GrapheneOS : పిక్సెల్‌కు పోటీగా మోటో.. గ్రాఫేన్ ఓఎస్ ఎంట్రీతో సీన్ మారేనా?

GrapheneOS : స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల డేటా ప్రైవసీ , సెక్యూరిటీపై ప్రత్యేక దృష్టి సారించే ప్రముఖ ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ‘గ్రాఫేన్ ఓఎస్’ (GrapheneOS)

G Krishna
Published on: 25 Aug 2026 2:23 PM IST
GrapheneOS
X

GrapheneOS

GrapheneOS : స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల డేటా ప్రైవసీ , సెక్యూరిటీపై ప్రత్యేక దృష్టి సారించే ప్రముఖ ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ‘గ్రాఫేన్ ఓఎస్’ (GrapheneOS) ఒక కీలక ప్రకటన చేసింది. ఇప్పటివరకు కేవలం గూగుల్ పిక్సెల్ (Google Pixel) స్మార్ట్‌ఫోన్లకు మాత్రమే పరిమితమైన ఈ సెక్యూర్ ఓఎస్, త్వరలోనే మోటోరోలా (Motorola) కంపెనీకి చెందిన ఎంపిక చేసిన ఫ్లాగ్‌షిప్ ఫోన్లలోకి రాబోతోంది. పిక్సెల్ బయట ఒక ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌కు గ్రాఫేన్ ఓఎస్ అధికారిక సపోర్ట్ ఇవ్వడం ఇదే తొలిసారి కావడం విశేషం.

2027 నాటికి మోటోరోలా ఫ్లాగ్‌షిప్స్, ఫోల్డబుల్స్‌లోకి ఎంట్రీ

సోషల్ మీడియా వేదిక మాస్టోడన్ (Mastodon) వేదికగా గ్రాఫేన్ ఓఎస్ ఫౌండేషన్ ఈ వివరాలను వెల్లడించింది. ప్రారంభంలో భాగంగా 2027లో రాబోయే మోటోరోలా రెగ్యులర్ (Slab-style) ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లో ఈ ఓఎస్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత మోటోరోలాకు చెందిన మోస్ట్ పాపులర్ ఫోల్డబుల్ సిరీస్ మోడల్స్ అయిన 'రేజర్ ఫోల్డ్' (Razr Fold) , 'రేజర్ అల్ట్రా' (Razr Ultra) ఫోన్లకు కూడా ఈ సపోర్ట్‌ను విస్తరించనున్నారు. ఈ ప్రణాళికలు అనుకున్నట్లుగా జరిగితే, గ్రాఫేన్ ఓఎస్‌కు అధికారికంగా సపోర్ట్ చేసే ప్రపంచంలోనే మొదటి క్లామ్‌షెల్ తరహా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌గా 'మోటో రేజర్ అల్ట్రా' చరిత్ర సృష్టించనుంది. అంతేకాకుండా, మోటోరోలా అందించే ఈ హార్డ్‌వేర్ గూగుల్ పిక్సెల్ కంటే అత్యంత హై-ఎండ్ వర్షన్‌లో, కాస్త ఎక్కువ ధరకే లభించనుంది.

ప్రస్తుత మోటోరోలా మోడల్స్‌కు ఎందుకు సపోర్ట్ లేదు?

ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న మోటోరోలా ఫోన్లలో గ్రాఫేన్ ఓఎస్ ఎందుకు రావడం లేదనే దానికి కూడా ఫౌండేషన్ స్పష్టమైన కారణాలను వివరించింది. గ్రాఫేన్ ఓఎస్ నిర్దేశించిన అత్యున్నత సెక్యూరిటీ ప్రమాణాలకు ప్రస్తుత హార్డ్‌వేర్ దాదాపు దగ్గరగా ఉన్నప్పటికీ, కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నట్లు తెలిపింది. ముఖ్యంగా 2026 మోడళ్లయిన మోటోరోలా సిగ్నేచర్, రేజర్ స్మార్ట్‌ఫోన్లలో హార్డ్‌వేర్ మెమరీ ట్యాగింగ్ , సెక్యూర్ ఎలిమెంట్ ఇంటిగ్రేషన్ వంటి కీలక భద్రతా ఫీచర్లు పరిపూర్ణంగా లేవని పేర్కొంది. అందుకే రాబోయే నెక్స్ట్-జనరేషన్ మోటోరోలా ఫ్లాగ్‌షిప్ హార్డ్‌వేర్ తమ ఓఎస్‌కు పర్ఫెక్ట్‌గా సరిపోతుందని భావిస్తోంది. క్వాల్కమ్ తదుపరి తరం ‘స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్’ (Snapdragon 8 Elite) ప్రాసెసర్ ప్లాట్‌ఫారమ్ తమ సెక్యూరిటీ అవసరాలను తీరుస్తుందని గ్రాఫేన్ ఓఎస్ ఆశిస్తోంది.

పిక్సెల్ సిరీస్‌కు సపోర్ట్ కొనసాగింపు

మోటోరోలా ఫోన్లకు సపోర్ట్ విస్తరిస్తున్నప్పటికీ, గూగుల్ పిక్సెల్ ఫోన్లకు తమ సేవలందించడం యథావిధిగా కొనసాగుతుందని కెనడాకు చెందిన ఈ నాన్-ప్రాఫిట్ ఆర్గనైజేషన్ స్పష్టం చేసింది. భవిష్యత్తులో రాబోయే గూగుల్ ‘పిక్సెల్ 11’ (Pixel 11) సిరీస్‌కు కూడా గ్రాఫేన్ ఓఎస్ అధికారిక సపోర్ట్‌ను అందిస్తుందని ఫౌండేషన్ ధృవీకరించింది. అత్యుత్తమ ప్రైవసీ కోరుకునే టెక్ లవర్స్‌కు మోటోరోలా రూపంలో ఒక సరికొత్త , శక్తివంతమైన ప్రత్యామ్నాయం అందుబాటులోకి రానుంది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story