Galaxy Book6 Series : ర్యామ్ ఒక్కటే కాదు..! ల్యాప్‌టాప్ అసలు పవర్ ఈ 5 ఫీచర్లలోనే

Galaxy Book6 Series : ల్యాప్‌టాప్ కొనుగోలు చేసేటప్పుడు చాలా మంది మొదట చూసేది ర్యామ్ (RAM) మాత్రమే. ర్యామ్ ఖచ్చితంగా ముఖ్యమైనదే అయినప్పటికీ, ల్యాప్‌టాప్

G Krishna
Published on: 16 July 2026 12:08 PM IST
Galaxy Book6 Series : ర్యామ్ ఒక్కటే కాదు..! ల్యాప్‌టాప్ అసలు పవర్ ఈ 5 ఫీచర్లలోనే
X

Galaxy Book6 Series : ల్యాప్‌టాప్ కొనుగోలు చేసేటప్పుడు చాలా మంది మొదట చూసేది ర్యామ్ (RAM) మాత్రమే. ర్యామ్ ఖచ్చితంగా ముఖ్యమైనదే అయినప్పటికీ, ల్యాప్‌టాప్ రోజువారీ పర్ఫార్మెన్స్ నిర్ణయించేది అది ఒక్కటే కాదు. ప్రాసెసింగ్ పవర్, స్టోరేజ్ స్పీడ్, థర్మల్ మేనేజ్‌మెంట్, బ్యాటరీ ఆప్టిమైజేషన్ వంటివన్నీ సమానమైన పాత్ర పోషిస్తాయి. శామ్‌సంగ్ తాజాగా మార్కెట్లోకి తెచ్చిన 'గెలాక్సీ బుక్ 6 సిరీస్' (Galaxy Book6 Series) ల్యాప్‌టాప్‌లలో కేవలం స్పెసిఫికేషన్ షీట్ మాత్రమే కాకుండా, అంతకు మించి గమనించాల్సిన అసలైన పర్ఫార్మెన్స్ ఫీచర్లు ఏంటో ఇప్పుడు చూద్దాం..

16GB vs 32GB.. చదువుకు, ఆఫీస్ వర్క్‌కు ఏది బెస్ట్..

ల్యాప్‌టాప్ వాడే విధానాన్ని బట్టి ర్యామ్ అవసరం మారుతుంది. మీరు ఒక విద్యార్థి అయి ఉండి, ఆన్‌లైన్ క్లాసులు వినడం, ప్రాజెక్ట్‌లు చేయడం, బ్రౌజర్‌లో మల్టిపుల్ ట్యాబ్‌లు వాడటం వంటి పనుల కోసం 16GB ర్యామ్ సరిపోతుంది. కానీ, మీరు పెద్ద పెద్ద స్ప్రెడ్‌షీట్లు, ప్రజెంటేషన్లు, క్రియేటివ్ అప్లికేషన్లు ఒకేసారి వాడే ప్రొఫెషనల్ అయితే 32GB ర్యామ్ ల్యాప్‌టాప్ అస్సలు స్లో అవ్వకుండా అద్భుతంగా పనిచేస్తుంది. హెవీ వీడియో ఎడిటింగ్ చేసే క్రియేటర్లకు, గేమర్లకు ఈ ఎక్స్‌ట్రా ర్యామ్ ఎంతో ప్లస్ అవుతుంది. గెలాక్సీ బుక్ 6 ప్రో ల్యాప్‌టాప్ 32GB LPDDR5X మెమరీ వరకు లభిస్తోంది. కాబట్టి కోడింగ్ చేసే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ నుండి చార్టర్డ్ అకౌంటెన్సీ విద్యార్థుల వరకు అందరికీ ఇది సరిగ్గా సరిపోతుంది.

నంబర్ల కంటే ప్రాసెసర్ ఆర్కిటెక్చర్ ముఖ్యం

ప్రాసెసర్ నంబర్ పెద్దగా ఉన్నంత మాత్రాన సూపర్ పర్ఫార్మెన్స్ వస్తుందని అనుకోలేం. దాని వెనుక ఉన్న ఆర్కిటెక్చర్ ముఖ్యం. గెలాక్సీ బుక్ 6 సిరీస్ ల్యాప్‌టాప్‌లు ఇంటెల్ సరికొత్త 'ఇంటెల్ కోర్ అల్ట్రా సిరీస్ 3' ప్రాసెసర్లతో పనిచేస్తాయి. ఇవి ఇంటెల్ అడ్వాన్స్‌డ్ 18A ప్రాసెస్ టెక్నాలజీతో తయారైన మొదటి ల్యాప్‌టాప్ ప్రాసెసర్లు కావడం విశేషం. ఇవి పాత జనరేషన్ కంటే 1.6 రెట్లు వేగవంతమైన సీపీయూ పర్ఫార్మెన్స్‌ను అందిస్తాయి.

ఇందులో ఇచ్చిన 50 TOPS సామర్థ్యం గల NPU వల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టాస్క్‌లు నేరుగా ప్రాసెసర్ పైనే రన్ అవుతాయి. దీనివల్ల రియల్ టైమ్ నాయిస్ క్యాన్సిలేషన్, ఏఐ ఫోటో & వీడియో ఎడిటింగ్ వంటివి బ్యాటరీపై భారం పడకుండా స్మూత్‌గా సాగిపోతాయి. అలాగే ఇందులోని ఇంటెల్ ఆర్క్ గ్రాఫిక్స్ వల్ల ఎడిటింగ్, రెండరింగ్ పనులు 1.7 రెట్లు వేగంగా జరుగుతాయి.

గెలాక్సీ ఎకోసిస్టమ్.. సూపర్ స్పీడ్ స్టోరేజ్

ల్యాప్‌టాప్ పర్ఫార్మెన్స్ అంటే కేవలం హార్డ్‌వేర్ మాత్రమే కాదు, అది మిగతా డివైజ్‌లతో ఎలా కనెక్ట్ అవుతుందనేది కూడా ముఖ్యమే. గెలాక్సీ బుక్ 6 సిరీస్.. మీ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్‌లతో మల్టీ కంట్రోల్, క్విక్ షేర్ ఫీచర్ల ద్వారా సులభంగా కనెక్ట్ అవుతుంది. ఇక స్టోరేజ్ విషయానికి వస్తే, ఇందులో 1TB NVMe SSDని అందించారు. ఇది ల్యాప్‌టాప్‌ను కేవలం సెకన్లలో బూట్ చేయడమే కాకుండా పెద్ద ఫైళ్లను క్షణాల్లో ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. ఈ సిరీస్‌లో గరిష్టంగా 2TB వరకు స్టోరేజ్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి.

హీటింగ్ సమస్యకు చెక్.. అడ్వాన్స్‌డ్ కూలింగ్ సిస్టమ్

ఎంత పవర్‌ఫుల్ ప్రాసెసర్ ఉన్నా ల్యాప్‌టాప్ వేడెక్కితే దాని పర్ఫార్మెన్స్ పడిపోతుంది. దీన్ని నివారించడానికి శామ్‌సంగ్ తన గెలాక్సీ బుక్ 6 అల్ట్రాలో సరికొత్త కూలింగ్ ఆర్కిటెక్చర్‌ను ప్రవేశపెట్టింది. వెడల్పైన వేపర్ ఛాంబర్, డ్యూయల్-పాత్ ఫ్యాన్ డిజైన్ వల్ల పాత మోడల్స్ కంటే థర్మల్ ఎఫిషియన్సీ 7 శాతం పెరిగింది. అలాగే గెలాక్సీ బుక్ 6 ప్రోలో కూడా ఎయిర్‌ఫ్లోను 35 శాతం మెరుగుపరిచారు. దీనివల్ల ఎక్కువ సమయం కోడింగ్ చేసినా, క్యాడ్ (CAD) సాఫ్ట్‌వేర్ వాడినా ల్యాప్‌టాప్ అస్సలు వేడెక్కదు. పైగా హార్డ్‌వేర్ స్థాయిలోనే దీనికి 'శామ్‌సంగ్ నాక్స్' (Samsung Knox) మల్టీ-లేయర్ సెక్యూరిటీ రక్షణ ఉంటుంది.

30 గంటల బ్యాటరీ లైఫ్

ల్యాప్‌టాప్ బ్యాటరీ బ్యాకప్ అనేది కేవలం బ్యాటరీ సైజుపైనే కాకుండా సాఫ్ట్‌వేర్ ఆప్టిమైజేషన్‌పై ఆధారపడి ఉంటుంది. గెలాక్సీ బుక్ 6 ప్రో ల్యాప్‌టాప్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 30 గంటల వీడియో ప్లేబ్యాక్ బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. ఇందులో వాడిన డైనమిక్ అమోలెడ్ 2X (Dynamic AMOLED 2X) డిస్‌ప్లే అవసరాన్ని బట్టి రిఫ్రెష్ రేట్‌ను 30Hz కి తగ్గించుకుంటూ బ్యాటరీని ఆదా చేస్తుంది. అలాగే గెలాక్సీ బుక్ 6 అల్ట్రా మోడల్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇది కేవలం 30 నిమిషాల్లోనే 63 శాతం ఛార్జ్ అవుతుంది.

విద్యార్థుల కోసం శామ్‌సంగ్ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రత్యేక డిస్కౌంట్లు, నో-కాస్ట్ ఈఎంఐ (EMI) ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ల్యాప్‌టాప్ కొనేటప్పుడు లాంగ్ టర్మ్ పర్ఫార్మెన్స్ కోరుకునే వారికి, శామ్‌సంగ్ కేర్+ (Samsung Care+) ఇన్సూరెన్స్ సేఫ్టీతో వస్తున్న గెలాక్సీ బుక్ 6 సిరీస్ ఒక పర్ఫెక్ట్ ఛాయిస్.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story