స్క్రీన్ లేకుండానే హెల్త్ డేటా ఎలా తెలుస్తుంది? గూగుల్ ఫిట్‌బిట్ ఎయిర్ ఎలా పనిచేస్తుంది?
Google Fitbit Air: గూగుల్ కొత్త Fitbit Airను భారత్‌లో విడుదల చేసింది. స్క్రీన్ లేకుండా ఆరోగ్య సమాచారాన్ని నిరంతరం నమోదు చేసే ఈ పరికరం, డేటాను Google Health యాప్‌లో చూపిస్తుంది.
స్క్రీన్ లేకుండానే హెల్త్ డేటా ఎలా తెలుస్తుంది? గూగుల్ ఫిట్‌బిట్ ఎయిర్ ఎలా పనిచేస్తుంది?
Google Fitbit Air: గూగుల్ (Google) భారత్‌లో గూగుల్ఫిట్‌బిట్ ఎయిర్ పేరుతో కొత్త స్క్రీన్‌లెస్ ఫిట్‌నెస్ ట్రాకర్‌ను విడుదల చేసింది. సాధారణ స్మార్ట్‌వాచ్‌లలా నోటిఫికేషన్లు చూపించకుండా, రోజంతా ఆరోగ్య సమాచారాన్ని నేపథ్యంలో నమోదు చేయడం దీని ప్రధాన విధానం. పరికరంలో స్క్రీన్ ఉండదు. ఛార్జింగ్ అవసరమైనప్పుడు సూచించేందుకు ఎల్ఈడీ లైట్ ఉంటుంది.
గూగుల్ ఫిట్‌బిట్ ఎయిర్ 24 గంటల పాటు హార్ట్ రేట్, హార్ట్ రేట్ వేరియబిలిటీ (HRV), రక్తంలోని ఆక్సిజన్ స్థాయి (SpO2), చర్మ ఉష్ణోగ్రత, శ్వాస రేటు వంటి వివరాలను ట్రాక్ చేస్తుంది. నిద్ర సమయంలోనూ ఆరోగ్య వివరాలను నమోదు చేస్తుంది. నిద్ర కదలికలు, హార్ట్ రేట్, అలారం సెట్టింగ్స్ ఆధారంగా తేలికపాటి నిద్ర దశలో సున్నితమైన వైబ్రేషన్‌తో నిద్ర లేపుతుంది.
అయితే స్క్రీన్ లేకపోవడంతో ఈ డేటాను గూగుల్ ఫిట్‌బిట్ ఎయిర్ లో నేరుగా చూడలేరు. ఇందుకోసం స్మార్ట్‌ఫోన్‌లోని గూగుల్ హెల్త్ యాప్‌ను ఉపయోగించాలి. యాప్‌లో రోజువారీ అడుగులు, యాక్టివ్ కేలరీలు, హార్ట్ రేట్, దూరం వంటి వివరాలను చూడొచ్చు. ఫిట్‌నెస్ విభాగంలో వర్కౌట్ వివరాలు, స్లీప్ విభాగంలో నిద్ర స్కోర్, దశలు, ట్రెండ్స్ అందుబాటులో ఉంటాయి. హెల్త్ విభాగంలో హెచ్‌ఆర్‌వీ, శ్వాస రేటు, చర్మ ఉష్ణోగ్రత, SpO2 వంటి వివరాలు చూడవచ్చు.
గూగుల్ హెల్త్ కోచ్‌లో జెమినీ ఆధారిత ఏఐ సహాయంతో వ్యక్తిగత ఫిట్‌నెస్ ప్లాన్లు, నిద్ర సూచనలు, ఆరోగ్య సంబంధిత అంతర్దృష్టులు అందుతాయి.
గూగుల్ ఫిట్‌బిట్ ఎయిర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏడు రోజుల వరకు పనిచేస్తుందని గూగుల్ తెలిపింది. ఐదు నిమిషాల ఫాస్ట్ ఛార్జింగ్‌తో ఒక రోజు వరకు బ్యాటరీ లభిస్తుంది. దీని ధర రూ.13,999. అక్టోబర్ 2న విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఆండ్రాయిడ్ 11, iOS 16.4 లేదా ఆపై వెర్షన్లతో పనిచేస్తుంది.




