HMD కొత్త 5G ఫోన్.. 6000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 29న ఎంట్రీ.!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ HMD, భారతీయ మార్కెట్లో తన నూతన ఫోన్ 'వైబ్ 2 ప్రొ' (HMD Vibe 2 Pro) లాంచ్ తేదీని అధికారికంగా ఖరారు చేసింది. ఈ ఏడాది..
HMD Vibe 2 Pro
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ HMD, భారతీయ మార్కెట్లో తన నూతన ఫోన్ 'వైబ్ 2 ప్రొ' (HMD Vibe 2 Pro) లాంచ్ తేదీని అధికారికంగా ఖరారు చేసింది. ఈ ఏడాది మే నెలలో ప్రారంభ ధర రూ. 10,999 తో పరిచయమైన 'వైబ్ 2 5G' విజయవంతం కాగా, దానికి కొనసాగింపుగా ఇప్పుడు మరింత మెరుగైన ఫీచర్లతో ఈ Pro మోడల్‌ను తీసుకొస్తోంది. ఈ కొత్త హ్యాండ్సెట్ ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ద్వారా విక్రయించబడనుంది. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన ప్రత్యేక మైక్రోసైట్ ఆధారంగా ఫోన్‌కు సంబంధించిన పలు డిజైన్ వివరాలు, రంగులు , కీలక స్పెసిఫికేషన్లు వెల్లడయ్యాయి.
ఆకట్టుకునే డిస్ప్లే, వర్ణరంజితమైన డిజైన్
విజువల్ అనుభవాన్ని మరింత పెంచేందుకు ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.78-అంగుళాల Full-HD+ డిస్ప్లేను అందించారు. స్మూత్ స్క్రోలింగ్ , గేమింగ్ ప్రాసెసింగ్ కోసం ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. వినియోగదారులను ఆకట్టుకునేలా ఈ ఫోన్‌ను ఆక్వా గ్రీన్ (Aqua Green), కాస్మిక్ పర్పుల్ (Cosmic Purple), , సిల్వర్ మిస్ట్ (Silver Mist) అనే మూడు విభిన్నమైన , ఆకర్షణీయమైన రంగులలో అందుబాటులోకి తెస్తున్నారు.
శక్తివంతమైన ప్రాసెసర్, భారతీయ భాషల AI ఫీచర్లు
మెరుగైన పర్ఫార్మెన్స్ కోసం ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 (MediaTek Dimensity 6300) చిప్సెట్తో రన్ అవుతుంది. 8GB వరకు RAM , 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తున్న ఈ హ్యాండ్సెట్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 (Android 16) ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. దీనికి అదనంగా, భారతీయ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని 22 ప్రాంతీయ భాషలకు సపోర్ట్ చేసే ప్రత్యేక 'ఇండస్ AI' (Indus AI) ఫీచర్‌ను కూడా ఈ డివైజ్‌లో చేర్చారు.
ప్రీమియం సోనీ కెమెరా, భారీ బ్యాటరీ కెపాసిటీ
ఫోటోగ్రఫీ కోసం ఇందులో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను ఏర్పాటు చేశారు. ప్రధాన కెమెరాగా 64-మెగాపిక్సెల్ సోనీ IMX682 (Sony IMX682) సెన్సార్‌ను అందించగా, దానితో పాటు 2-మెగాపిక్సెల్ మైక్రో కెమెరా ఉంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందూ వైపున 13-మెగాపిక్సెల్ కెమెరా ఉంది. సుదీర్ఘ కాలం పాటు చార్జింగ్ సమస్య లేకుండా వాడేందుకు వీలుగా ఇందులో 6,000mAh భారీ బ్యాటరీని అమర్చారు, ఇది 33W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. గతంలో వచ్చిన వైబ్ 2 మోడల్లోని 50MP కెమెరా , 18W ఛార్జింగ్‌తో పోలిస్తే, ఈ నయా Pro వేరియంట్ ఛార్జింగ్, కెమెరా , డిస్ప్లే విభాగాలలో అప్‌గ్రేడెడ్ అనుభవాన్ని అందిస్తుంది.




