ఐఫోన్ 17 సిరీస్‌పై కళ్లు చెదిరే ఆఫర్లు.. భారీ డిస్కౌంట్లతో ఫ్లిప్‌కార్ట్ ‘గోట్ సేల్’!

Flipkart Goat Sale: ఈ సేల్‌లో అందరి దృష్టి ఆపిల్ ఐఫోన్లపైనే ఉంది. ముఖ్యంగా ఐఫోన్ 17 ప్రో (iPhone 17 Pro) మోడల్‌పై ఏకంగా రూ. 22,000 వరకు తగ్గింపు లభించనుంది.

Venkat
Published on: 3 July 2026 11:22 AM IST
Flipkart Goat Sale
X

ఐఫోన్ 17 సిరీస్‌పై కళ్లు చెదిరే ఆఫర్లు.. భారీ డిస్కౌంట్లతో ఫ్లిప్‌కార్ట్ ‘గోట్ సేల్’!

Flipkart Goat Sale: స్మార్ట్‌ఫోన్ ప్రేమికులకు పండగే పండగ! ఈ ఏడాదిలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన షాపింగ్ పండుగకు తెర లేవబోతోంది. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ జులై 4 నుంచి ప్రతిష్టాత్మక 'గోట్ సేల్' (Goat Sale) ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఆపిల్ లేటెస్ట్ ఐఫోన్ 17 సిరీస్ నుంచి శామ్‌సంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ల వరకు కళ్లు చెదిరే ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది.

ఐఫోన్ ప్రియులకు అదిరిపోయే ఆఫర్లు..!

ఈ సేల్‌లో అందరి దృష్టి ఆపిల్ ఐఫోన్లపైనే ఉంది. ముఖ్యంగా ఐఫోన్ 17 ప్రో (iPhone 17 Pro) మోడల్‌పై ఏకంగా రూ. 22,000 వరకు తగ్గింపు లభించనుంది. మార్కెట్లోకి రూ. 1,34,999 ప్రారంభ ధరతో వచ్చిన ఈ ప్రీమియం ఫోన్, సేల్‌లో కేవలం రూ. 1,12,900 కే లభించనుందని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. అయితే, ఈ ధరలో బ్యాంక్ ఆఫర్లు లేదా పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ బోనస్ కలిసి ఉన్నాయా లేదా అనేది సేల్ మొదలైతే కానీ పూర్తిగా స్పష్టత రాదు. అలాగే బేసిక్ ఐఫోన్ 17 మోడల్ రూ. 70,900 కే అందుబాటులోకి రానుండగా, ఐఫోన్ 16 ప్లస్ ధర రూ. 73,900 గా ఉండబోతోంది.

శామ్‌సంగ్, వన్‌ప్లస్ ఫోన్లపై భారీ తగ్గింపు..

ఆండ్రాయిడ్ ప్రియుల కోసం శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్25 (Samsung Galaxy S25) 256GB మోడల్‌పై ఊహించని ఆఫర్ ప్రకటించారు. అసలు ధర రూ. 80,999 ఉన్న ఈ ఫోన్, దాదాపు రూ. 24,000 తగ్గింపుతో రూ. 56,999 ధరకే లభించే అవకాశం ఉంది. గెలాక్సీ ఎస్25 ప్లస్ మోడల్ రూ. 76,999 కే అందుబాటులో ఉండనుంది. వీటితో పాటు ఒప్పో ఫైండ్ ఎక్స్9 ఆల్ట్రా, రియల్‌మీ జీటీ 7, నథింగ్ ఫోన్ 4ఏ వంటి పాపులర్ మోడళ్లపై కూడా భారీ డిస్కౌంట్లు ఉన్నాయి. ముఖ్యంగా ప్లస్, బ్లాక్ మెంబర్‌షిప్ ఉన్న వినియోగదారులకు 24 గంటల ముందే ఈ సేల్ యాక్సెస్ లభిస్తుంది. అంతేకాకుండా ఐసీఐసీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్‌ఎస్‌బీసీ కార్డ్స్‌పై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

పోటీగా వస్తున్న అమెజాన్ ప్రైమ్ డే సేల్..!

ఫ్లిప్‌కార్ట్‌కు గట్టి పోటీ ఇస్తూ అమెజాన్ కూడా జులై 4 నుంచే 'ప్రైమ్ డే సేల్' ప్రారంభించబోతోంది. ఇందులో శామ్‌సంగ్ అత్యంత ప్రతిష్టాత్మక ఫోన్ గెలాక్సీ ఎస్25 ఆల్ట్రా (Galaxy S25 Ultra) ను ఈ ఏడాదిలోనే అత్యంత తక్కువ ధర అయిన రూ. 84,999 కే అందిస్తున్నట్లు అమెజాన్ ప్రకటించింది. దీనికి ఎలాంటి ఎక్స్ఛేంజ్ నిబంధనలు లేకపోవడం విశేషం. దీంతో పాటు వన్‌ప్లస్ 13 ఫోన్ రూ. 49,999 కే లభించనుంది. స్మార్ట్‌ఫోన్లతో పాటు ల్యాప్‌టాప్‌లు, ఆడియో పరికరాలపై 80 శాతం వరకు, స్మార్ట్ టీవీలపై 65 శాతం వరకు అమెజాన్ భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది.

ఒకే రోజున దేశంలోని రెండు పెద్ద ఈ-కామర్స్ సంస్థలు డిస్కౌంట్ల వర్షం కురిపించబోతుండటంతో వినియోగదారులకు మంచి అవకాశం లభించినట్లయింది. అయితే కంపెనీలు ప్రకటిస్తున్న ధరలు చాలా వరకు 'ప్రభావవంతమైన ధరలు' (Effective Prices) కాబట్టి, ఆర్డర్ పెట్టే ముందు బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ నిబంధనలను ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించుకోవడం ఉత్తమం.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.

Next Story