ఇక ఏఐతో మీ సొంత యాప్ మీరే తయారు చేసుకోవచ్చు.. గూగుల్ ప్లే స్టోర్ లో కొత్త ఫీచర్లు..!

Google Play Store: గూగుల్ ప్లే స్టోర్‌లో భారీ మార్పులు వచ్చాయి. ఇకపై కోడింగ్‌లో నైపుణ్యం లేకపోయినా గూగుల్ ఏఐ స్టూడియో సాయంతో సొంత ఆండ్రాయిడ్ యాప్‌లను తయారు చేసి వ్యక్తిగతంగా ఉపయోగించుకోవచ్చు.

Venkat
Published on: 14 Oct 2026 9:17 PM IST
Google Play Store
X

ఇక ఏఐతో మీ సొంత యాప్ మీరే తయారు చేసుకోవచ్చు.. గూగుల్ ప్లే స్టోర్ లో కొత్త ఫీచర్లు..!

Google Play Store: గూగుల్ ప్లే స్టోర్‌లో కీలక మార్పులు వచ్చాయి. ఇక యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకోవడమే కాకుండా.. AI సాయంతో సొంత ఆండ్రాయిడ్ యాప్‌లను తయారు చేసి, వ్యక్తిగతంగా ఉపయోగించుకునే అవకాశం కూడా అందుబాటులోకి వస్తోంది. దీనితో పాటు యాప్‌లను పోల్చేందుకు ఆస్క్ ప్లే, వ్యక్తిగత అభిరుచులకు తగ్గ గేమ్స్‌ను సూచించే గేమ్ ఫైండర్ వంటి కొత్త ఫీచర్లను గూగుల్ ప్రకటించింది.

కోడింగ్ లేకుండానే సొంత యాప్..

గూగుల్ ఏఐ స్టూడియో ద్వారా సహజమైన భాషలో మనకు కావాల్సిన యాప్ గురించి చెబితే కస్టమ్ ఆండ్రాయిడ్ యాప్‌ను రూపొందించుకోవచ్చు. దీన్ని సొంత డివైజ్‌లో ఉపయోగించేందుకు డెవలపర్ అకౌంట్ అవసరం లేదు. ఈ వ్యక్తిగత యాప్‌లు పబ్లిక్ ప్లే స్టోర్ క్యాటలాగ్‌కు వేరుగా ఉంటాయి. ప్రస్తుతం ఈ సదుపాయం అమెరికాతో సహా ఎంపిక చేసిన మార్కెట్లలో 18 ఏళ్లు పైబడిన వారికి అందుబాటులోకి వస్తోంది.

యాప్‌లను పోల్చే ఆస్క్ ప్లే

ఆస్క్ ప్లే ద్వారా వినియోగదారులు తమకు కావాల్సిన యాప్ గురించి ప్రశ్నలు అడగవచ్చు. ఇప్పుడు ఒకేసారి పలు యాప్‌లను పోల్చి వాటి ముఖ్యమైన తేడాలు, యూజర్ అభిప్రాయాలను కూడా తెలుసుకునే అవకాశం లభిస్తుంది.

జెమినీలో గూగుల్ ప్లే స్టోర్

ప్లే ఇన్ జెమినీ ద్వారా గూగుల్ ప్లేలని యాప్‌లు, గేమ్స్, డెవలపర్ కంటెంట్‌ను జెమినీ సంభాషణల్లోనే కనుగొనే సదుపాయం రానుంది.

గేమర్ల కోసం గేమర్ డీఎన్ఏ

వినియోగదారుల అభిరుచులకు తగ్గ గేమ్స్‌ను సూచిస్తుంది. ఇందులోని గేమర్ డీఎన్ఏ

ఫీచర్ యూజర్ ఆడే గేమ్స్, ఇష్టపడే జానర్లు, గేమ్ మెకానిక్స్ వంటి అంశాలను విశ్లేషిస్తుంది. అలాగే గేమ్ ప్లే లిస్ట్, 48 గంటల స్పింట్స్, 30 సెకన్ల గేమ్ ప్లే బ్యాక్ వంటి ఫీచర్లు కూడా వచ్చాయి.

మొత్తంగా చూస్తే, గూగుల్ ప్లే స్టోర్ ను కేవలం యాప్ స్టోర్‌గా కాకుండా ఏఐ ఆధారిత యాప్ క్రియేషన్, వ్యక్తిగత డిస్కవరీ, గేమింగ్ ప్లాట్‌ఫామ్‌గా మార్చే దిశగా గూగుల్ అడుగులు వేస్తోంది.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.