ఇదెక్కడి గేమ్ రా సామీ.. విడుదలకు ముందే రూ.11,000 కోట్లు.. గేమింగ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ రికార్డ్..!

GTA 6: మ్యాచ్ మొదలుకాకముందే స్టేడియం ఫుల్, టికెట్లన్నీ హౌస్‌ఫుల్! గేమింగ్ ప్రపంచంలో ఇప్పుడు అదే జరుగుతోంది. నవంబర్ 19న విడుదల కానున్న GTA 6 ఆడకముందే రూ.11,000 కోట్లు కొల్లగొట్టింది.

Venkat
Published on: 17 Nov 2026 8:22 PM IST
GTA 6
X

ఇదెక్కడి గేమ్ రా సామీ.. విడుదలకు ముందే రూ.11,000 కోట్లు.. గేమింగ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ రికార్డ్..!

GTA 6: మ్యాచ్ మొదలుకాకముందే స్టేడియం ఫుల్, టికెట్లన్నీ హౌస్‌ఫుల్! గేమింగ్ ప్రపంచంలో ఇప్పుడు అదే జరుగుతోంది. నవంబర్ 19న విడుదల కానున్న GTA 6 ఆడకముందే రూ.11,000 కోట్లు కొల్లగొట్టింది. 1.21 కోట్ల ప్రీ-ఆర్డర్లతో ప్లే స్టేషన్, ఎక్స్ బాక్స్ రికార్డులన్నీ బద్దలయ్యాయి. 13 ఏళ్ల నిరీక్షణకు తెరపడబోతోంది!

టాస్ పడకముందే సెంచరీ..! GTA 6 ప్రీ-ఆర్డర్ ప్రభంజనం..

క్రికెట్‌లో టాస్ వేయకముందే సెంచరీ కొడితే ఎలా ఉంటుంది? నమ్మశక్యం కాదు కదా! కానీ రాక్ స్టార్ గేమ్ అదే చేసి చూపించింది. గ్రాండ్ థెప్ట్ ఆటో 6 విడుదలకు ఇంకా రెండు రోజులు ఉంది. గ్రౌండ్‌లోకి ఆటగాళ్లు దిగనే లేదు. అప్పుడే స్కోర్ బోర్డు మాత్రం 1.18 బిలియన్ డాలర్లు... అంటే దాదాపు రూ.11,050 కోట్లు!

మార్కెట్ రీసెర్చ్ సంస్థ సెన్సర్ టవర్ నవంబర్ 13 నాటి అంచనా ప్రకారం, GTA 6 కు ఇప్పటివరకు 1.21 కోట్ల డిజిటల్ ప్రీ-ఆర్డర్లు వచ్చాయి. ఇందులో సింహభాగం ప్లే స్టేషన్ 5 దే కావడం విశేషం.

1. ప్లే స్టేషన్ 5 టీమ్: దాదాపు 90.8 లక్షల ప్రీ-ఆర్డర్లు, దీని నుంచే 88 కోట్ల డాలర్ల రాబడి వస్తుందని అంచనా. మొత్తం ప్రీ-ఆర్డర్లలో 75% వాటా PS5 దే!

2. ఎక్స్ బాక్స్: దాదాపు 30.6 లక్షల ప్రీ-ఆర్డర్లు, దీని నుంచి 29.6 కోట్ల డాలర్ల రాబడి అంచనా.

అంటే గేమింగ్ టెస్ట్ మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లోనే PS5 భారీ లీడ్ తీసుకున్నట్లే!

అయితే ఇక్కడ ఓ ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇవి రాక్ స్టార్ గేమ్స్ లేదా దాని మాతృసంస్థ టేక్ టూ ఇంటరాక్టివ్ ప్రకటించిన అధికారిక లెక్కలు కావు. ఇవి కేవలం సెన్సర్ టవర్ సంస్థ అంచనాలు మాత్రమే. అది కూడా కేవలం డిజిటల్ ప్రీ-ఆర్డర్ల లెక్క. ఫిజికల్ డిస్కుల లెక్క ఇందులో లేదు.

ప్లే స్టేషన్ Vs ఎక్స్ బాక్స్.. హౌస్‌ఫుల్..!

సోనీ అధికారికంగా ప్రకటించిన లెక్కల మేరకు ప్లే స్టేషన్ స్టోర్ చరిత్రలోనే అత్యధిక ప్రీ-ఆర్డర్లు పొందిన గేమ్ GTA 6 అని. వెంటనే మైక్రోసాఫ్ట్ కూడా తగ్గలేదు. మైక్రోసాఫ్ట్ స్టోర్ చరిత్రలోనే నంబర్-1 ప్రీ-ఆర్డర్ టైటిల్ ఇదేనని ప్రకటించింది.

అంటే లాంచ్‌కు ముందే GTA 6 రెండు పెద్ద స్టేడియాల్లోనూ రికార్డులు తుడిచిపెట్టేసింది. రాక్ స్టార్ కు ఇది డబుల్ సెంచరీ కంటే తక్కువేమీ కాదు.

GTA 5 vs GTA 6..

2013లో వచ్చిన GTA 5 అప్పట్లో విడుదలైన మూడు రోజుల్లోనే 100 కోట్ల డాలర్ల అమ్మకాలతో వినోద ప్రపంచంలోనే అత్యంత వేగంగా డబ్బు సంపాదించిన లాంచ్‌గా నిలిచింది.

ఇప్పుడు GTA 6 ఆడకముందే, కేవలం ప్రీ-ఆర్డర్లతోనే 100 కోట్ల డాలర్ల మార్కును దాటేసింది. అయితే రెండింటినీ నేరుగా పోల్చలేం. GTA 5 ది లాంచ్ తర్వాత అమ్మకాల లెక్క, GTA 6 ది లాంచ్‌కు ముందు అంచనా లెక్క.

ఈ గేమ్‌ను తయారు చేయడానికి 1.5 నుంచి 3 బిలియన్ డాలర్లు ఖర్చయిందని టాక్. దాదాపు 13 ఏళ్లు శ్రమించారు. కాబట్టి ప్రీ-ఆర్డర్ డబ్బుతోనే పెట్టుబడిలో సగం వెనక్కి వచ్చేసినట్లే అని ట్రేడ్ పండితులు లెక్కలు వేస్తున్నారు.

విడుదల ఎప్పుడంటే..

నవంబర్ 19, 2026న GTA 6 ప్లే స్టేషన్ 5, ఎక్స్ బాక్స్ సిరీస్ X|S కోసం విడుదల కానుంది. పీసీ వెర్షన్‌పై ఇంకా క్లారిటీ లేదు.

ఈసారి ఇద్దరు ఓపెనర్లు జాన్సన్, లూసియా. వేదిక.. అమెరికాలోని ఫ్లోరిడా స్ఫూర్తితో రూపొందించిన ఊహాజనిత లియో నిడా రాష్ట్రం. అందులో మోస్ట్ ఫేమస్ సిటీ.. మనందరికీ తెలిసిన వైస్ సిటీ..! పాత అభిమానులకు ఇది నోస్టాల్జియా సిక్సర్!

13 ఏళ్ల నిరీక్షణ, భారీ ఓపెన్ వరల్డ్, రాక్ స్టార్ మార్క్ క్వాలిటీ.. ఈ మూడూ కలిసి ఈ క్రేజ్‌కు కారణమయ్యాయి.

ఇప్పుడు అసలైన ప్రశ్న ఒక్కటే — విడుదల తర్వాత కూడా ఇదే దూకుడు కొనసాగుతుందా? మొదటి వారంలోనే GTA 6 అన్ని రికార్డులు బద్దలు కొడుతుందా? సమాధానం కోసం నవంబర్ 19 వరకు ఆగాల్సిందే. అప్పటివరకు.. గేమ్ ఆన్!

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.