HMD Vibe 2 Pro: తక్కువ ధరలో భారీ ఫీచర్లతో వస్తున్న HMD Vibe 2 Pro.. లాంచ్ డేట్, ఫీచర్స్ ఇవే

HMD Vibe 2 Pro: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సెప్టెంబర్ చివరి వారం కొత్త డివైజెస్‌ల లాంచ్‌తో మరింత హీటెక్కింది.

CR Reddy
Published on: 27 Sept 2026 10:17 AM IST
HMD Vibe 2 Pro
X

HMD Vibe 2 Pro

HMD Vibe 2 Pro: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సెప్టెంబర్ చివరి వారం కొత్త డివైజెస్‌ల లాంచ్‌తో మరింత హీటెక్కింది. ప్రముఖ మొబైల్ బ్రాండ్ హెచ్‌ఎండీ తన విజయవంతమైన వైబ్ సిరీస్‌ నుంచి తదుపరి స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు పూర్తి చేసింది. కంపెనీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న HMD Vibe 2 Pro స్మార్ట్‌ఫోన్ సెప్టెంబర్ 29న అధికారికంగా భారతీయ మార్కెట్లో విడుదల కానుంది. లాంచ్‌కు ముందే ఈ ఫోన్‌కు సంబంధించిన కలర్ ఆప్షన్లు, కీలకమైన స్పెసిఫికేషన్లు ఆన్‌లైన్‌లో లీకై టెక్ లవర్లలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ వేదికగా ఈ ఫోన్ విక్రయానికి అందుబాటులోకి రానుంది.

అద్భుతమైన డిస్‌ప్లే, ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లు

ఫ్లిప్‌కార్ట్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక మైక్రోసైట్ ప్రకారం.. HMD Vibe 2 Pro స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన డిజైన్‌తో రానుంది. ఈ ఫోన్‌లో 6.78 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను అందించనున్నారు. అంతేకాకుండా స్క్రీన్ స్మూత్‌నెస్ కోసం ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఇవ్వడం విశేషం. వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఈ ఫోన్‌ను ఆక్వా గ్రీన్, కాస్మిక్ పర్పుల్, సిల్వర్ మిస్ట్ అనే మూడు కలర్ ఆప్షన్లలో ప్రవేశపెట్టనున్నారు.

పవర్ఫుల్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ లైఫ్

పెర్ఫార్మెన్స్ పరంగా ఈ ఫోన్ చాలా బలంగా ఉండనుంది. HMD Vibe 2 Pro స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 5G ప్రాసెసర్‌ను పొందుపరిచారు. దీనికి జతగా 8GB వరకు ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ సదుపాయం లభిస్తుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే, ఈ ఫోన్ మెయిన్ హైలైట్ దీని బ్యాటరీనే అని చెప్పవచ్చు. ఇందులో ఏకంగా 6,000mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని ఇచ్చారు. దీనికి తోడు 33W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. ఈ ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది.

కెమెరా, ప్రత్యేకమైన ఇండస్ ఏఐ ఫీచర్

ఫోటోగ్రఫీ ప్రియులను ఆకట్టుకునేలా ఈ ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో 64 మెగాపిక్సెల్ సోనీ IMX682 మెయిన్ సెన్సార్‌తో పాటు మరో 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 13 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఇవన్నీ పక్కన పెడితే, ఈ ఫోన్ ప్రత్యేకతలలో ఇండస్ ఏఐ ఫీచర్ ప్రధానమైనదిగా నిలవనుంది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ దాదాపు 22 భారతీయ భాషలకు సపోర్ట్ చేయనుంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.