎక్కువ. అయితే ఏసీని రిమోట్‌తో ఆఫ్ చేసినా దాని లోపలి సర్క్యూట్ పనిచేస్తూనే ఉంటుంది. అందువల్ల ఏసీ వాడనప్పుడు దాని ప్రధాన పవర్ స్విచ్‌ను తప్పనిసరిగా ఆపాలి.
5. వై-ఫై రూటర్: ఇళ్లలో ఇంటర్నెట్ కోసం వాడే రూటర్లను 24 గంటలూ ఆన్‌లోనే ఉంచుతారు. రాత్రి పూట పడుకునేటప్పుడు లేదా ఎక్కువ సమయం ఇంటి బయటకు వెళ్లేటప్పుడు రూటర్‌ను పూర్తిగా బంద్ చేయడం వల్ల కరెంట్ ఆదా అవుతుంది.
6. ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్: వాటర్ ఫిల్టర్ ట్యాంక్ పూర్తిగా నిండిన తర్వాత కూడా దాని స్విచ్ ఆన్‌లోనే ఉంటుంది. ట్యాంక్ నిండగానే దాని పవర్ ఆఫ్ చేసి, మళ్లీ నీరు తగ్గినప్పుడు ఆన్ చేసుకోవడం వల్ల విద్యుత్ వృథాను అరికట్టవచ్చు.
జాగ్రత్త పడితే బిల్లు సగం అవ్వడం ఖాయం..!
ఈ చిన్నపాటి మార్పులను మన దైనందిన జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా విద్యుత్ బిల్లును గణనీయంగా తగ్గించుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. పరికరాలను స్టాండ్‌బై మోడ్‌లో వదిలేయకుండా పూర్తిగా మెయిన్ స్విచ్ బోర్డు వద్ద బంద్ చేయడం వల్ల కేవలం కరెంట్ బిల్లు తగ్గడమే కాకుండా, ఆయా గృహోపకరణాల మన్నిక (లైఫ్) కూడా పెరుగుతుంది.
మనం చేసే చిన్న పొరపాట్లే నెలాఖరులో కొండంత కరెంట్ బిల్లుగా మారి మనల్ని ఆందోళనకు గురిచేస్తాయి. ప్రభుత్వం ఇచ్చిన ఈ హెచ్చరికను గమనించి, ఇకనైనా రిమోట్ సంస్కృతికి స్వస్తి పలికి, నేరుగా మెయిన్ స్విచ్ ఆఫ్ చేసే అలవాటును అలవర్చుకుందాం. తద్వారా అటు విద్యుత్‌ను ఆదా చేయడంతో పాటు, ఇటు మన కష్టార్జితాన్ని కాపాడుకోవచ్చు.




