Google Maps : Google Maps ట్రిక్.. బ్లూ సర్కిల్ చెప్పే సీక్రెట్.!

Google Maps : మనం ఎక్కడికైనా వెళ్లాలన్నా, కొత్త దారి వెతుక్కోవాలన్నా ముందుగా ఓపెన్ చేసేది గూగుల్ మ్యాప్స్. ఇందులో మన ప్రస్తుత లొకేషన్‌ను చూపించడానికి

G Krishna
Published on: 10 July 2026 3:55 PM IST
google-maps
X

google-maps

Google Maps : మనం ఎక్కడికైనా వెళ్లాలన్నా, కొత్త దారి వెతుక్కోవాలన్నా ముందుగా ఓపెన్ చేసేది గూగుల్ మ్యాప్స్. ఇందులో మన ప్రస్తుత లొకేషన్‌ను చూపించడానికి ఒక బ్లూ కలర్ చుక్క (Blue Dot) కనిపిస్తుంది. అయితే, చాలామంది గమనించే ఉంటారు.. ఆ బ్లూ డాట్ చుట్టూ ఉండే నీలి రంగు సర్కిల్ ఒక్కోసారి చిన్నగా, మరికొన్ని సార్లు చాలా పెద్దగా మారుతూ ఉంటుంది. చాలామంది ఇది యాప్ లోపమో లేదా ఫోన్ ప్రాబ్మమో అనుకుంటారు కానీ, అది అస్సలు గ్లిచ్ కాదు. దీని వెనుక ఒక ఆసక్తికరమైన సాంకేతిక కారణం ఉంది. గూగుల్ మ్యాప్స్ మీ లొకేషన్‌ను ఎంత ఖచ్చితంగా గుర్తించిందో చెప్పడానికే ఆ బ్లూ సర్కిల్ ఉపయోగపడుతుంది. మీ ఫోన్‌కు అందుతున్న సిగ్నల్స్ ఆధారంగా యాప్ ఎంత నమ్మకంగా ఉందనేది ఆ సర్కిల్ సైజును బట్టి అర్థం చేసుకోవచ్చు.

బ్లూ సర్కిల్ సైజు ఏం చెబుతుంది?

ఆ బ్లూ డాట్ చుట్టూ ఉండే సర్కిల్ చాలా చిన్నగా ఉంటే, గూగుల్ మ్యాప్స్ మీ ఖచ్చితమైన లొకేషన్‌ను గుర్తించిందని అర్థం చేసుకోవచ్చు. అదే ఒకవేళ ఆ వృత్తం పెద్దగా ఉంటే, మ్యాప్స్ మీ లొకేషన్‌ను సరిగ్గా పిన్‌పాయింట్ చేయలేకపోయిందని అర్థం. అంటే "మీరు ఈ కనిపించే పెద్ద సర్కిల్ లోపల ఎక్కడో ఒకచోట ఉన్నారు, కానీ ఖచ్చితంగా ఏ పాయింట్‌లో ఉన్నారో చెప్పలేకపోతున్నాం" అని గూగుల్ మ్యాప్స్ మనకు సూచిస్తుందన్నమాట. మీ ఫోన్ సాధారణంగా జీపీఎస్ శాటిలైట్లు, చుట్టుపక్కల ఉండే వైఫై నెట్‌వర్క్‌లు , మొబైల్ టవర్ల సిగ్నల్స్ కలయిక ద్వారా లొకేషన్‌ను ట్రాక్ చేస్తుంది. ఈ సిగ్నల్స్ బలంగా ఉన్నప్పుడు లొకేషన్ పక్కాగా చూపిస్తుంది. కానీ, మీరు పెద్ద పెద్ద బిల్డింగుల లోపలికి వెళ్లినప్పుడు, అండర్‌గ్రౌండ్‌లో ప్రయాణిస్తున్నప్పుడు లేదా చుట్టూ ఎత్తైన భవనాలు ఉన్న ప్రదేశాల్లో ఉన్నప్పుడు జీపీఎస్ సిగ్నల్స్ బలహీనపడతాయి. అలాంటి సమయాల్లో ఫోన్‌కు తక్కువ సిగ్నల్స్ అందడం వల్ల ఆ బ్లూ సర్కిల్ పెద్దదవుతుంది.

లొకేషన్ ఖచ్చితత్వాన్ని ఎలా పెంచాలి?

ఒకవేళ మీ ఫోన్‌లో బ్లూ సర్కిల్ చాలా పెద్దగా ఉండి, కరెక్ట్ లొకేషన్ చూపించకపోతే కొన్ని చిన్న చిట్కాల ద్వారా దానిని సరిచేసుకోవచ్చు. ఇందుకోసం మీరు ఏ నెట్‌వర్క్‌కు కనెక్ట్ అవ్వకపోయినా సరే, ఫోన్‌లో వైఫై ఆన్ చేసి ఉంచడం మంచిది. దీనివల్ల చుట్టుపక్కల ఉండే వైఫై రూటర్ల సిగ్నల్స్ సాయంతో గూగుల్ మ్యాప్స్ మీ లొకేషన్‌ను మరింత ఖచ్చితంగా గుర్తిస్తుంది. అలాగే మీ ఫోన్‌ను గాల్లో ఇంగ్లీష్ అక్షరం ఎనిమిది (8) ఆకారంలో తిప్పడం ద్వారా ఫోన్‌లోని కంపాస్ సెన్సార్లు రీలైన్ అయ్యి, డైరెక్షన్ ఖచ్చితత్వం పెరుగుతుంది. వీటన్నిటితో పాటు వీలైతే భవనాల లోపల కాకుండా కాస్త ఖాళీ ప్రదేశంలోకి లేదా ఆకాశం స్పష్టంగా కనిపించే చోటుకి రావడం వల్ల జీపీఎస్ శాటిలైట్ సిగ్నల్స్ నేరుగా అంది, ఆ పెద్ద సర్కిల్ కాస్తా చిన్నగా మారిపోయి మీ ఖచ్చితమైన లొకేషన్‌ను చూపిస్తుంది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story