11,000mAh బ్యాటరీతో హానర్ నుంచి సరికొత్త ఫోన్.. కెమెరాతోపాటు ఫీచర్లు చూస్తే ఫిదానే..!
HONOR X9e Pro: హానర్ మరో పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. HONOR X9e Pro పేరుతో లాంచ్ అయిన ఈ ఫోన్‌లో ఏకంగా 11,000mAh భారీ బ్యాటరీ ఇచ్చారు.
11,000mAh బ్యాటరీతో హానర్ నుంచి సరికొత్త ఫోన్.. కెమెరాతోపాటు ఫీచర్లు చూస్తే ఫిదానే..!
HONOR X9e Pro: హానర్ తన కొత్త పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్ హానర్ X9e ప్రోను లాంచ్ చేసింది. భారీ బ్యాటరీతో పాటు డిస్‌ప్లే, కెమెరా, డ్యూరబిలిటీ, ఏఐ ఫీచర్లపై కంపెనీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఈ ఫోన్‌లో ఏకంగా 11,000mAh బ్యాటరీని అందించారు. ఇంత భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీ సాధారణ స్మార్ట్‌ఫోన్లలో చాలా అరుదుగా కనిపిస్తుంది. కంపెనీ ప్రకారం, మిక్స్‌డ్ యూజ్‌లో ఈ బ్యాటరీ మూడు రోజుల వరకు బ్యాకప్ అందించగలదు. బ్యాటరీలో నాలుగో తరం సిలికాన్ కార్బన్ టెక్నాలజీని ఉపయోగించారు. ఛార్జింగ్ కోసం 80W వైర్డ్ సూపర్ ఫాస్ట్ సపోర్ట్ ఇచ్చారు.
1.5K 120Hz AMOLED డిస్‌ప్లే..
హానర్ X9e ప్రోలో 6.8 ఇంచుల 1.5K డిస్‌ప్లే ఉంది. దీనికి అడాప్టివ్ రీప్రెస్ రేట్ తో పాటు గరిష్ఠంగా 120Hz రిఫ్రెష్ రేట్ అందించారు. స్క్రోలింగ్, వీడియోలు, గేమింగ్ సమయంలో స్మూత్ విజువల్స్ అందించేందుకు ఇది ఉపయోగపడుతుంది. డిస్‌ప్లే గరిష్ఠంగా 10,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. దీంతో బయట ఎండలో కూడా స్క్రీన్‌ను స్పష్టంగా చూడటానికి మెరుగైన విజిబిలిటీ లభిస్తుంది.
స్నాప్ డ్రాగన్ 6 జనరేషన్ 5 ప్రాసెసర్..
పనితీరు కోసం హానర్ X9e ప్రోలో 4nm స్నాప్ డ్రాగన్ 6 జనరేషన్ 5 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. ఈ ఆక్టా-కోర్ ప్రాసెసర్ గరిష్ఠంగా 2.6GHz క్లాక్ స్పీడ్‌తో పనిచేస్తుంది. గ్రాఫిక్స్ కోసం అడార్నో 812 GPUను అందించారు. ర్యామ్ పరంగా 8GB, 12GB ఆప్షన్లు ఉన్నాయి. రెండు వేరియంట్లలోనూ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. ఇక ఫోటోగ్రఫీ కోసం వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108MP మెయిన్ కెమెరాను అందించారు. దీనికి f/1.75 అపర్చర్‌తో పాటు OIS సపోర్ట్ ఉంది. దీనికి 5MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా జత చేశారు. ఈ కెమెరాకు f/2.2 అపర్చర్ ఉంది. రియర్ కెమెరాతో 4K వీడియో రికార్డింగ్ చేసుకునే అవకాశం ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 16MP కెమెరాను అందించారు.
డ్యూరబిలిటీకి ప్రత్యేక ప్రాధాన్యత..
స్నాప్ డ్రాగన్ 6 జనరేషన్ 5 ప్రాసెసర్‌లో డ్యూరబిలిటీపై కూడా కంపెనీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఈ ఫోన్‌కు IP69K రేటింగ్ ఇచ్చారు. దీంతో దుమ్ము, నీరు వంటి వాటి నుంచి రక్షణ లభిస్తుంది. కంపెనీ ఈ ఫోన్‌లో బ్యాటరీ కెపాసిటీ, స్ట్రక్చరల్ డ్యూరబిలిటీ, డిస్‌ప్లే, ఇమేజింగ్, ఇంటిగ్రేటెడ్ AI వంటి ఐదు ప్రధాన అంశాలపై దృష్టి పెట్టినట్లు తెలిపింది.
స్నాప్ డ్రాగన్ 6 జనరేషన్ 5 ప్రాసెసర్ ధర ఎంత?
స్నాప్ డ్రాగన్ 6 జనరేషన్ 5 ప్రాసెసర్ను మిడిల్ ఈస్ట్, యూఏఈ సహా పలు అంతర్జాతీయ మార్కెట్లలో అందుబాటులోకి తీసుకురానున్నారు.
8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర AED 1,499గా ఉంది. భారత కరెన్సీలో ఇది సుమారు రూ. 38,840.
12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర AED 1,799, అంటే సుమారు రూ. 46,615. కాగా, భారతదేశంలో స్నాప్ డ్రాగన్ 6 జనరేషన్ 5 ప్రాసెసర్ ధర, లాంచ్ తేదీ గురించి కంపెనీ అధికారికంగా ప్రకటించిన తర్వాతే దేశీయ ధరపై స్పష్టత వస్తుంది.
11,000mAh భారీ బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 1.5K 120Hz AMOLED డిస్‌ప్లే, 108MP OIS కెమెరా, IP69K రేటింగ్ వంటి ఫీచర్లతో స్నాప్ డ్రాగన్ 6 జనరేషన్ 5 ప్రాసెసర్ బ్యాటరీపై ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంది.




