Google Gemini: అబ్బా.. ఇది కదా క్రేజ్..! జెమిని యాప్ లుక్ ఇక నెక్స్ట్ లెవల్..!
Google Gemini: టెక్ ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ.. గూగుల్ తన అత్యంత శక్తివంతమైన ఏఐ అసిస్టెంట్ 'జెమిని' (Gemini) రూపురేఖలను పూర్తిగా మార్చేస్తోంది..
google-gemini
Google Gemini: టెక్ ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ.. గూగుల్ తన అత్యంత శక్తివంతమైన ఏఐ అసిస్టెంట్ 'జెమిని' (Gemini) రూపురేఖలను పూర్తిగా మార్చేస్తోంది.. ఇది కేవలం చిన్న అప్‌డేట్ కాదు, ఏకంగా ఒక విజువల్ విప్లవం. ఇప్పటివరకు మనం చూసిన జెమిని వేరు, ఇకపై చూడబోయే జెమిని వేరు. ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం గూగుల్ రూపొందించిన ఈ సరికొత్త లేఅవుట్ చూస్తుంటే, స్మార్ట్‌ఫోన్ వాడకంలో ఒక కొత్త శకం మొదలవబోతోందని స్పష్టమవుతోంది.
తాజా నివేదికల ప్రకారం.. ఆండ్రాయిడ్ యూజర్లను మైమరపించబోతున్న ఆ మార్పులు ఇవే..
కలర్ ఫుల్ విజువల్స్.. రంగుల లోకంలో జెమిని..
సాదాసీదాగా ఉండే బ్యాక్‌గ్రౌండ్స్‌కు గూగుల్ స్వస్తి పలుకుతోంది. సరికొత్త డైనమిక్ గ్రేడియంట్ కలర్స్‌తో జెమిని యాప్ ఇప్పుడు ఒక ఇంద్రధనస్సులా మెరిసిపోనుంది. యూజర్ మూడ్‌కు అనుగుణంగా, వారు ఎంచుకున్న థీమ్‌కు తగ్గట్టుగా యాప్ రంగులు మారుతూ సరికొత్త అనుభూతిని ఇస్తాయి. ముఖ్యంగా లైట్ మోడ్‌లో కూడా విజువల్స్ అత్యంత స్పష్టంగా, విలాసవంతంగా కనిపించేలా డిజైన్ చేశారు. ఇది చూసిన ఎవరైనా సరే.. "వావ్! జెమిని ఇంత అందంగా ఉందేంటి?" అని ఆశ్చర్యపోవాల్సిందే..
మల్టీటాస్కింగ్‌లో మ్యాజిక్
ఇప్పటివరకు జెమిని లైవ్ ఫీచర్ వాడుతున్నప్పుడు స్క్రీన్ మొత్తం ఆక్రమించేసేది. కానీ ఇకపై ఆ ఇబ్బంది ఉండదు.. ఒక మ్యాజిక్ లాగా, జెమిని లైవ్ ఇప్పుడు ఒక చిన్న ఫ్లోటింగ్ విండోలా (Mini Player) స్క్రీన్ దిగువకు మారిపోనుంది. అంటే మీరు జెమినితో మాట్లాడుతూనే, అదే సమయంలో మరో యాప్‌లో పని చేసుకోవచ్చు. ఏఐతో సంభాషణ సాగిస్తూనే పక్కన పనులు చక్కబెట్టుకోవడం అనేది మునుపెన్నడూ లేనంత సులభం కాబోతోంది.
హాలీవుడ్ రేంజ్ యానిమేషన్స్..
మనం ఏదైనా అడిగినప్పుడు జెమిని ఇచ్చే రెస్పాన్స్‌లో ఇప్పుడు ఒక కొత్త వేగం, ఒక కొత్త స్టైల్ కనిపిస్తుంది. పాత వాయిస్ వేవ్స్‌ను తొలగించి, గూగుల్ ఇప్పుడు యానిమేటెడ్ గ్లో (Animated Glow) అనే అద్భుతమైన ఫీచర్‌ను ప్రవేశపెడుతోంది. మీరు మాట్లాడుతున్నప్పుడు ఫోన్ అంచుల నుంచి మెరుపులు వచ్చినట్లుగా అనిపించే ఈ యానిమేషన్, యూజర్లకు ఒక హై-టెక్ అనుభూతిని కలిగిస్తుంది. ఐకాన్స్ నుండి టెక్స్ట్ వరకు ప్రతిదీ చాలా క్లీన్ గా, మోడ్రన్ గా మారిపోయాయి.
క్లీన్ అండ్ క్లాసీ లేఅవుట్..
యూజర్ ఇంటర్‌ఫేస్‌ను (UI) గూగుల్ ఎంతలా మార్చిందంటే, ఇప్పుడు యాప్‌లో ఎక్కడా గందరగోళం కనిపించదు. సైడ్‌బార్‌ను ఓపెన్ చేస్తే అది ఏకంగా ఫుల్ స్క్రీన్‌ను ఆక్రమించి, మీ పాత హిస్టరీని , సెట్టింగ్స్‌ను అత్యంత స్పష్టంగా చూపిస్తుంది. అనవసరమైన బటన్లను తొలగించి, కేవలం యూజర్‌కు కావాల్సిన వాటిని మాత్రమే స్క్రీన్‌పై ఉంచారు. దీనివల్ల జెమిని వాడకం కేవలం పని మాత్రమే కాదు, ఒక ఆహ్లాదకరమైన అనుభవంగా మారుతుంది.
ఎప్పటి నుంచి ఈ జెమిని జాతర..?
ప్రస్తుతం ఈ సరికొత్త లేఅవుట్ గూగుల్ యాప్ బీటా వెర్షన్లలో హల్చల్ చేస్తోంది. టెస్టింగ్ పూర్తయిన వెంటనే, అంటే రాబోయే కొద్ది రోజుల్లోనే ఆండ్రాయిడ్ వినియోగదారులందరికీ ఈ 'మెగా మేకోవర్' అందుబాటులోకి రానుంది. మీ ఫోన్‌లోని జెమిని యాప్ ఎప్పుడు కొత్తగా మారుతుందా అని టెక్ ప్రియులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు..




