Google AI Pro Upgrade: గూగుల్ వినియోగదారులకు గుడ్‌న్యూస్… అదనపు ఖర్చు లేకుండా 5టీబీ క్లౌడ్ స్టోరేజ్

Google AI Pro Upgrade: గూగుల్‌ ఏఐ ప్రో సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ను మరింత శక్తివంతంగా మార్చుతూ అదనపు ఖర్చు లేకుండా స్టోరేజ్‌ సామర్థ్యాన్ని భారీగా పెంచింది. ఇప్పటి వరకు 2 టీబీగా ఉన్న క్లౌడ్‌ స్టోరేజ్‌ని 5టీబీకి పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

Balachander
Published on: 4 April 2026 11:26 AM IST
Google AI Pro 5TB Storage
X

Google AI Pro Upgrade: గూగుల్ వినియోగదారులకు గుడ్‌న్యూస్… అదనపు ఖర్చు లేకుండా 5టీబీ క్లౌడ్ స్టోరేజ్

Google AI Pro Upgrade: ప్రస్తుతం డిజిటల్‌ ప్రపంచంలో డేటా అవసరం, వినియోగం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఈ సమయంలో గూగుల్‌ సంస్థ వినియోగదారులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. గూగుల్‌ ఏఐ ప్రో సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ను మరింత శక్తివంతంగా మార్చుతూ అదనపు ఖర్చు లేకుండా స్టోరేజ్‌ సామర్థ్యాన్ని భారీగా పెంచింది. ఇప్పటి వరకు 2 టీబీగా ఉన్న క్లౌడ్‌ స్టోరేజ్‌ని 5టీబీకి పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

అప్డేట్‌తో అదనపు ఫీచర్లు

గూగుల్‌ తీసుకొచ్చిన ఈ కొత్త అప్డేట్‌తో వినియోగదారులు గూగుల్‌ డ్రైవ్‌, జీమెయిల్‌, గూగుల్‌ ఫొటోస్‌ వంటి సేవల్లో పెద్ద మొత్తంలో డేటాను సులభంగా వినియోగించుకోవచ్చు. ఫొటోలు, వీడియోలను కూడా ఎక్కువ సంఖ్యలో స్టోర్‌ చేసుకోవచ్చు. అంతేకాదు, డాక్యుమెంట్లు ఎక్కువగా ఉపయోగించేవారికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని గూగుల్‌ వన్‌ విభాగం అధిపతి షిమ్రిత్ బెన్-యైర్ అధికారికంగా ప్రకటించాడు. అప్‌గ్రేడ్‌ చేసుకోవడానికి ఎలాంటి ప్రత్యేకించి ఎలాంటి రుసుము చెల్లించక్కర్లేదు. ఇప్పటికే సబ్‌స్క్రిప్షన్‌ తీసుకున్నవారు అప్డేట్‌ చేసుకుంటే సరిపోతంది.

అప్‌గ్రేడ్‌ ప్లాన్స్‌

భారతదేశంలో ఈ అప్‌గ్రేడ్‌ ప్లాన్‌ నెలకు రూ. 1950 లేదా సంవత్సరానికి రూ. 19,500గా కొనసాగుతుంది. ఈ ప్లాన్‌ తీసుకున్నవారికి ఇప్పటి వరకు 2 టీబీ క్లౌడ్‌ స్టోరేజ్‌ నుంచి 5 టీబీ క్లౌడ్‌ స్టోరేజ్‌కి అప్‌గ్రేడ్‌ అవుతుంది. అంటే అదనంగా 3 టీబీ క్లౌడ్‌ స్టోరేజ్‌ యాడ్‌ అవుతుంది. అంతేకాదు, స్టోరేజ్‌తో పాటు అధునాతన ఏఐ సదుపాయాలను కూడా వినియోగించుకోవచ్చు. జెమిని, డీప్‌ రీసెర్చ్‌ వంటి ఫీచర్లను స్మార్ట్‌గా వినియోగించుకోవచ్చు. అదేవిధంగా వీడియో క్రియేషన్స్‌ కోసం వియో, ఇమేజ్‌ టు వీడియో టూల్స్‌, నోట్‌బుక్‌ ఎల్‌ఎం వంటి సేవల్లో కూడా పరిమితులను పెంచారు. అంతేకాదు, విద్యార్ధులకు నెలకు 10000 ఏఐ క్రెడిట్‌లు ఇవ్వడం ద్వారా చదువులో కూడా సాంకేతిక సహాయం అందించనున్నారు. ఫోన్లు, ల్యాప్‌టాప్‌లలో డేటా నిల్వ సమస్య ఎక్కువగా ఉండటంతో క్లౌడ్‌ స్టోరేజ్‌ అవసరం పెరిగింది. ఈ నేపథ్యంలో గూగుల్‌ తీసుకున్న ఈ నిర్ణయం వినియోగదారులకు ఉపయోగపడనుంది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story