Honor Win Turbo : ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు.. 10,000mAh బ్యాటరీతో కొత్త ఫోన్ ఎంట్రీ.!

Honor Win Turbo : స్మార్ట్‌ఫోన్ల బ్యాటరీ లైఫ్ విషయంలో వినియోగదారులకు ఉన్న చింతను పూర్తిగా తుడిచేయడానికి ప్రముఖ మొబైల్ బ్రాండ్ ‘ఆనర్’ (Honor) సరికొత్త సంచలనాని..

G Krishna
Published on: 30 May 2026 4:00 PM IST
Honor-Win-Turbo
X

Honor-Win-Turbo

Honor Win Turbo : స్మార్ట్‌ఫోన్ల బ్యాటరీ లైఫ్ విషయంలో వినియోగదారులకు ఉన్న చింతను పూర్తిగా తుడిచేయడానికి ప్రముఖ మొబైల్ బ్రాండ్ ‘ఆనర్’ (Honor) సరికొత్త సంచలనానికి తెరలేపింది. చైనా మార్కెట్లో శుక్రవారం జరిగిన ఒక ప్రత్యేక ఈవెంట్‌లో ఏకంగా 10,000mAh రాక్షస బ్యాటరీతో కూడిన ‘ఆనర్ విన్ టర్బో’ (Honor Win Turbo) స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ అధికారికంగా లాంచ్ చేసింది. కేవలం బ్యాటరీ మాత్రమే కాకుండా పరిశ్రమలోనే అత్యధికంగా 8000 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్ గల డిస్‌ప్లే, అదిరిపోయే రేసింగ్ ఎడిషన్ ప్రాసెసర్‌తో మిడ్-రెంజ్ విభాగంలో ఈ ఫోన్‌ అడుగుపెట్టింది. చైనా మార్కెట్ తర్వాత ఈ పవర్‌ఫుల్ మోడల్ త్వరలోనే గ్లోబల్ మార్కెట్లోకి కూడా అడుగుపెట్టే అవకాశం ఉంది.

ధరలు , లభ్యత వివరాలు

ఆనర్ విన్ టర్బో స్మార్ట్‌ఫోన్‌ను బ్లాక్, బ్లూ , వైట్ అనే మూడు ఆకర్షణీయమైన రంగుల్లో వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చారు. ధరల విషయానికి వస్తే దీని బేస్ వేరియంట్ అయిన 12GB రామ్ , 256GB స్టోరేజ్ మోడల్ ధరను సుమారు రూ.46,000 గా నిర్ణయించారు. అలాగే ఇందులో ఎక్కువ స్టోరేజ్ సామర్థ్యం గల 12GB రామ్ , 512GB వేరియంట్ ధర సుమారు రూ.50,000 కాగా, 16GB రామ్ , 512GB స్టోరేజ్ గల టాప్-ఎండ్ మోడల్ ధర సుమారు రూ.60,000 గా ఖరారు చేశారు.

డిస్‌ప్లే , ప్రాసెసర్ ప్రత్యేకతలు

ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత మ్యాజిక్ ఓఎస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. ఇందులో 94.62 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో, 120Hz రిఫ్రెష్ రేట్ , కళ్లకు పూర్తి రక్షణనిచ్చే 3840Hz పిడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ ఫీచర్ గల 6.79-ఇంచుల 1.5K అమోలెడ్ ఓయాసిస్ ఐ ప్రొటెక్షన్ డిస్‌ప్లేను అందించారు. ఈ స్క్రీన్ ఎండలో కూడా స్పష్టంగా కనిపించేలా ఏకంగా 8000 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ను ఇస్తుంది. కమ్యూటింగ్ , హెవీ పర్ఫార్మెన్స్ కోసం ఇందులో 4 నానోమీటర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8500 రేసింగ్ ఎడిషన్ చిప్‌సెట్‌ను, మాలీ-G720 గ్రాఫిక్స్ కార్డును ఉపయోగించారు. ఇది గరిష్టంగా 16GB వరకు ఎల్‌పీడీడీఆర్5ఎక్స్ రామ్ , 512GB వరకు వేగవంతమైన యూఎఫ్ఎస్ 4.1 ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది. వీటికి తోడు లిఫ్టులు, అండర్‌గ్రౌండ్ పార్కింగ్‌లు , హైస్పీడ్ రైల్వే స్టేషన్ల వంటి సిగ్నల్ తక్కువగా ఉండే ప్రదేశాలలో కూడా నెట్‌వర్క్ స్థిరంగా ఉండేలా ఇందులో ప్రత్యేకంగా ‘C1+ ఆర్‌ఎఫ్’ ఎన్‌హ్యాన్స్‌మెంట్ చిప్‌ను అమర్చారు.

కెమెరా , కూలింగ్ సిస్టమ్

ఫొటోగ్రఫీ విషయానికి వస్తే ఆనర్ విన్ టర్బో వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్ , ఎఫ్/1.88 అపెర్చర్ గల 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు, వైడ్ షాట్ల కోసం మరొక 5 మెగాపిక్సెల్ వైడ్-యాంగిల్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీల కోసం ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ కెమెరాను ఇచ్చారు. ఈ ఫోన్‌లో హెవీ గ్రాఫిక్స్ గేమ్‌లు ఆడేటప్పుడు , ఎక్కువ సమయం వాడేటప్పుడు హ్యాండ్‌సెట్ వేడెక్కకుండా చూసేందుకు ఏకంగా 40,000 చదరపు మిల్లీమీటర్ల విస్తీర్ణం గల భారీ లిక్విడ్ కూలింగ్ ఏరియాను ఫోన్ లోపల డిజైన్ చేశారు.

10,000mAh బ్యాటరీ , రగ్గడ్ ప్రొటెక్షన్

ఈ ఫోన్‌లోని 10,000mAh భారీ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేయడానికి 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందించారు. అంతేకాకుండా అత్యవసర సమయాల్లో దీని ద్వారా ఇతర మొబైళ్లను ఛార్జ్ చేసుకునేందుకు వీలుగా 27W రివర్స్ ఛార్జింగ్ ఫీచర్‌ను కూడా ఇవ్వడం విశేషం. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఈ ఫోన్ నిరంతరాయంగా 17.3 గంటల పాటు నావిగేషన్, 14.2 గంటల పాటు గేమింగ్ టైమ్ ఇస్తుందని కంపెనీ స్పష్టం చేసింది. ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నప్పటికీ ఈ ఫోన్ కేవలం 7.98 మిల్లీమీటర్ల మందం, 216 గ్రాముల బరువుతో స్లిమ్‌గా ఉంటుంది. భద్రత పరంగా ఈ మొబైల్‌కు ఐపీ66, ఐపీ68, ఐపీ69 , ఐపీ69K వంటి అత్యున్నత రేటింగులు ఇచ్చారు, దీనివల్ల నీరు, ధూళి, హై-ప్రెజర్ వాటర్ స్ప్రేల నుంచి ఫోన్‌కు పూర్తి రక్షణ ఉంటుంది. వీటితో పాటు కింద పడినా, గట్టిగా ఒత్తిడికి గురైనా స్క్రీన్ పగలకుండా ఉండేలా ఎస్‌జీఎస్ గోల్డ్ స్టాండర్డ్ ఫైవ్-స్టార్ డ్రాప్ అండ్ క్రష్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్‌ను కూడా ఈ ఫోన్ సొంతం చేసుకుంది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story