Flipkart Big Billion Days: ఆఫర్లే ఆఫర్లు.. డిస్కౌంట్లే డిస్కౌంట్లు!

Flipkart Big Billion Days: యాక్సిస్ బ్యాంక్ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ విశేషాలు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్, 7% అదనపు క్యాష్‌బ్యాక్ పొందండి.

Gagan kumar
Published on: 8 Oct 2026 10:40 AM IST
Flipkart Big Billion Days
X

 Flipkart Big Billion Days: ఆఫర్లే ఆఫర్లు.. డిస్కౌంట్లే డిస్కౌంట్లు

Flipkart Big Billion Days: పండగ సీజన్ వచ్చేసింది అంటే చాలు... మనమందరం ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్లలో ఆఫర్ల కోసం ఎదురుచూస్తుంటాం. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్ నిర్వహించే ప్రఖ్యాత బిగ్ బిలియన్ డేస్ సేల్ కోసం టెక్ ప్రియులు, షాపింగ్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఉంటారు. ఈ తరుణంలో మీ షాపింగ్ అనుభవాన్ని మరింత ఆనందంగా, లాభసాటిగా మార్చడానికి యాక్సిస్ బ్యాంక్ సరికొత్త 'యాక్సిస్ బ్యాంక్ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్'ను మీ ముందుకు తీసుకువచ్చింది.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సందర్భంగా అర్హత కలిగిన ఆన్‌లైన్ లావాదేవీలపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌తో పాటు అదనంగా 7 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది. కార్డ్ తీసుకున్న కొత్త వినియోగదారులకు రూ. 1,000 విలువైన వెల్‌కమ్ బెనిఫిట్ లభిస్తుంది. ఇది మీ జాయినింగ్ ఫీజు భారాన్ని పూర్తిగా తగ్గిస్తుంది. ఈజీ డైనింగ్ ద్వారా పార్ట్‌నర్ రెస్టారెంట్లలో బిల్లు చెల్లించేటప్పుడు ప్రత్యేకంగా 25 శాతం తగ్గింపు పొందవచ్చు. స్టోర్లలో చేసే రిటైల్ కొనుగోళ్లు , ప్రయాణ బుకింగ్స్‌పై కూడా 0.75 శాతం క్యాష్ బ్యాక్ పొందవచ్చు. ఈ కార్డ్ జాయినింగ్ ఫీజు రూ. 1,000 ప్లస్ ట్యాక్స్ ఉన్నప్పటికీ, ఒక సంవత్సర కాలంలో రూ. 4 లక్షల వరకు ఖర్చు చేసినట్లయితే ఈ ఫీజు పూర్తిగా మాఫీ చేయబడుతుంది.

అక్టోబర్ 9 నుంచి ప్రారంభమయ్యే బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, అత్యాధునిక ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయన్సెస్ ,ఫ్యాషన్ దుస్తులను కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ యాక్సిస్ బ్యాంక్ క్యాష్ బ్యాక్ కార్డ్ నిజమైన సంజీవనిలా పనిచేస్తుంది. ఒకే లావాదేవీపై ఇన్‌స్టంట్ డిస్కౌంట్ , అదనపు క్యాష్ బ్యాక్ రెండూ వర్తించడం వల్ల మీ బడ్జెట్ అస్సలు తగలకుండా భారీ మొత్తంలో ఆదా చేసుకోవచ్చు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా వంటి ప్రముఖ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో తరచూ షాపింగ్ చేసేవారికి, పండుగ సీజన్లలో పెద్ద ఎత్తున ఖర్చు చేసేవారికి ఈ కార్డ్ అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.