Fire-Boltt: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్-బోల్ట్ ఎంట్రీ.. రూ.9,999కే 6000mAh బ్యాటరీతో!
Fire-Boltt: ప్రముఖ స్మార్ట్‌వాచ్‌ల బ్రాండ్ 'ఫైర్-బోల్ట్' (Fire-Boltt) భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి అధికారికంగా అడుగుపెట్టింది.
Fire-Boltt: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్-బోల్ట్ ఎంట్రీ.. రూ.9,999కే 6000mAh బ్యాటరీతో!
Fire-Boltt: ప్రముఖ స్మార్ట్‌వాచ్‌ల బ్రాండ్ 'ఫైర్-బోల్ట్' (Fire-Boltt) భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి అధికారికంగా అడుగుపెట్టింది. తన కొత్త సబ్-బ్రాండ్ 'బోల్ట్' (Boltt) ద్వారా 'బోల్ట్ ఏస్ 5G' (Boltt Ace 5G) , 'బోల్ట్ ఈవో' (Boltt Evo) పేరుతో రెండు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లను మంగళవారం పరిచయం చేసింది. భారీ 6,000mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తున్న ఈ ఫోన్లు సెప్టెంబర్ 1 నుంచి ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) వేదికగా అమ్మకానికి రానున్నాయి.
ధరలు, లభ్యత , కలర్ ఆప్షన్లు
ధరల విషయానికి వస్తే, బోల్ట్ ఏస్ 5G ప్రారంభ వేరియంట్ (4GB RAM + 64GB) ధర రూ. 13,999గా ఉండగా, 6GB RAM + 128GB వేరియంట్ ధర రూ. 14,999 , టాప్ వేరియంట్ (8GB RAM + 128GB) ధర రూ. 15,999గా నిర్ణయించారు. మరోవైపు బోల్ట్ ఈవో ఫోన్ 4GB RAM + 64GB వేరియంట్ రూ. 10,999కి, 6GB RAM + 128GB వేరియంట్ రూ. 11,999కి లభించనున్నాయి.
అయితే మొదటి రోజు ఆఫర్ (Day 1 Offer) కింద కంపెనీ అన్ని వేరియంట్లపై రూ. 1,000 తక్షణ డిస్కౌంట్‌ను అందిస్తుండటంతో బోల్ట్ ఈవో ప్రారంభ ధర రూ. 9,999 కే అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్లు సెప్టెంబర్ 1 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయానికి రానున్నాయి. బోల్ట్ ఏస్ 5G ఫోన్ ఆర్కిటిక్ వైట్, బర్గండి బ్లిస్, ఫారెస్ట్ గ్రీన్, లావెండర్ బ్లూమ్, మిడ్‌నైట్ బ్లాక్, , స్కై బ్లూ రంగుల్లో లభిస్తుండగా, బోల్ట్ ఈవో మోడల్ ఐదు ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులోకి వస్తోంది.
డిస్‌ప్లే, ప్రాసెసర్ , పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్
ఈ రెండు స్మార్ట్‌ఫోన్లలోనూ 120Hz రీఫ్రెష్ రేట్ , 600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో కూడిన 6.79-ఇంచుల HD+ LCD స్క్రీన్‌ను అందించారు. ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్లలో ప్రాసెసర్ల పరంగా చిన్నపాటి మార్పులు ఉన్నాయి.
బోల్ట్ ఏస్ 5G మోడల్ ఆక్టా-కోర్ యూనిసోక్ T8200 చిప్‌సెట్‌తో పనిచేస్తూ ఆంటూటూ (AnTuTu) బెంచ్‌మార్క్‌లో 5,47,000 కంటే ఎక్కువ స్కోర్ సాధించింది. ఇక బోల్ట్ ఈవో మోడల్ యూనిసోక్ T7250 చిప్‌సెట్‌తో పనిచేస్తూ 3,90,000కి పైగా స్కోర్ నమోదు చేసింది. రెండింటిలోనూ మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 1TB వరకు పెంచుకునే వెసులుబాటును కల్పించారు.
కెమెరా, బ్యాటరీ సామర్థ్యం , కనెక్టివిటీ
కెమెరా విభాగానికి వస్తే, బోల్ట్ ఏస్ 5G వెనుక భాగంలో 64 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో కూడిన డ్యూయల్ సెటప్ ఉండగా, బోల్ట్ ఈవో మోడల్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 2 మెగాపిక్సెల్ మైక్రో లెన్స్ లభిస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం రెండింటిలోనూ 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అమర్చారు.
ఇక బ్యాటరీ పరంగా రెండింటిలోనూ రోజంతా నిలిచే భారీ 6,000mAh బ్యాటరీని అందించగా, ఏస్ 5G మోడల్ మాత్రం 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ సిమ్, 4G LTE, Wi-Fi, బ్లూటూత్ 5.0, టైప్-సి పోర్ట్‌లతో పాటు ఏస్ 5G మోడల్ NFC , 5G నెట్‌వర్క్‌కు సపోర్ట్ చేస్తుంది. సుమారు 233 గ్రాముల బరువు, 8.5mm మందంతో ఉన్న ఈ ఫోన్లు బడ్జెట్ విభాగంలో గట్టి పోటీనిచ్చే అవకాశం ఉంది.




