Google Pixel 11a : పిక్సెల్ 11a లుక్ లీక్.. ఈసారి ఇంకా కాంపాక్ట్‌గా

గూగుల్ తన ఎంట్రీ లెవెల్ మోడల్ పిక్సెల్ 10a ను ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత మార్కెట్లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇది విడుదలైన కొద్ది రోజులకే దీని తదుపరి వెర్షన్

G Krishna
Published on: 30 Sept 2026 1:27 PM IST
Google-Pixel-11a
X

Google-Pixel-11a

గూగుల్ తన ఎంట్రీ లెవెల్ మోడల్ పిక్సెల్ 10a ను ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత మార్కెట్లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇది విడుదలైన కొద్ది రోజులకే దీని తదుపరి వెర్షన్ 'గూగుల్ పిక్సెల్ 11a' పై అంచనాలు మొదలయ్యాయి. తాజాగా ప్రముఖ టిప్‌స్టర్ ఆన్‌లీక్స్ సహకారంతో ఆండ్రాయిడ్ హెడ్‌లైన్స్ సంస్థ ఈ ఫోన్‌కు సంబంధించిన కంప్యూటర్ ఏడెడ్ డిజైన్ రెండర్లను లీక్ చేసింది. ఈ లీక్ ద్వారా రాబోయే పిక్సెల్ 11a డిజైన్, రంగులు, కొలతలు , ప్రధాన ఫీచర్ల వివరాలు వెలుగులోకి వచ్చాయి.

పెద్ద కెమెరా ఐలాండ్, ప్రీమియం లుక్

లీక్ అయిన డిజైన్ వివరాల ప్రకారం, పిక్సెల్ 11a తన మునుపటి మోడల్ పిక్సెల్ 10a తరహాలోనే ఫ్లాట్ రియర్ ప్యానెల్‌తో రానుంది. ఫోన్ వెనుక భాగంలో గూగుల్ ఐకానిక్ పిల్-షేప్ కెమెరా మోడ్యూల్ కొనసాగనున్నప్పటికీ, ఈసారి ఆ కెమెరా ఐలాండ్ పరిమాణం పిక్సెల్ 10a కంటే కాస్త పెద్దదిగా కనిపిస్తోంది. ఇందులో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌‌తో పాటు దాని పక్కనే ఎల్‌ఈడీ ఫ్లాష్‌ను అమర్చారు. ముందు భాగంలో సన్నటి అంచులకు బదులుగా కాస్త మందపాటి బెజెల్స్‌తో కూడిన ఫ్లాట్ డిస్‌ప్లేను అందించారు. స్క్రీన్ పైన సెల్ఫీ కెమెరా కోసం సెంటర్డ్ హోల్-పంచ్ కటౌట్ ఉంది. ఫోన్ కుడివైపు పవర్, వాల్యూమ్ బటన్లు ఉండగా, కింది భాగంలో యూఎస్‌బీ టైప్-సి పోర్ట్, స్పీకర్ గ్రిల్, మైక్రోఫోన్ కటౌట్ ఇచ్చారు.

నాలుగు కొత్త ఆకర్షణీయమైన రంగులు

ఈ కొత్త పిక్సెల్ 11a స్మార్ట్‌ఫోన్ మొత్తం నాలుగు విభిన్న రంగుల్లో లభించనుందని సమాచారం. బ్లాక్ షేడ్‌ను 'అబ్సిడియన్' పేరుతో, గ్రీన్ రంగును 'ఆలివ్' లేదా 'పిస్తాచియో' పేరుతో తీసుకురానున్నారు. ఇక పర్పుల్ వేరియంట్‌ను 'ఫ్రాస్ట్' అని, సిల్వర్ ఫినిషింగ్‌ను 'ఫాగ్' అని పిలవనున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

పిక్సెల్ 10a కంటే మరింత కాంపాక్ట్

కొలతల విషయానికి వస్తే పిక్సెల్ 11a తన మునుపటి మోడల్ కంటే కొద్దిగా చిన్నదిగా, చేతిలో పట్టుకోవడానికి మరింత అనువుగా ఉండనుంది. పిక్సెల్ 10a కొలతలు 153.9 x 73 x 9mm కాగా, రాబోయే పిక్సెల్ 11a సైజు 153.46 x 72.35 x 9mm గా ఉంటుందని తెలుస్తోంది.

సూపర్ బ్రైట్‌నెస్ డిస్‌ప్లే, టెన్సార్ G6 ప్రాసెసర్

ఇటీవలి నివేదికల ప్రకారం, ఈ ఫోన్ 6.3 అంగుళాల (1,080 x 2,424 పిక్సెల్స్) డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 2,250 నిట్స్ హెచ్‌డిఆర్ బ్రైట్‌నెస్, , ఏకంగా 3,350 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందించనుంది. దీనివల్ల తీవ్రమైన ఎండలో కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పనితీరు పరంగా ఇందులో గూగుల్ సొంత 'టెన్సార్ G6' చిప్‌సెట్‌ను ఉపయోగించనుండగా, మెరుగైన నెట్‌వర్క్ కనెక్టివిటీ కోసం మీడియాటెక్ M90 నెట్‌వర్కింగ్ చిప్‌ను పొందుపరచనున్నారు. ఫ్లాగ్‌షిప్ పిక్సెల్ 11 సిరీస్‌‌లోని శక్తివంతమైన ప్రాసెసర్ సాంకేతికతనే ఈ మోడల్‌కు అందించడం గమనార్హం.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.